ఏలూరు సాయి కోటి మహా స్థూపం
సాయిరాం ..ఏలూరు లో సాయి అనుగ్రహం తో ,పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి చే స్థాపించబడిన సాయి కోటి స్థూపం (100 అడుగుల ఎత్తు ) మహిమ తెలుసుకుందాము.
సాయిభక్తులు శ్రీ యాళ్ల సత్యనారాయణ గారి అనుభవం, వారి మాటల్లో నే, ..”ఫిబ్రవరి నెల 1999 లో బాబా వారు నాకు స్వప్న దర్శనానుభవాన్ని ఇచ్చ్చారు ..కల లో షిరిడి లో సాయి నివసించేది మసీదు కనిపించింది, అది ఇప్పటి షిరిడి లో ని నూతన మసీదు కాదు, పాడుపడిన శిథిల మసీదు.ఆ మసీదు లో సభ తీర్చిన మరాఠి మనుషులు గుండ్రంగా కూర్చుని ఎవరినో చూస్తున్నారు. నాలో కుతూహలం కలిగి అందరినీ పరికించి చూసాను. తాత్యా పాటీలు, శ్యామా, నానా చాందోర్కర్, భాగోజి షిండే మొదలయినవారు కన్పించారు. ఒక్కసారిగా నేను కేకలు వేయడం మొదలు పెట్టాను.”చుడండి ,తాత్యా అదుగో, శ్యామా అడిగో ..అందరూ ఇక్కడే వున్నారు,నేను అందరినీ చూడగల్గుతున్నాను, బాబా వెంట వుండి జన్మ ధన్యత చేసుకున్న పుణ్యమూర్తులు వీరే” అంటూ అరవడం మొదలు పెట్టాను.
ఒళ్ళంతా పులకింత, భావావేశం తో వూగిపోతున్నాను. అంతలో గుంపు మధ్య లో నుండి ఆజానుబాహువు అయినా సాయి లేచారు. పాదాల వరకు జీరాడే పొడుగు చొక్కా,, తలకి ఒక పక్క గా వేలాడుతున్న గుడ్డ ని తల మీంచి చుట్టుకుని వున్నారు, నేను ఆత్రుత తో వారి రూపాన్ని చూస్తున్నాను, లేచిన సాయి దిక్కులు పరికించారు, చేతి వేళ్ళను విచిత్రం గా తిప్పుతున్నారు, నాట్య మాడే రీతి లో, అటు ఇటు వేగం గ కదులుతూ, తలని వింతగా తిప్పుతూ, మధ్య మధ్య దూరం గా దృష్టి ని సారిస్తూ దిగంతాల వరకు చూస్తూ కనిపించారు.
మరాఠి సభాసదులు అందరూ తలలు పయికెత్తి సాయి బాబా ని కుతూహలం గా చూస్తున్నారు, వున్నట్లుండి సాయి ఆలోచన పూర్వకమయిన ముఖ కవళికలు కలిగి, గంభీరం గా ” నేను ఏలూరు వెళ్తున్నాను..నేను ఏలూరు వెళ్తున్నాను ” అంటూ వేగంగా చేతులు తిప్పుతూ జనాన్ని దాటుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్లిపోయారు. అందరూ ఆశ్చర్యం గా చూస్తూ నిశ్చేష్టులయ్యారు. నేను ఒక్కసారిగా తేరుకుని “బాబా ఎక్కడికి వెడుతున్నారు” అంటూ అక్కడి వారిని అడుగుతూ ఉండగా స్వప్నం చెదిరిపోయి మెలకువ వచ్చింది
మెలకువ రాగానే స్వప్న అనుభవాన్ని అనేకసార్లు జ్ఞాపకం చేసుకున్నాను. అసలు ఏలూరు వెళుతున్నానని ఎందుకన్నారో అర్థం కాలేదు . నెల రోజుల తర్వాత షిరిడి యాత్ర కి వెళ్లాను,బాబా ని తనివి తీరా చూసాను, తిరుగు ప్రయాణం లో మా ట్రైన్ సామర్లకోట సమీపిస్తున్నది, మాలో ఒక సాయి బంధువు నా దగ్గరకి పని ఉన్నట్లు వచ్చ్చారు. ఏలూరు వస్తున్నారా అని అడిగారు. ఎందుకు అన్నాను అయ్యో మీకు తెలియదా, గురుగారు నురవ సాయి కోటి యజ్ఞం అక్కడ నిర్వహిస్తున్నారు. అక్కడ నూట అడుగుల ఎత్తు సాయి కోటి మహా స్థూపం నిర్మించబడి వున్నది” అన్నారు.
అదే అనమాట, బాబా వారు స్వప్నం లో చెప్పిన ఏలూరు రహస్యం . యజ్ఞ ఫలాన్ని పంచడానికి షిరిడి సాయి మహారాజ్ ఏలూరు యజ్ఞ వాటిక కి చేరుకున్నారు.
సాయి బంధువులారా, మనందరం ఏలూరు వెళ్లి సాయి కోటి మహా స్థూపాన్ని దర్శించి మనసారా సాయి ని కొలిచి జన్మ ధన్యం చేసుకుందాం
సేకరణ: “ప్రేమ మూర్తి” పుస్తకం నుండి