సాయి తో నా అనుభవాలు(1)

13239037_1723616547914971_5052580146388112322_n

సాయిరాం .. ఈరోజు సాయి తో నా అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా ..నిజానికి నేను చెప్పాలంటే నేను ఆధ్యాత్మికం గా మంచి అలవాట్లు వేటినీ సరిగ్గా పాటించలేకపోతున్నా భక్త సులభుడయినా సాయినాథుడు పిలిస్తే పలికే దేవం గా ఎప్పుడూ తన ఉనికి ని నాకు రుజువు చేస్తుంటాడు. (అపుడపుడూ ఊరికే చూస్తూ వుంటాడనుకోండి, ఎందుకంటే, కర్మ తన పనిని తాను చేసుకుపోతుంది. మనం చేసిన దాన్ని మనం అనుభవించాల్సిందే, కాబట్టి మన సాయి మన కర్మ బలీయం అయినపుడు బాబా కొన్ని సార్లు చూస్తూ ఊరుకోవాల్సి వస్తోంది. కానీ, మనం అనుభవించాల్సిన కర్మ ని చాలా మటుకు తగ్గిస్తాడు..మనమంటే సాయి కి చాలా ప్రేమ.)

మొదటిసారిగా, నేను నా ఏడవ ఏట సాయి అంటే పరిచయం పొందాను మా పక్కింట్లో వుండే సాయి కి అంకిత భక్తుడయిన శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి ద్వారా.(గురువు గారు )..వారింట్లో ప్రతీ వారం సాయి భజన , రోజూ నాలుగు హారతులు, ఆదివారాలు సత్సంగాలు నిర్వహించేవారు..అపుడపుడూ నేను వెళ్లేదాన్ని..ఆ కార్యక్రమాలకి సాయి హాజరవుతుండటం మా అమ్మ వాళ్ళు గమనించేవారు.( సుమారు 9  కుటుంబాలవారుండే, ఆ బిల్డింగ్ లోని అందరూ ,ముఖ్యం గా పెద్దవారు ప్రతేరొజూ అందులో పాల్గొనేవారు ..నేను అపుడు చాలా చిన్నదాన్నవడం వాళ్ళ తక్కువ గా వెళ్లేదాన్ని) చాలా సార్లు, నామం మంచి పట్టు లో వున్నప్పుడు , ఏదయినా శుభ కార్యక్రమం అవుతున్నప్పుడు, కీలకమయిన సమయాల్లో అంటే ఒక నిమిషం కరెంట్ పోయి మల్లి వెంటనే వచ్ఛేది..గురువుగారినడిగితే, బాబా యిక్కడ వచ్చారనడానికి ఒక సంకేతం యిస్తారు అని చెప్పారు..ఒకసారి కాకడ ఆరతి జరుగుతున్న టైం లో అంత ఉదయమే, ఒక ముదుసలి కోతి వచ్చి ఆరతి పాడేవారి పక్కనే కూర్చుని మౌనం గా వింటూ వుంది, సరిగ్గా ఆరతి అయిపోగానే వెళ్లిపోయింది బయటకి..ఒకసారి మా అమ్మగారు వారి పోర్షన్ లో జరిగిన హారతి కి హాజరయ్యి తిరిగి మాయింటికొచ్చి చూసేసరికి, కరెంటు బోర్డు లో చిన్న మంటలు చూసి వాటిని ఆర్పివేద్దామని, అనాలోచితం గా పక్కన కనిపించిన చెంబు లో ని నీళ్లు తీసుకుని మంట పై  చిలకరించబోయింది, అంతలో నే “ఆగు, వద్దు” అని వినిపించాయట..తన భక్తులని కాపాడ్డానికి సాయి ఎప్పుడు అప్రమత్తం గా వుంటారు .అలా మాకు సాయినాథుడు వారి ద్వారా మా లైఫ్ లో ప్రవేశించారు.అప్పటినుండీ మేము బాబా పూజ, హారతులు చేయసాగాము. 

నా 15 వ ఏట ,ఒక రోజు నేను ఆరతి భక్తి తో పడుతూ వున్నాను, సడన్ గా నా దృష్టి చాలా పగిలిన నా అరికాళ్లపై పడి, అసలు ఈ పగుళ్లు ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అని భావం కల్గింది ..వెంటనే, “మాటల కి అందని వైద్యుడు ” అని నా మైండ్ లో అక్షరాలూ కనిపించాయి ఫ్లాష్ గా, అలాగే, ఆ మాట గంభీరం గా మైండ్ లో  వినిపించినది..ఫస్ట్ టైం ఈ అనుభవం కలగగానే, ఒళ్ళు జలదరించింది..లాతూర్ లో భూకంపం వఛ్చిన కొన్ని రోజుల ముందు, మా యింట్లో గోడలు బీటలు పడ్డట్లు కల వచ్చింది ..అలాగే ఆ రోజు, మా ఇంట్లో వస్తువులు కదిలాయి.కొన్ని ముందు జరగబోయే విషయాలు కూడా యిలా కలల్లో బాబా తెలుపుతుంటారు..మొన్నామధ్య ఉత్తరాఖండ్ వరదల కి కొన్నిరోజుల ముందు, నన్ను ఎవరో ఒక యెల్లో బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్లారు, నా పక్కన ఉండి నాకు ఆ బిల్డింగ్ చూయిస్తున్నారు, ముందటి వైపు బాగానే వుంది బిల్డింగ్, కానీ ఇటు చూడు అంటూ గాల్లో నే, నన్ను బిల్డింగ్ వెనక వైపు తీసుకెళ్లారు, అక్కడ ఆ బిల్డింగ్ వెనక భాగం అంతా కూలిపోయి వుంది. కల వచ్చిన కొన్ని రోజులకి వరదల న్యూస్ టీవీ లో చూస్తుండగా, నేనే బిల్డింగ్ నయితే  చూశానో అదే బిల్డింగ్ కూలిపోయిన క్లిప్పింగ్ చూయిస్తున్నారు. ఇలా, తన భక్తులు కొద్దీ శ్రమ చేస్తే, దానికి పది రేట్లు గా మన వెంబడి ఉండి మనలని నడుపుతుంటారు , అన్నీ తెలుపుతుంటారు. కానీ మనమే అజ్ఞానం తో వారు మనకి ప్రసాదించే అనుగ్రహం కోసం కాకుండా, ప్రాపంచిక బురదలో పొర్లాలి అని తాపత్రయ పడుతుంటాము ..అందుకు నేనే ఉదాహరణ..వారి ని వీడి, భౌతిక విషయాలు దొరకాలని చేసే ప్రయత్నాల్లో చాలా శ్రమ పడి నా సాయి భావన ని చాలా కాలం కోల్పోయాను.. సాయి బంధువులారా, సమయం నిజంగా పాదరసం లాంటిది. మన చేతుల్లోనుండి అలా జారిపోతుంటుంది. సమయాన్ని వ్యర్ధ విషయాల్లో వృధా చేసి, తిరిగి వెనక్కి చూసుకున్నప్పుడు మనం సాధించింది ఏమి కనిపించదు..కాబట్టి ఇక నుండీ ప్రతీ నిమిషం , ప్రతీ పని ఆ సాయి కార్యం గా తలచి సాయి భావన తో ముందుకెళదాం.సాయి ని మది నిండా నిలుపుకుందాం. ఎవ్వరూ మనలని భగవంతుడంతగా ప్రేమించలేరు..ఆయన ప్రేమ ఒక్కసారి చవి చూస్తే, అయన ని వదలలేము. మాయ ప్రభావం తో ఒకోసారి మనం ఏమారినా, తిరిగి మనలని తన దారికి చేర్చుకునే భక్తవత్సలుడు ఆ భగవంతుడు..మిగితా భాగం రేపు చూద్దాం .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close