- సాయి తో నా అనుభవాలు రెండవ భాగం
అలా గురువుగారి ద్వారా బాబా గూర్చి పరిచయం అయ్యాక , మేము వారు నిర్వహించే కార్యక్రమాలకి వీలున్నప్పుడల్లా హాజారు అయ్యేవాళ్ళము . గురుగారు సాయికోటి మహా యజ్ఞం నిర్వహించేవారు. సాయి నామాలు గల పుస్తకాలను మేళ తాళాలతో , సాయి నామ గానం తో ఊరేగింపుగా తీసుకొచ్చి , ప్రత్యేకంగా నిర్మించిన , సుమారు 100 అడుగుల ఎత్తు గల సాయి కోటి మహా స్థూపాలలో నిక్షిప్తం చేస్తారు . పరమపావనుని పవిత్ర నామాలు గల ఆ స్తూప సందర్శనం తో భక్తుల బాధలు, రోగాలు మాయమయిన ఎన్నో అనుభవాలు వున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం లో సాయి సత్యవ్రతాలు, సాయి సాధ్సంగాలు , సాయి భజనలు నిర్వహింపబడుతాయి.
ఒకసారి నేను కడప జిల్లా ,ఎర్రగుంట్ల లో నిర్వహించబడే సాయీ కార్యక్రమం మరియు గురుగారి సత్సంగానికి బయలుదేరాలి అని అనుకున్నాను, ప్రయాణానికి నాలుగయిదు రోజుల ముందు ఒక కల వచ్చింది.,కల ఇలా వుంది. “నేను ఒక పెద్ద సాయి టెంపుల్ నుండి బయటకి నా సూట్ కేసు తో వస్తున్నాను, బయట మా గురుగారు వంట చేస్తున్నారు ,నేను వారితో, గురుగారు నేను వెళ్లిపోతున్నా అని చెప్పాను, వెంటనే వారు గాల్లో వారితో బాటు తీసుకెళ్లి మరు నిమిషం లో ,ఒక రైల్వే స్టేషన్ దగ్గర దింపి, “ఇక్కడిదాకా నేను నిన్ను జాగ్రత్త గా తీసుకొచ్చ్చాను..ఇక నీ బాధ్యత నువ్వే చూసుకోవాలి.”అన్నారు..ఇదీ కల. అయితే నేను దీన్ని మాములుగా వఛ్చిన కల అనుకున్నాను.
తర్వాతా కొన్నిరోజులకి కార్యక్రమం కి ఒక్కదాన్నే హైదరాబాద్ నుండి ఎర్రగుంట్ల కి ట్రైన్ లో బయల్దేరాను మరుసటి ఉదయం అక్కడికి చేరుకొని,,అక్కడ బాబా భజన, నామం లో భక్తి గా పాల్గొన్నాను, గురుగారి సత్సంగం విన్నాను,.తిరిగి వచ్చేప్పుడు అక్కడి సాయి కోటి స్థూపం పై గల బాబా విగ్రహానికి నమస్కరించుకుని, బాబా, నేను వెళ్తున్నాను , అని మనస్ఫూర్తిగా చెప్పుకున్నాను.మిగితావారందరూ వెళ్లిపోయారు సత్సంగం అయిన ఆ సాయంత్రానికె ,కానీ నాకు 8 గంటల కి ట్రైన్ ఉండుట చే , నేను 7 కి బయల్దేరాను.గుడి పట్టణానికి దూరం గా ఉండుట చే,టెంపుల్ బయట గల రోడ్డు పై నేను తప్ప ఇంకెవరూ లేరు, కాస్త భయం గా పట్టణానికెళ్ళే బస్సు కోసం నిరీక్షిస్తూ నించున్నాను. బాబా ను తలచుకున్నాను,అంతలో, టెంపుల్ లో పనిచేసే దంపతులు (వారి ఇల్లు కూడా టెంపుల్ దగ్గరే వుంది) బ్యాగ్ తో అక్కడికి చేరుకున్నారు, అనుకోకుండా వారికీ ఏదో వూరు వెళ్లాల్సొచ్చి ఊరికి బయలుదేరాము అని చెప్పారు. బస్సు రాగానే, .ముగ్గురమూ ఎక్కి కూర్చున్నాము.వారు వెళ్లాల్సిన వూరు ఎర్రగుంట్ల మీదుగా వెళ్తుంది కాబట్టి నాకు తోడు వచ్చి స్టేషన్ దింపుతాము అని నాతో చెప్పారు..క్రితం రోజు రాత్రి నాకు నిద్ర సరిగ్గా లేనందువల్ల నేను కాస్త నిస్సత్తువ గా వున్నాను, అంత లో నెక్స్ట్ స్టాప్ లో ఒక తాగుబోతు బస్సు ఎక్కి , బస్సు లో పాక్కుంటూ సరాసరి నా సీట్ దగ్గరికొచ్చి నా పక్కన కూర్చోబోతున్నాడు, నాకు అతడిని వారించే ఓపిక కూడా లేక విస్మయం తో చూస్తుంటే,, నాతో బాటే వఛ్చిన ఆ జంట అతడిని వారించి నన్ను ఆ ఇబ్బంది నుండి తప్పించారు, స్టేషన్ రాగానే, వారే నా సూట్ కేసు వద్దన్నా వినకుండా నాకు వారే అందించి స్టేషన్ వరకు దింపి వెళ్లిపోయారు..
ఇక నేను స్టేషన్ లో ప్రవేశించి అక్కడున్న రెండే ప్లాటుఫార్మ్స్ లో ఏ ప్లాట్ఫారం పై కి హైదరాబాద్ వెళ్లే ట్రైన్ వస్తుందో అని సందేహిస్తూ నించుని, చివరికి, వచ్ఛేప్పుడు వచ్చిన ప్లాట్ఫారం కాకుండా, ఇపుడు తిరుగు ప్రయాణం కాబట్టి ఆ ప్లాట్ ఫారం కాకుండా మరో ప్లాట్ఫారం పై కి వస్తుందేమో ట్రైన్ అని ఆ దిశ గా జస్ట్ ఒక అడుగు వేసానో లేదో, ఎదురుగా “ఒక ముసలాయన, మాసిన ధోతి, తలపాగా, తో, నన్నే చూస్తూ నా వైపే వస్తున్నాడు,” అంతలోనే అతను ఎలా అక్కడ ప్రత్యక్షం అయ్యాడో తెలియక నేను తననే చూస్తూ నించున్నాను. తన కళ్ళు, నన్ను “ఎక్కడికి” అంటూ ప్రశ్నిస్తున్నట్లుగా తీక్షణం గా అనిపించాయి.ఆ కళ్ళల్లో ఏదో శక్తి ఉన్నట్లు గా , నన్ను లోతు గా చూస్తున్నట్లు గా అనిపించింది. నాకు తెలియకుండానే నేను తనని “హైదరాబాద్ వెళ్లే ట్రైన్ ఈ ప్లాట్ఫారం ఏనా” అని అడిగేసాను..”కాదమ్మా,ఈ ప్లాటుఫారం పై ఏదో పని జరుగుతోన్ది.యిది ఉపయోగం లో లేదు.ట్రైన్ వచ్ఛేది ఆ అవతలి ప్లాట్ఫారం” అని నేను వచ్సెప్పుడు దిగిన ప్లాట్ఫారం చూయించాడు..సరేనని నేను వెనక్కి తిరిగి ఫుట్ ఓవర్ పై నుండి వెళదామని ఒక అడుగు వేయగానే, నాకు ఒక్కసారిగా ఏమయిందో తెలియదు, నా ముందు అంతా చీకటి గా నేను ఎక్కడున్నానో తెలియక,మంత్రించినట్లు గా , అచేతనం గా నిలబడిపోయాను, వెనక నుండి ‘ఏమయ్యిందమ్మా?’ అని ఆయన గొంతు చాలా గంభీరం గా వినిపించింది ,ఎందుకో ఝల్లుమని అనిపించింది, కానీ ఇంకా అదేస్థితి లో నే ఉండి, అప్రయత్నం గా” suitcase బరువవుతోంది” అనేశాను..”నేను తీసుకొస్తాను అమ్మ” అని తాను నా చేతి లో నుండి సూట్ కేసు తీసుకుంటున్నప్పుడు తన చేతి స్పర్శ తగిలి అప్పుడు మాములు స్థితి కొచ్చాను, అపుడు నాకు నా ముందు గా , ఫుట్ ఓవర్ మెట్ల పై నా suitcase తో నడుస్తూ ఆయన కనిపించాడు.వెనక నడుస్తున్న నాకు, తాను చాలా తేలిక గా suitcase ని మోస్తున్నట్లు గా , సాధారణం గా ముసలివాళ్ళు కష్టం గా మోస్తున్నట్లు వుంటారు కదా, అలా కాకుండా చాలా సునాయాసం గా మోస్తూ నడుస్తున్నట్లు అనిపించింది. తన భుజాలు, శరీర ఆకారం అంతా కూడా, చావడి ఊరేగింపు ఫోటో లో బాబా ఎలా వున్నారో, సరిగ్గా అలాగే, ఆయన శరీర తత్త్వం కనిపించింది.తన వెనక నడుస్తుంటే చాలా గంభీరం గా, ఏదో కొత్త అనుభూతి గా వింత గా అనిపించింది.ఆలా ఫుట్ ఓవర్ దిగాక, “నీ suitcase ఇక్కడ పెడతాను” అని ఇద్దరు దంపతులు కూర్చున్న బెంచ్ దగ్గర పెట్టి వారు వెళ్ళిపోబోతోంటే, వారికివ్వడానికి చిల్లర కోసం పర్సు చూస్తే లేవు,” అయ్యో చేంజ్ లేవండి ” అంటోంటే,(ఇంకా వారిని బాబా అని గుర్తించని మూర్ఖత్వం), ఆయన అటు తిరిగి వుండే, తన హస్తాన్ని పైకెత్తి ఆశీర్వదిస్తున్నట్లు గా సంకేతం ఇచ్చ్చారు .నేను ఒక సెకండ్ suitcase చూసుకొని వారి వైపు చూసేసరికి వారు ఎక్కడా కనిపించలేదు..నేను ఆ బెంచ్ పై ఆ జంట పక్కనే కూర్చొని ట్రైన్ కీ వెయిట్ చేస్తుండగా, ఒకడు కొంచం దూరం లో నిలబడి చాల అసభ్యం గా నాకు ఏదో సంజ్ఞ చేయడం గమనించాను, నా పక్కనున్న వారికీ ఆ విషయం చెప్పగానే, వాడు మరో plotform పై కి పారిపోయాడు. అప్పుడు నా దృష్టి ఆ మరో plotform పై పడింది, చూస్తే, అక్కడ సుమారు 10 మంది తాగుబోతులనుకుంటాను గుంపుగా కూర్చొని వున్నారు, వీడు ఆ గుంపులోని వాడు. అప్పుడు నాకు బాబా యిదంతా ఎందుకు జరిపారో, ఆ కల అర్థం మొత్తం అర్థమయ్యింది. ప్రయాణం లో ఆ దంపతులని నా వెంట పంపి,స్టేషన్ లో తెలియక ఆ మరో plotform పై కి నేను వెళ్లి ఉంటే, రాబోయే ప్రమాదాన్ని తప్పించడానికి బాబా స్వయంగా ప్రత్యక్షమయ్యి, నా సూట్ కేసు మోసి మరీ, నాకు సరయిన plotform పై కి తీసుకొచ్చి, నాకు తోడు గా వుండేట్లుగా, వారి దగ్గర కూర్చోమన్నట్లు గా ఒక జంట దగ్గరే నా suitcase పెట్టి, కల లో చెప్పినట్లు గా స్టేషన్ వరకు నాకు రక్షణ కల్పించి, మిగితా రక్షణ ని నాకు నేను చూసుకొమ్మన్నట్లు గా ధాయిర్యాన్ని ఇఛ్చి వెళ్లిపోయారు..
ఇలా, ‘”నా భక్తులని కాపాడడానికి నేను పరిగెత్తుకుంటూ వస్తాను ” అని నిరూపించారు.
Reblogged this on Sai Sannidhi.
LikeLike