శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ..సమర్ధ సద్గురు సాంబశివ మహారాజ్ కీ జై..
బాబా కృప తో నేను సాయి సన్నిధి ని మన ముందుకి తెచ్చే ఒక లీల ను మీ ముందుంచుతున్నాను
ఈ లీల బాబా బౌతిక శరీరం తో షిరిడి లో వున్నా కాలం నాటిది.
కాశిబాయి అను మహిళ తన వివాహానంతరం తన తల్లిదండ్రులను వదిలి నిఫాడ్ అను ఊరిలో తన కుటుంబం తో హాయిగా ఉండసాగింది.అయితే ఒక సంవత్సరం తరువాత తన భర్త చనిపోవడం జరుగుతుంది. ఆ సమయం లో తను గర్భవతి . తనకి ఒక పుత్రుడు జన్మించాడు.మాధవ్ అని పేరు పెట్టబడ్డాడు.మాధవ్ 5 నెలల వయస్సు వున్నప్పుడు కాశిబాయి తన పుట్టినిల్లు అయిన షిరిడి కి వచ్చింది.తన తల్లిదండ్రులు చాల పేదవారు అవడం వలన , మాధవ్ 2 సంవత్సరాల వయసు వచ్చాక, తను పొలం లో పని చేయాలని నిశ్చయించుకుని ప్రతి రోజు ఉదయం కొడుకు ని ద్వారకామాయి లో బాబా దగ్గర వదిలి పెట్టి పొలం కి వెళ్ళేది.సాయంత్రం తనని ఇంటికి తీసుకుని వెళ్ళేది..మాధవ్ 4 సంవత్సరాలు వచ్చాక అతడు చిన్న చిన్న బాబా పనులు చేసేవాడు.బాబా అతడికి రోజు ఒక రూపాయి ఇచ్చేవాడు. .పొట్ట కూటి కోసం కాశిబాయి చాలా కష్టపడేది. ఒకరోజు ఆమె బాబా తో మాట్లాడుతూ -బాబా !నువ్వు అందరికి ఎంతో ఇస్తావు.కాని మాధవ్ కి ఒక రూపాయి మాత్రమె ఇస్తావెందుకు? అని అడిగింది..అపుడు బాబా – నేను అందరికి చేసే దానం ఎప్పుడయినా నేను ఆపవచ్చు.కాని మాధవ్ కి ఇవ్వడం ఎప్పుడు ఆపను.నీలాంటి నిరాశ్రిత మహిళలకి నేనే రక్షకుడిని..అని అంటాడు.
కాశిబాయి బాబా చెప్పింది అర్ధం చేసుకోకుండా గట్టిగా -నా భర్త, నా రక్షకుడు, 5 సంవస్తరాల క్రితం చనిపోయాడు..అని అన్నది. అది విని బాబా వుగ్రుడయినాడు.బాబా భయంకర ముఖము చూడలేక ఆమె భయం తో తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది.భయం తో 3 రోజులు ద్వారకామాయి కి రాలేకపోయింది.బాబా అప్పటికి మాధవ్ ఏడి అని అందరిని అడిగి మాధవ్ ని తీసుకురమ్మని దూత ని పంపాడు.వాళ్ళు వచ్చాక బాబా చిరునవ్వు తో వాళ్ళని తన దగ్గరకు పిలిచి , తన నోట్లో వూగుతున్న పన్ను నొకదాన్ని అనాయాసం గా పీకి పిడికెడు ఊది లో వేసి ఒక పీలిక లో కట్టి కాశిబాయి కి ఇస్తూ – దీన్ని నీ దగ్గర జాగ్రత్త గా ఉంచు. బాబా మేలు చేస్తాడు అన్నాడు. దాన్ని ఆమె ఒక తాయెత్తు లా చేసి మాధవ్ కి కట్టింది.
కాలం గడిచింది.కాశిబాయి చనిపోయాక మాధవ్ నిఫాడ్ తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకుని అక్కడ ఉండసాగాడు.
- పూనా లోని శివాజీనగర్ బాబా మందిరం లో బాబా పన్ను స్తాపించబడటం
ఆహ్మదనగర్ లో వుండే దాము అన్నా పూనా వచ్చి శివాజీనగర్ లో ఒక పెద్ద భవంతి కొన్నాడు..అతడి కొడుకు నానా సాహెబ్ ఆ భవంతి లో రెండు గదులని కొని దాన్ని మందిరం గా మార్చాడు.చాలా మంది భక్తులు దానిలో ఆరతి ఉత్సవాలకి వచ్చేవారు. రోజు రోజు కి భక్తులు ఎక్కువవడంతో ఆ మందిరం సరిపోలేదు,,అపుడు నానా సాహెబ్ నికమ్ అనే వేరే భక్తుని సహాయం తో ఆ భవనం ముందు ఒక మందిరం కట్టించాడు .దానిలో బాబా చిత్రం కి పూజలు విధిగా జరిగేవి.నికమ్ కి ఒకరోజు బాబా స్వప్నం లో కనబడి నిఫాడ్ వెళ్లి మాధవ్ దగ్గర తన దంతం తీసుకురమ్మని చెప్తాడు..అదేసమయం లో మాధవ రావు కి కుడా స్వప్నం వచ్చింది .దానిలో బాబా నేనిచ్చిన దంతం నీ దగ్గరకు వచ్చే వ్యక్తీ కి ఇవ్వమని చెప్తాడు. అందువల్ల మాధవ్ ప్రతీక్షిస్తుంటాడు .నికమ్ వచ్చాక అతడికి తాయెత్తు తో సహా బాబా వారి దంతాన్ని అతడికి అందచేస్తాడు.
1950 లో శ్రీ నరసింహ స్వామీ జీ ఆ మందిరం లో బాబా విగ్రహం, దంతం మరియు చిలుము ని ప్రతిష్టించారు. ఆ దంతం మరియు చిలుము బాబా యొక్క వెండి పాదుకల్లో పోదగబడ్డాయి..
నమో సాయినాధం …నమో సాయి నాదం…మనము కూడా పూనా వెళ్లి బాబా దంతం పోడుపర్చబడిన ఆ పాదుకలని దర్శించుదము.
జై సాయి నాథ్..జై గురు దేవా సాంబశివా