శ్రీ సాయి కృప
సాయి తో నా అనుభవాలు -మూడవ భాగం
ఈ వేసవి సెలవుల్లో షిరిడి వెళ్లాలనిపించి తోడు గ మా అమ్మ ని తీసుకుని మే 17 న మేము షిరిడి కి బయలుదేరాము.మరుసటి రోజు షిరిడి చేరుకొని ఫ్రెష్ అప్ అయ్యి సమాధి మందిరం దర్శించుకున్నాము. బాబా విగ్రహం చూస్తుంటే, బాబా కనులు విప్పార్చి మమ్మల్ని కళ్ళతో నవ్వుతూ పలకరిస్తున్నట్లు గా అనిపించింది. అదే విషయం మా అమ్మ ని అడిగితే తనకి కూడా సరిగ్గా అలా నే అనిపించిందట..దాన్ని బాబా విగ్రహం అనుకుంటాం కానీ, భక్తి భావం తో చూస్తే బాబా నే సాక్షాత్తు అక్కడ కూర్చుని మనలని, మన భావాలకి అనుగుణంగా స్పందిస్తూ పలకరిస్తుంటారని మనకి అవగతమవుతుంది.సమాధి మందిరం లో ప్రవేశించాక, బాబా చూసే ఆ చూపుని పట్టుకునే ప్రయత్నం చేయాలి .అపుడు బాబా చూపు మన చూపులతో కలిసినపుడు కలిగే ఆనందం మరువరానిది.
తర్వాతా మేము గురుస్థానం వెళ్ళాము.బాబా కూర్చునే వేపచెట్టు చుట్టు ప్రదక్షిణ చేస్తూన్నాను .అంతకు ముందు సమాధి మందిరం లైన్లలో నిలుచుని అలిసిపోయి ఉండటం వల్ల బాబా తో మనసులో , “బాబా ఈసారి ఈ వేపాకులు ఏరే తతంగాలు నేనిపుడు పెట్టుకోను” అనుకుంటూ ప్రదక్షిణ చేస్తోన్నాను. వెంటనే వేప చెట్టు నుండి వేపాకు సరిగ్గా నా తల పయి నే పడింది, తీసుకోకుండా ఎలా వెళ్లావన్నట్లు గా. చాలా ఆనందం కలిగింది.మరుసటి రోజు గురుస్థానం దగ్గర నేను రాగానే మల్లి ఒక ఆకు బాబా దయతో ఇచ్చ్చారు నా ముందు ఆకు ని రాలించి..అయితే అక్కడ ఒక భక్తురాలు ఆర్తి తో బాబా ని ప్రార్థిస్తుండటం చూసి ఆ వేపాకు ప్రసాదం తనకి ఇచ్చేసాను. బాబా మల్లి నాకు ఇస్తారని నమ్మకం తో ప్రదక్షిణచేస్తున్నా. కానీ బాబా ఎంత వేడినా ఇవ్వలేదు.సరే బాబా ఇక నుండి నువ్వు నాకిచ్చిన ప్రసాదం ఎవరికీ ఇచ్ఛేయ్యను అనుకుని వేదన తో వేపాకు కోసం చూసాను, అపుడు బాబా మల్లి వేపాకు ఇచ్చారు అలా ప్ర్రార్థించాక..బాబా మన మనసులో ని ప్రతీ ఆలోచన ని గమనిస్తూ వుంటారు. అలా బాబా తో ఎప్పుడూ కాంటాక్ట్ లో ఉండాలి సాయి భావాలని మాది నిండా నింపుకుని సాయి భావన పొందాలి .
మందిరం కాంప్లెక్స్ లో సాయి సేవక్ (మా గురుగారు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి ద్వారా దీక్ష తీసుకున్న ఒక సాయి భక్తురాలు) కలిసి గురుగారు ఆశ్రమం లో దర్శనం ఇస్తున్నారని తెలియచేసింది .ఆనందం గా వెళ్లి గురుదర్శనం చేసుకున్నాను. నేను షిరిడి వెళ్లాలని నిర్ణయించుకోకన్నా ముందు ఒకరోజు గురుగారిని చూడక 4నెలలు అవుతుందని, గురు దర్శనం కోసం తపించాను. అపుడు బాబా సందేశం గా “సంతులని దర్శించాలన్న కోరిక ఉంటే, ఆ గురువే కాకుండా దైవం కూడా సహాయం చేసి కోరిక తీరుస్తారు” అని సూక్తిని ఇచ్చ్చారు. ఆ మాట ని బాబా ఇలా నెరవేర్చారు .
ఇంటికి తిరిగి వచ్చేరోజు ద్వారకామాయి లో దర్శనం చేసుకుంటుంటే, మా అమ్మ అక్కడి పూజారిని బాబా ప్రసాదం గా కొబ్బరికాయ ని అడుగు అని నన్ను ప్రేరేపించింది. కానీ నేను మనమంతా గొప్పవారిమీ కాదు బాబా ప్రసాదం అందుకునేంత అని అనుకుంటూ నే భయం గా అక్కడి పూజారి ని కొబ్బరికాయ అడిగాను, ఆయన వెంటనే, ఇస్తాను అంటూ కొబ్బరికాయ ఇచ్చ్చారు,అపుడు నా ఆనందం చెప్పాలంటే మాటలు సరిపోవు,. ఎందుకంటే, నేను షిరిడి వెళ్లే ముందే బాబా ని ఇలా ప్రార్థించాను, “బాబా, నేను ఆగష్టు లో మా ఊరిలో ప్రారంభించదలిచే చిన్న సాయి మందిర నిర్మాణానికి అనుమతి ఆశీర్వాదాలనిస్తూ షిరిడి కి నేను వచ్చినపుడు షిరిడి లో ఏదన్నా ఇవ్వు నాకు” అని వేడుకున్న..దానికి సమాధానం గా బాబా నాకు మా అమ్మ ద్వారా కొబ్బరికాయ ప్రసాదం అడగడానికి ప్రేరణ కల్గించి అనుగ్రహించారు..అలాగే, గురుస్థానం లో పూజారి ద్వారా , శివ లింగం పై గల పూల మాలని తీసి నాకు ప్రసాదం గ ఇచ్చ్చారు నేను అడగకుండానే.బాబా భక్త వత్సలత ని యేమని చెప్పగలము.
వెళ్లేముందు సమాధిమందిరం లో ని విగ్రహం కనిపించే కిటికీ దగ్గర నిల్చుని బాబా ని చూస్తూ “వెళ్తున్నా బాబా” అన్నాను, ఒక చల్లని గాలి శరీరానికి తగిలి బాబా ప్రేమ ని నాకు చేరవేసింది.(సమాధి మందిరం బయట నుండి కిటికీల్లో, ఒక కిటికీ గుండా చూస్తే, మందిరం లో ని బాబా విగ్రహం లోని ముఖ భాగం స్పష్టం గా కనిపిస్తుంది.).ఇలా బాబా ప్రేమానురాగాలని మా మాది నిండా నింపుకుని మా ఊరికి బయలుదేరాము.
జై సాయిరాం