ప్రతి మది లో భగవంతుని భక్తి ని ఉదయింపజేసిన, చేస్తూన్న ప్రేమాంతరంగ లోకోత్తేజ సూర్యుడు అయినా శ్రీ పరమహంస యోగానంద గారి భౌతిక శరరీరానికి అస్తమయం ఈరోజు అనగా మార్చ్ 7 ..పరమ ప్రేమమూర్తి పరమ పావన జీవిత విశేషాలు మీకోసం..
శ్రీ యోగానంద గారు జనవరి 5 ,1893 లో ,హిమాలయాలకు సమీపం లో వున్నా గోరఖ్పూర్ లో జన్మించారు .వారికీ ఏడుగురు తోబుట్టువులు..వారితో బాటు నలుగురు మగ పిల్లలు, నలుగురు ఆడ పిల్లలు.వారి తల్లిదండ్రులు బెంగాలీ వారు.
కాశి లో యోగానంద గారు మొదటిసారిగా వారు గురుగారి ని కలుసుకున్నారు, చుసిన వెంటనే, అయస్కాంతం లా, ఎన్నో జన్మల సంబంధ ఫలం గా వారి సమాగమం జరిగింది..”నా తండ్రీ వచ్చ్చేసావా, ఎన్నాళ్ళనుండో నీకోసం కాచుకుని కూర్చున్నాను” అంటూ వారిని ఆత్మీయాలింగనం చేసుకున్నారు గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారు.అప్పటినుండి వారిని విడిచి వీరు లేరు, భౌతిక దూరాలు వారి మైత్రి ని ఆపలేవు.
గురుగారి ప్రేరణ తో శ్రీ యోగానంద గారు రాంచీ లో యోగ విద్యాలయాన్ని స్థాపించారు. క్రియా యోగం ని వ్యాప్తి లో కి తెచ్చ్చారు.విద్యార్థులకి ధ్యానయోగ పద్ధతి ని, ఆరోగ్యానికీ, షారీరిక వికాసానికీ తోడ్పడే అద్వితీయ యోగదా విధానమూ నేర్పడం జరుగుతోంది.
1920 లో, అమెరికా లో ని బోస్టన్ లో, మత ధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభ కి భారత దేశం నుండి శ్రీ యోగానంద గారికి ప్రతినిధి గా రమ్మని ఆహ్వానం అందింది.దైవ సాక్షాత్కార సిద్ధి కి ఉపయోగపడే క్రియా యోగాన్ని,దేశాలమధ్య సామరస్యం ఏర్పరచడానికి ఒక అమ్ము గా కూడా తీసుకుని విదేశాల్లో క్రియాయోగాన్ని వ్యాప్తి లోకి తెచ్చ్చారు శ్రీ యోగానంద గారు. వారి గురువుగారు స్వయం గా శ్రీ యోగానంద గారి గూర్చి వారితో చెప్పినధీ వారి మాటల్లో..”దేవుణ్ణి అన్వేషిస్తూ, విశ్వాసం తో, నీ దగ్గరికి వచ్చేవాళ్ళందరికీ సహాయం లభిస్తుంది. నువ్వు వాళ్ళవేపు చూస్తుటే, నీ కల్ల నుండి వెలుపడే ఆత్మ విద్యుత్ ప్రవాహం వాళ్ళ మెదళ్లలోకి ప్రవేశించి వాళ్లలో దైవ స్పృహ యింకా పెరిగేట్టు చేస్తూ వాళ్ళ భౌతికమయిన అలవాట్లను మార్చేస్తుంది. చిత్త శుద్ధి గల ఆత్మల్ని బాగా ఆకర్షించే శక్తి నీకు ఉంటుంది.”
వారి బోధనలు :
“ఎవరెంత కటువుగా ప్రవర్తించినా, వారి ప్రవర్తన నన్ను కదిలించదు. ఎంత నిర్దయ ని మనుషులు నాపట్ల చూపుతారో, అంతగా నేను వారిని అర్థం చేసుకుని నా దయ ని చూపుతాను.ఆత్మ నియంత్రణ అనేది గొప్ప శక్తి కలది .నీ వాక్కుని ఎప్పుడు కూడా కటువు గా చేసుకోకు.ఎప్పుడయితే యితరులు నీపట్ల దురుసు గా ప్రవర్తిస్తారో ,అపుడు ఒక పుష్పం లా, దయ అనే నీ రేకులను విప్పార్చుము ..ఆత్మ నియంత్రణ ,సరయిన నడవడిక ద్వారా నువ్వు అక్షయమయిన హితము లో ఒక పాత్రధారి వి అనీ, ప్రపంచపు అసత్యపు నడవడి తో నీకేమాత్రం అంబంధం లేదనీ గ్రహించగలవు ”
“ఎవరయితే దైవాన్ని ప్రేమిస్తారో, మరియు ఏ ప్రలోభానికీ లొంగరో,వారే మానవ జాతి ని దుఃఖము నుండి వెలుగు మరియు ఆనందపు స్వేచ్చా ప్రపంచంలోకి నడిపించడానికి నిర్ణయింపబడుతారు..మీరు మొదట మీ కుటుంభం, తర్వాత, స్నేహితులు, ఆ తర్వాత ప్రపంచానికి సేవ చేయాలి. పరమాత్మ వెలుగు అనేది అందరికీ సమానము గా ప్రసరిస్తుంది ఒకవేళ ఎవరయినా ఆ వెలుగు ని సరిగ్గా ప్రతిబింబించకపోయినా కూడా..ఎవ్వరు ఈ మతం, ఏ జాతి కి చెందిన వారయినా, వారిలో అందరిలోనూ పరమాత్మ ని చూడటం నేర్చుకోండి . ఎప్పుడయితే మీరు మీ ప్రేమను పంచుతూ అందరినీ సేవిస్తారో, ఈ విశ్వ సంఘటనం లో ఒక భాగమని భావిస్తారో, అపుడు మీరు పరమాత్మ ఉనికి ని మీలో పొందుతారు”
“ఎప్పుడయితే నీ సంకల్పము బలంగా ఉంటుందో, అపుడు నీ సంకల్ప శక్తి ఈ సృష్టి శక్తుల ని కూడా కదిలించగలదు మరియు అనంత శక్తి నుండి బదులు ని పొందగలదు.నీ సంకల్ప శక్తి నిన్ను పరమాత్మ గా మారుస్తుంది “
7 మార్చ్ 1952 లో శ్రీ యోగానంద గారు సమాధి చెందారు. సమాధి చెందినా యిప్పటికీ , వారి ఉనికి ని మన కి అనుభవింప చేస్తున్నారు . “ఎవరు ఎప్పుడు నన్ను భావించినా, నేను వెంటనే వారి పక్కన వుంటాను ” అని అన్నారు .వారు మనకి ఇఛ్చిన సందేశం “భగవంతుడు నిన్ను నా దగ్గరికి పంపాడు కావున నేను ఈ శరీరాన్ని విడిచినా,నిన్ను ఓడిపోనివ్వను. ఈ ప్రపంచ వ్యాప్తం గా కల భగవద్భక్తులకి నా సహాయం ఎప్పటికీ ఇవ్వబడుతుంది,.ఒక్క క్షణ మాత్రమయిననూ నేను ఈ భౌతికం గా మిమ్మల్నందరినీ విడిచి వెళ్లానని అనుకోకండి.నేను నా దేహం లో లేకున్ననూ, మీ ఆధ్యాత్మిక యోగ క్షేమం గూర్చే చింతిస్తూ వున్నాను.నేను మీ ప్రత్యే ఒక్కరినీ గమనిస్తూ వున్నాను.ఎప్పుడయిననూ, ఏ భక్తుడయినా, తన ప్రశాంతమయిన మనసు లోతుల్లోనుండీ నన్ను తలచుకుంటాడో, అతను మరుక్షణమే నా సన్నిధి ని అనుభవిస్తాడు “
“ఒక యోగి ఆత్మ కథ “ అనే పుస్తకరాజం ద్వారా , వారి పరమ పావన జీవితం లో ని వివిధ అనుభవాల సుమధుర ఘట్టాలు మన కళ్ల ముందు ఆవిష్కృతమయ్యి మనలని వారి దివ్య స్మరణ లో మునిగేలా చేసి మనలని పునీతం చేస్తాయి. పుస్తక రూపం గా వారు పంచుకున్న వారి గురు ప్రేమా భక్తులు, మన మనసు ని దోచి , మన అణువణువునా గురు భక్తి తరంగాలు ప్రసరించి ,అలోకిక దైవ ప్రేమజరి లో ఓలలాడిస్తాయి ..ఓ ప్రేమాస్పదులారా ,మన ప్రేమ తృష్ణ తీర్చగలిగే ఈ అద్భుత దైవ ప్రేమ భాండాగారాన్ని తప్పకుండా పొందండి.
జై గురుదేవా ..