మనలో చాలా మంది అహంకారం అంటే, గర్వం అని అర్థం వాడతాము ..కానీ ,అహంకారం అంటే, నేను అనే భావన. నేను, నాది అనే భావాలు అహంకార జనితాలు. మనలని ఎవరయినా అవమానపరిచినా , ఏదన్నా మాట అన్నా, మనలోని అహంకారం తోక తొక్కిన పాము లా పైకి లేస్తుంది..తిరిగి వారిని ఏదయినా ఘాటు ప్రతిస్పందన ఇచ్ఛేదాకా మనలోని అహం మనలని నిలవనీయదు..అంతగా మనలని కలవరపెట్టే ఈ అహం ని సమర్థ సద్గురువు కృప తో మనం తొలగించుకోవచ్చ్చు.
ప్రతి రోజు , ప్రతి క్షణమూ మన మనసు లో వచ్ఛే భావాలను మనం గమనిస్తూ ఉండాలి. మనసే మనిషికి శత్రువు , మన మనసే మనకి మిత్రువు .మనసు ని శత్రువు గా మార్చుకోవాలా, మిత్రువు గా నా అనేది మనహ పరిశీలన అనే సాధన పై ఆధారపడి వుంది . ప్రతికూల భావాలు మనసులో తలెత్తుతున్నాయి అని అనిపించినా క్షణమే మనం వాటి పై యుద్ధం ప్రకటించాలి, వాటిని తరిమి వేయాలి. అలా తిరిగి శాంతిని పొందాలి. అహం విషయానికి వస్తే, అహమే మిగితా అరిషడ్వార్గాలకి మూలమవుతుంది. కామం ఏదయినా పొందాలి , పొంది సుఖం గా ఉండాలి అనే భావన కి కారణం అహం. అలాగే క్రోధం, మొహం, లోభం, మదం, మాత్సర్యం అన్నీ అహంకారం నేను అనే భావం నుండి వచ్చినవే..అన్నీ నాకు, నా వాళ్లకే చెందాలి, నేను నా వాళ్ళే బాగు పడాలి అనే భావన ఇంచుమించు మన ప్రతీ పని లో ను తొంగి చూస్తుంది..కారణం అహంకారమే. మనమందరము ఈ శరీరం కాదు, ఆ పరమాత్మ స్వరూపాలమే, మన స్వరూపం ఒక్కటే. నీలో వున్నది బయట అంతటా, అందరిలో వున్నది అని తెలుసుకున్న నాడు ఈ అహంకారం అంతమవుతుంది..నీలో వున్నది, మిగితావారిలో వున్నది వేరేదో కాదు అని తెలుసుకున్నప్పుడు మొహం ఉదయించదు,ద్వేషం ఏర్పడదు. అప్పుడు బయట వున్నది కూడా మన లా ఆ పరమాత్మ స్వరూపమే, అనగా వారు ఆ పరమాత్మ బిడ్డలే అని తలచి వారి పై న మన ప్రేమ ని చూయించాలి.అలా స్వార్ధాన్ని జయించాలి
ఎవరయినా మనలని ఒక మాట అన్నారు, బాధ కలిగింది లేదా కోపం వస్తుంది. అప్పుడు మనసు అల్లకల్లోలం అవుతుంది. ఆ సమయం లో, ఇలా ప్రశ్నించుకోవాలి.” నన్ను ఇలా అన్నారు అని బాధపడుతున్నాను. ఇంతకీ, “నేను” అంటే ఎవరిని? నేను అంటే ఈ శరీరమా, ఈ నా పేరా, కాదు. నేను అంటే ఆ పరమాత్మ స్వరూపమే, నిర్గుణ నిరాకార పరభ్రహ్మ స్వరూపమే..కానీ , మాయ చే ఆవరించబడి, నా స్వరూపాన్ని మర్చిపోయాను..వారు అన్నది నన్ను కాదు, ఈ నా శరీరాన్ని ఆ దేవం నుండి నన్ను విడదీసి నన్ను భావించి అంటున్నారు..కానీ, నా నిరాకార తత్త్వం నాకు తెలుసు, కాబట్టి వారి మాటలు నాకు అంటవు..నేను చిద్విలాసం , స్థిర శాంతి ఉట్టిపడే ఆత్మ స్వరూపమే అసలయిన “నేను”,” అని మనసులో అనుకున్నచో, మనలని ఎవరు అవమానపర్చినా, భాధించినా మన అసలు స్థితి ఐన ‘పరమ శాంతి ” నుండి ఎన్నటికీ మనము కోల్పోము ..ఎవరన్నా ఏదో అన్నారు, అననీయండి.. చిరునవ్వుతో సాగిపోండి, మనసులో దేవ స్మరణ తో..అవసరమయితే ఒక మాటలో సమాధానం చెప్పండి.”ఎవరయినా నీ గూర్చి పది మాటలు మాట్లాడితే, అక్కడ అవసరమయితే, ఒక్క మాటలో సమాధానం చెప్పు ” అని సాయి అన్నారు..ఏది జరిగినా భగవంతుడి సంకల్పం తో నే అయినప్పుడు, అవమానం కూడా ఆ భగవద్ ప్రసాదం గా, మన కర్మ క్షయం జరగడానికి అని అనుకుని ముందుకెళదాం “మహదానందం” గా..
అయితే, ఒక్కోసారి, మితిమీరి ,వారి చర్యలతో పదే పదే మనలని హింసించేవారు, మనం చేస్తున్న పనులకి వారి మూర్ఖత్వం తో అడ్డుపడే వారు మనకి ఎదురవ్వొచ్చు. అపుడు సమయానుకూలంగా వారితో కఠినం గా వ్యవహరించాల్సివస్తుంది..”అన్ని వేళలా విధేయత మంచిది కాదు. మూర్ఖుల పట్ల కఠినం గా వ్యవహరించక తప్పదు.” అనే సాయి మాట ను కూడా గుర్తు చేసుకుందాం..నిరుపేదలని, అమాయకులని పీడించే ఇలాంటివారు ఎదురయ్యినపుడు, అన్యాయాన్ని చూస్తూ కూర్చోవడం కూడా దోషం అవుతుందంటారు.అలాంటి పరిస్థితిల్లో అన్యాయాలు , అక్రమాలని ఎదుర్కోవడం మన బాధ్యత. మనం ఈరోజు నుండే మనలోనే “అహంకారం” అనే శత్రువు ని పారద్రోలడానికి సమాయత్తం అయ్యి సాయి ప్రేమ సామ్రాజ్యం విస్తరణ లో మన వంతు పాత్ర వహిద్దాము. జై సాయిరాం..
Very good message
LikeLiked by 1 person
sai krupa
LikeLike