ఈమధ్య నేను గత కాలం గా వివిధ అనుభవాల ద్వారా గానీ , కొందరు మహానుభావుల ద్వారాగానీ నేను నేర్చుకున్నది ‘ఆచరించడానికి ప్రయత్నిస్తూ’, మన ఉన్నతి కి అవసరమయ్యే ఆ విషయాలను అందరితో పంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను.అందరూ ఈ విషయాలను హృదయానికి పట్టించుకోవాలని నా మనవి.
మన దేనందిన జీవితం లో మనం చేసే పొరపాట్లు
-మన మనశ్శక్తి ని మనకు తెలీయకుండానే మనం యిన్ని రోజులుగా దుర్వినియోగం చేస్తూ వున్నాము.మనం సాధారణం గా జరిగిపోయిన విషయాల గూర్చి చింతిస్తూ అలా జరగకుంటే బాగుండేది, ఆలా చేయకుంటే బాగుండేది అని వ్యర్థం గా చింతించడం మనకి అలవాటయ్యింది.దాని ద్వారా, నిర్మాణాత్మకమయిన మన మనః శక్తిని వృధా చేస్తుంటాము.
అలాగే, భవిష్యత్తు పై కంగారు, ఆదుర్దాలతో మన ప్రశాంతత ని కోల్పోతున్నాము.
ఆయా సమయాల్లో, “గతం మృతం తో సమానం. జరిగిపోయిన విషయాలు తిరిగి రావు” అని తలచి, వాటిని మనసులో నుండి చెరిపేసి, భవిష్యత్తు పై బెంగ ని మన రక్షణాభారం వహించే భగవంతుడి కే వదిలేసి,ప్రతీ విషయంలోనూ మన ప్రయత్నం మనము చేసి ఫలితాన్ని భగవంతుడి పాదాల దగ్గర పెట్టాలి “.
మన మనశ్శక్తి ని నిర్మాణాత్మకమయిన కార్యాలపై మళ్లించి స్వప్రయోజనమయిన పుణ్యాలను పొందవచ్చు..ఉదాహరణకి సమాజ సేవా కార్యక్రమాల నిర్వహణ, ప్రేరణాత్మకమయిన రచనా వ్యాసంగం , వివిధ కళలు నేర్చుకుని భగవంతుడి సేవ లో ఆ కళలని వినియోగించుకోవడం ..
ధ్యానం తో మన మనశ్శక్తి ని నిర్వీర్యం చేసే ఈ నెగటివ్ ఫీలింగ్స్ ని తొలగించుకోవచ్చు. దాని వాళ్ళ మానసిక స్తేర్యం పెరుగుతుంది. “ధ్యానం చేస్తూవుండటం , భవిష్యత్తులో మన రోగాలని, కర్మ ఫలాలని భస్మం చేస్తుంది ” అని గురువుగారు చెప్పారు.
అలాగే,వృత్తి ఉద్యోగాధి విషయాల్లో మనం బయట పని చేస్తుంటాము ,మన వృత్తి సంబంధ పనులు చేస్తూనే, ఏ కాస్త సమయం చిక్కినా మనం పక్కవారితో సంభాషణల్లో కి దిగుతుంటాం.అది అవసరమయినంతవరకి పర్వాలేదు, వ్యర్థమయిన విషయాలు..ఫలానా వారు ఇలా అలా అని వారి వ్యక్తిగత విషయాలు కూపీ లాగుతూ, పక్కన లేని ఆ మూడో మనిషి మీద ఏవేవో ఊహిస్తూ వ్యాఖ్యానాలు చేయడం చేస్తుంటాము. దాని వాళ్ళ మన మనశ్శక్తి వ్యర్థ విషయాల కోసం దుర్వినియోగం అవుతు ఉంటది. , పైగా అలా వ్యాఖ్యానాలు చేయడం అదీ తాము కళ్ళతో చూసినట్లు రూడి గా చెబుతూ వ్యాఖ్యానాలు చేసి, తమ లోని “రాక్షసుడిని ఆనందింపచేయడం” చేస్తుంటారు.మరియు, ఎదుటివారి లోని లోపాలను వారి ముందే ప్రత్యక్షం గా నూ, పరోక్షంగానూ నలుగురి ముందు ఎత్తి చూపుతూ , వారి ముఖం బాధ తో పాలిపోతోంటే చూస్తూ ఆనందిస్తుంటారు..అలా ఒక రాక్షసానందం పొందుతుంటారు మన లో చాలా మంది. “లేనిదీ వున్నట్లుగా తమకు తెలిసినట్లుగా ఒకరి గూర్చి వ్యర్థ ప్రచారం చేయడం ” వల్ల మనకు దోషం వస్తుంది..”ఇతరుల గూర్చి అసత్యపు ప్రచారం చేయడం ఒక పాపం” అని గుర్తుంచుకుందాము. ఒకవేళ వారు నిజంగానే పాపం చేసినా, వారి పాపం ఎత్తి చూపుతూ నలుగురిలో వారిని బాధపెట్టడం కూడా ఒక దోషం.ఎదుటివారిలో దోషాలని వారికీ మాత్రమే ఎత్తి చూపి సంస్కరించే ప్రయత్నం చేయాలని మా గురుగారు చెప్పారు.
మరికొందరు తమ రాజకీయ బుద్ధి తో, సమాజం లో గానీ, కార్యాలయాల్లో గానీ ఎవరయితే నాయకులు, అధికారులు గా వున్నారో,ఎవరి మాట అయితే చెల్లుబాటు అవుతుందో,వారి మాటే వేదం అనీ (వారు చెప్పేది ఎంత అసత్యపు మాట అయినా ), వారు తానా అంటే తందానా అనీ, కేవలం తమ ప్రయోజనాల కోసం చెడు ని సమర్థిస్తూ మాట్లాడుతుంటారు. అలా అమాయకులని హింసిస్తుంటారు..అదేంటని ఎవరయినా అడిగినా,” అందరూ ఏదారిలో ఎవరి వెంబడి నడిస్తే, మనం అదే దారి లో నడవాలి, దాన్నే సమర్థించాలి అది చెడు అయినా అది సదరు అధికారి చెప్పాడు కాబట్టి అదే మంచిది”‘ అనీ అతి తెలివి తో సమర్థించుకుంటున్నారు..కానీ మనం అవినీతి, అన్యాయాల్ని తమ ఉద్యోగ భద్రత, లేదా ప్రయోజనాల కోసం సమర్థిస్తూ ఎంత దోషాన్ని తెచ్చుకుంటున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన ఎదుటే, అహంకారం తలకెక్కిన మన అధికారులు, మన సాటి ఉద్యోగి ని, లేదా సాటి మనిషిని ఏరకం గా నయిననూ వేధిస్తుంటే, చూస్తూ కూడా, అధికార పీఠానికి సలాం చేస్తూ, మన వ్యక్తిత్వాన్ని నీచం గా చేసుకుని ఆ హింస లో మనమూ పాలు పంచుకుంటున్నాము. వారి పాపం మనమూ పంచుకుంటున్నాము. అలా కాకుండా, మన వ్యక్తిత్వం పై గౌరవం తో, మనకు చేతనయిన విధం గా ఆ అభాగ్యులకు తోడు గా ,ఆ సమయం లో స్పందిస్తే, “ఆ అన్యాయాన్ని ఎదురించిన సంతృప్తి ” జీవితాంతం మధురంగా మన మాది లో నిలిచి ఉంటుంది. లేకపోతే, ఏదో తప్పు చేసిన అపరాధ భావం మనల్ని వెంటాడొచ్చు.(కరడు గట్టిన పాషాణ హృదయులు దీనికి మినహాయింపు) ..
“మన” అనుకున్న వారు, మనం అమాయకం గా, మన స్నేహితులు అనుకున్నవారు కూడా పై జాడ్యానికి గురయ్యి మనకు వ్యతిరేక పక్షాన నిలుస్తుంటారు..అపుడు ఆశ్చర్యపోవడం మన వంతు..మాయ ఆడించే ఈ జగన్నాటకం లో, ఒక్కొక్కరు కంగారు తో యిలా ఆధారా బాదరా పడుతూ కిందా మీదా పడటం చూసి నవ్వుకోవడం తప్ప మనం ఏమి చేయలేము. “ఈ ప్రపంచం తల క్రిందులు కానీ, నువ్వు వున్నా చోటనే స్థిరంగా ఉండి, నీ ముందర జరుగుచున్న జగన్నాటకముని శాంత చిత్తము తో గమనించుచుండుము” అని అన్నాడు సాయి.. ఇలా స్థిరత్వం లేక రంగులు మార్చే ప్రపంచాన్ని, నువ్వు స్థిరత్వం తో చూస్తూ ఊరుకో, బాధ పడవద్దు అని అన్నారు బాబా. కాబట్టి ఎవరయినా అందరూ నన్ను వదిలేసారు అన్న భావన తో బాధ పడ్తూ వున్నట్లైతే, పై సూక్తి ని మనసు లో ఎప్పుడూ పెట్టుకోవాలి. ఎందుకంటే, నా అనుకున్నవారు ఎల్లప్పుడూ మన వారు కారు, మాయ ఆడించే ఈ నాటకం లో, రంగులు మారుస్తూ ఎపుడు కనుమరుగవుతారో తెలియదు..కాబట్టే, ఎవరి పై మమకారం పెంచుకోకుండా, వారి పట్ల మనం చేయవల్సిన కర్తవ్యాన్ని మాత్రం శ్రద్ధ గా నిర్వహించాలి అని బాబా చెప్పారు..{ ” ఈ సంసారము నాది కాదు దేవుడిది అని భావించి, జాగ్రత్త గా ఉండి, నీ కర్తవ్యముని మాత్రం జాగ్రత్త గా పూర్తి చేయుము “} ..ఈ బాబా సూక్తిని మనం పాటిస్తే, మన కుటింబీకులు గానీ మనవారు అనుకున్న వారు గానీ, మనలని నిర్లక్ష్యం చేసినా , మన ప్రేమ ని గుర్తించకపోయినా మనం బాధపడము.అలా ఎల్లప్పుడూ శాంతి తో ఉండగలం.
ఈ సమాజం ఎదుటి వారి తప్పు ల పై చూపించే శ్రద్ధ తాము చేసే తప్పులను మాత్రం పట్టించకోదు ఎదుట వారిని నిదించడం ఎంతో సులభం కాని బాధలో ఉన్న వాడిని ఆదరిస్తే వచ్చే తృప్తి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది భగవాన్ శ్రీ సాయిబాబా గారి ఎంతో విలువైన భోధనలే మనకు జీవిత సత్యాలు
LikeLike
Yes.Sairam
LikeLike