హాయ్ ..ఈరోజు యిప్పుడే నాకందిన ప్రేమ మూర్తి శ్రీ పరమహంస యోగానంద గారి సందేశం .వారే నాకిచ్చ్చారు అని అత్యంత ఆనంద పడుతూ వారి ప్రేమ వల్ల కలిగిన ఆనందాశ్రువుల భావోద్వేగం తగ్గాక ఈ పోస్ట్ పంపుతున్నాను..
ఈరోజు పదవ తరగతి ఎక్సమినేషన్ ఇన్విజిలేటర్ డ్యూటీ ముగిన్చుకుని,ఈరోజు అక్కడి చీఫ్ సుపీరిడెంట్ ప్రవర్తన తో మనసు కలత చెందినందువల్ల (ఎక్సమినేషన్ హాల్ లో copying కి అనుమతి నేనివ్వట్లేదని నన్ను కీలకమైన ఈరోజటి మ్యాథ్స్ ఎక్సమ్ కి నాకు డ్యూటీ వేయక, ఇవ్వాళ నన్ను reliever గ వేసి, నేను రాకన్నా ముందే వచ్చిన వారికి మాత్రమే వేసేసాము duties అని సాకు చెప్పారు..సరేలెమ్మని ఊరుకున్నాను నా తరువాత వఛ్చిన ఇంకో ఇద్దరికి duties వేసేసరికి , ఆ పద్ధతి నాకు నచ్చక వారితో విభేదించి మరీ నేను డ్యూటీ వేయించుకున్నాను. ఆ తరువాత అందరూ నా వెనుక నా స్ట్రిక్టునెస్ గూర్చి నెగటివ్ గా చెప్పుకోవడం వల్ల మనసు బాధ పడింది.పైగా “మీ రూమ్ లో పిల్లలు “బాగా” రాయలేదట గా ఎగ్జామ్స్ ” అంటూ పరోక్షం గా విమర్శిస్తూ ఆనందపడతారు. పరీక్షల్లో పిల్లలని copying చేయించడానికి, చిట్స్ అందించడానికి తంటాలు పడుతూ వుంటారు.అప్పుడు వున్న తాపత్రయం , సిలబస్ ని శ్రద్ధ గా వెంటనే పూర్తి చేసి, మిగిలిన కాలం పిల్లలతో పర్ఫెక్ట్ గా చదివించడం లో ఆ ఆర్తి కనిపించదు మరి. classes తీసుకోకుండా ముచ్చ్చట్లు పెడుతూ, విద్యార్థుల చదువు ని నిర్లక్ష్యం చేస్తూ,పరీక్షల్లో మేము “సహాయం” చేస్తాము అని ఉపాధ్యాయులే పిల్లలని చదువు అంటే చూచిరాత అనే అర్థం కల్పిస్తూ, చివరకి పిల్లలు చదవడం అంటే బద్ధకం గా ఫీల్ అయ్యే స్థాయి కి తీసుకొస్తున్నారు.),
యింటికి రాగానే నా స్నేహితుడికి (శ్రీ యోగానంద గారికి) చెప్పుకున్నా.. “తండ్రీ , నువ్వు నా ఫ్రెండ్ వి అయితే గనక యిప్పుడు ఫేస్బుక్ ద్వారా నాతో మాట్లాడు, ఏదయినా చెప్పు ..ఫేస్బుక్ లో మొదటి పోస్ట్ నీ సందేశమే అయ్యి ఉండాలి.” అని చెప్పుకుని లాప్టాప్ ఆన్ చేశాను. మొదటి పోస్ట్ ద్వారా నా స్నేహితుడు యిలా అన్నారు.”భగవంతుడి దివ్య అయస్కాంత శక్తి తో ఎల్లప్పుడూ నీ మనసుని అనుసంధానం చేయుము.నువ్వు ఎప్పుడు ఎక్కడ వున్నా, భగవంతుడి గూర్చి గాఢము గా చింతించుచుండుము ..ఫలితము గా నువ్వెప్పుడూ ఎక్కడ వున్నా, భగవంతుడు నీ తోడే ఉంటాడు.అపుడు నీ అన్ని సత్సంకల్పాలు, దీర్ఘ కాలం గా నీ మనసులో వున్న నీ మంచి ఇఛ్చాలు నెరవేరుతాయి.” అన్నారు. వారి ఈ సందేశం చదవగానే, భావావేశం తో కన్నీళ్లు వచ్చ్చాయి .
స్నేహితులారా, నిజంగా నిజమయిన ఆర్తి తో ఏ విషయం గూర్చి అయినా ఆ పరమ పావనులని అంటే సాయి కావొచ్చు , యోగానంద గారు కావొచ్చు ఏ అవతారం లో ని మన ప్రేమారూపుడయిన పరమాత్మ తప్పక నేనున్నానంటూ పలుకుతాడు. మన ప్రేమ ని వారు ఎపుడూ ఎదురు చూస్తుంటారు మన పక్కన వుండే..కానీ మనం ఏవేవో ఆలోచనలతో, ఆరాటాలతో వారినస్సలు పట్టించుకోము. ఎప్పుడయినా కషటాల్లో ఉన్నప్పుడో, ఒంటరి అయినప్పుడో మనకి వారు గుర్తుకొస్తారు. ఆట బొమ్మలతో ఆడుతూ , ఇబ్బంది ఏమయినా కలగగానే అమ్మ అంటూ పిలిచే చంటి పిల్లలు గా మనం మన పరమాత్ముడిని పిలుస్తుంటాము. మనకి తెలియకుండా మన ‘ఆట ‘ గమనిస్తుండే మన మాతృ స్వరూప పరమాత్మ అంతే ఆతృత తో మనకి సమాధానమిస్తాడు..మనలని అక్కున చేర్చు కుంటాడు. అప్పటిదాకా లోక వ్యవహారాల్లో పడి వారిని మరిచి పోతాము. అలా కాకుండా వారిని ఎప్పుడూ సాధ్యమయినంత ఎక్కువగా తలచుకుందాము, వారి భావన తో బ్రతికి వారి సన్నిధి ని మనసారా అనుభవిద్దాము.నువ్విధి యిస్తే, నేనది ఇస్తాను అంటూ వారితో వ్యాపారం చేస్తుంటే , వారు నవ్వుకుంటారు..కష్టాలొచ్చినపుడు కష్టం గా వారి అష్టకాలు, మంత్రాలు చదవడం కాకుండా వారిని ఇష్టం తో మది లో నింపుకుందాము.వారికయి ఏది చేసినా మనసపూర్థిగా ఇష్టం గా చేద్దాము..మనసపూర్థిగా ఆ పరమాత్ముని ప్రేమిద్దాము..వారి ధ్యానం లో బ్రతుకుదాము.అపుడు వారు మనలని కంటికి రెప్పలా గా చూసుకుంటారు.మన ద్వారా ఏ చిన్న తప్పు కూడా జరగకుండా చూసుకుంటారు..కర్మ బంధాలు కర్మ ఫలాల నుండి మనలని రక్షిస్తారు, న్యాయమయిన మన అన్ని కోర్కెల్ని నెరవేర్చి మనలని ఆనందింప చేస్తారు.మనం చేయాల్సిందల్లా మన మనసులో వారిని ప్రేమ గా నింపుకోవడమే, ఏ హంగులు,ఆర్భాటాలు, మంత్రాలు, మహా నైవేద్యాలు,ఉపవాసాలు అవసరం లేదు.ఉపవాసాలు శరీర ఆరోగ్యానికి అవసరమే కానీ భగవంతుడి ప్రేమ పొందడానికి కాదు. కాబట్టి ఉపవాస దీక్ష లతో ఆయాస పడిపోయి అలసిపోవద్దు..మనం ఉపవాసంతో కష్టపడుతోంటే దైవం ఆనందించదు. వారు సులభ సాధ్యులు.కావాల్సిందల్లా వారిపై నిష్కల్మష ప్రేమ, నిస్వార్ధ ప్రేమ. మరి ఈరోజటినుండే వారిని మన హృదయ మందిరం పరిశుద్ధి చేసుకుని వారి ని ఆహ్వానించి ,భక్తి మంత్రం తో ,వారి పై ప్రేమ అనే సింహాసనం పై ప్రతిష్టించుకుని, పవిత్రత, నీతి అనే పుష్పాలతో సేవిస్తూ, మన అహంకారాన్ని వారికి నయివేధ్యం చేసి తరిద్దాము. జై సాయినాథ, జై గురు దేవా