బాబా చిత్ర పటము అంటే స్వయంగా బాబా నే
శ్రీ కృష్ణారావు నారాయణ్ పాడుల్కర్ (చోటు భయ్యా) హార్ద లో నివాసం ఉండేవాడు. 1915 లో వీరికి బాబా దర్శనం ఇఛ్చి ” నేను సద్దు భయ్యా ఇంటికి వచ్చాను రమ్ము, వచ్చి నా దర్శనం చేసుకో” అని అన్నారు. సదాశివ్ దుదిరాజ్ (సద్దు భయ్యా) కూడా హర్దా నివాసి.
బాబా సద్దు భయ్యా ఇంటికి ఎలా వచ్చారో చూద్దాము
1915 ,ఫిబ్రవరి లో సద్దు భయ్యా కి దీక్షిత్ గారినుండి ఒక ఉత్తరం వచ్చింది. దాని సారము ,”శ్రీ ముక్తారామ్ గారిఇంట్లో బాబా యొక్క పెద్ద ఫోటో వుంది, దాన్ని ముక్తారామ్ గారు సద్దు భయ్యా కి ఇవ్వాలనే ప్రేరణ కల్గి దాన్ని తీసుకుని హార్దా వస్తున్నారు, అందువల్ల ఎవరినయినా రైల్వే స్టేషన్ కి పంపి బాబా చిత్ర పఠం తీసుకు వెళ్ళమ”ని ఆ ఉత్తరం సారము.ఈ లేఖ అందుకోగానే సద్దు భయ్యా బాబా ని ఎదుర్కొని స్వాగత సత్కారాలతో తన ఇంటికి ఆహ్వానించడానికి మరి కొంత మంది భక్తులతో స్టేషన్ చేరుకుంటాడు. ట్రైన్ రాగానే ముక్తారామ్ మరియు బాలారాం ఇద్దరి మధ్య లో బాబా పెద్ద ఫోటో ని చూసి తన్మయులవుతారు .సద్దురామ్ ఆనందం తో ట్రైన్ భోగి లో కి వెళ్లి బాబా పఠాన్ని హత్తుకుని ట్రైన్ దిగుతాడు.
అలా బాబా సద్దు భయ్యా ఇంటికి వచ్చిన రోజు శ్రీరామ నవమి ఉండెను.అందరూ బాబా ని దర్శించుకుని సాయంకాలం ఆరతి ఇచ్చారు. సద్దు గారు రుద్రాభిషేకం, పూజ.చేసాడు ..ముక్తారామ్ బలరాం సలహా మేరకు బాబా పఠాన్ని సింహాసనం పై అధిష్టింప చేశారు .ఈ విధం గా సంప్రదాయ పద్ధతుల్లో అన్ని లాంఛనాలతో బాబా వారి చిత్రం సింహాసనం పై అధిష్టించబడింది. ఫకీర్లకి దక్షిణ మరియు పెడా లు పంచబడ్డాయి.
ముక్తారామ్ ఇంటి పై కప్పు ఎక్కి బాబా జండా ని ఎగరవేయసాగాడు,అతడు ఏ ప్రదేశం పై కాలు పెట్టి నించున్నాడో, అది చాలా బలహీనం గా వుంది,ఏ సమయం లోనయిన విరిగి పోయేలా ఉండెను..అలా జండా ఎగరవేస్తుండగా, ఇంకా జండా మధ్యలో నే వుంది అంత లో తన పక్క లో విపరీతమయిన నొప్పి రాసాగింది, పంటి బిగువున నొప్పి ని భరించి అతను ఆ కార్యం పూర్తి చేసాడు ..అలా సురక్షితం గా జండా ఎగరవేసి కిందికి రాగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు..ఎప్పుడయితే ముక్తారామ్ పై కప్పు పై వున్నాడో ఆ సమయం లో నే షిరిడి లో బాబా పక్క లో నొప్పి మొదలయ్యింది.బాబా ఫకీర్ బాబా తో మసాజు చేయించుకుంటూ ,” అల్లాహ్ మాలిక్, పేదవారి రక్షకుడు.,అల్లాహ్ మాలిక్ కన్నా ఎవరూ గొప్పవారు కారు” అంటూ బాబా ముక్తారామ్ నొప్పి ని తన పయి వేసుకున్నారు, ముక్తారామ్ ఎక్కిన ఇటుక విరగకుండా కాపాడి తనని రక్షించారు.
సద్దు భయ్యా జీవితాంతం ఆ విధంగా బాబా ఫోటో కి సాక్షాత్తు బాబా కి సేవ చేయునట్లు నిత్య పూజ ఆరతులు ఇచ్చాడు.
1937 లో సద్దు భయ్యా దేహాంతం సంభవించింది.సాయి బాబా ద్వారా అతడికి పంపబడిన చిత్రం ఆ తర్వాత ఏ పూజ లేకుండా వేరే ఊరిలో పడి ఉండెను. బాబా సద్దు భయ్యా పుత్రుడు లక్ష్మణ రావు కి స్వప్నం లో కనిపించి, ” నేను చిత్రం రూపం లో మీ ఇంటికి వస్తే, నన్ను అవహేళన చేసి దూరం గా పెట్టారు, రెండు రోజుల్లో నన్ను ఇక్కడి నుండి విముక్తుడిని చేయక పోతే నా కాళ్ళు తెగిపోతాయి ఇక ” అని అన్నాడు. లక్ష్మణ రావు కి ఆ స్వప్నం సరిగ్గా అర్థం కాక ఎప్పటిలా తన వుద్యోగం లో నిమగ్నమయ్యాడు , కానీ అశాంతి గా ఏ పని సరిగ్గా చేయలేకపోయాడు. ఆ రోజు రాత్రి మల్లి బాబా స్వప్నం లో కనిపించి ” నువ్వు నా సూచన ని అర్థం చేసుకోలేదు, నువ్వు వచ్చి నన్ను విముక్తుడిని చేయకపోతే చెద పురుగులు నా కాళ్ళని తినేస్తాయి ” అన్నాడు..ఈసారి అతను గాభరా పడి త్వర గా తన ఊరికి వెళ్లి తన ఇంటి తలపులు తెరవగానే హైరానా పడ్డాడు. చెద పురుగులు బాబా ఫోటో యొక్క చెక్క ఫ్రేమ్ ని మొత్తం తినేసాయి, మరియు చిత్రం లోని బాబా పాదాల వేళ్ళ వరకు వచ్చేసాయి. అతను వెంటనే చిత్రాన్ని కిందికి దింపి శుబ్రపర్చాడు.తర్వాతా బాబా ఫోటో ని తన తో పాటు ఇండోర్ కి తీసుకు వెళ్లి అక్కడ ఫోటోగ్రాఫర్ చే బాగు చేయించి తన ఇంట్లో పునః ప్రతిష్టించుకున్నాడు. ఆ రోజు నుండీ పూర్తి నిష్ఠ భక్తి తో బాబా ఫోటో ని పూజాదికాలతో సేవించుకున్నాడు.
ఈ లీల ద్వారా బాబా ఫోటో లేదా విగ్రహం అంటే స్వయంగా బాబా వారే అని మనం అర్థం చేసుకోవాలి,,బాబా విగ్రహం మన ఇంట్లో ఉంటే బాబా స్వయంగా మన ఇంట్లో ఉంటున్నాడని భావించి బాబా సేవ చేసుకోవాలని మనకి తెలుస్తోంది