కర్మ

మనం సాధారణంగా “ఇది నా ఖర్మ” అని అంటూ ఉంటాం..ఈ కర్మ అంటే ఏంటి ? ఈ కర్మ గూర్చి మనం తెలుసుకుందాము

మన ధైనందిన జీవితం లో మనం ఎన్నో కర్మలు లేదా పనులను చేస్తుంటాము.మంచివో , చెడ్డవో ఏదో ఒక కర్మ ని మనిషి చేయకుండా వుండలేడు .మంచి పనులనే సత్కర్మ లు అంటాము . ఉదాహరణ కి జీవితం లో, మన వృత్తి వ్యాపార ఉద్యోగాధి విషయాల్లో, మన బాధ్యత ని మనం మనస్ఫూర్తిగా, ఫలితాన్ని ఆశించకుండా చేయడము సత్కర్మ అవుతుంది. అలాగే,సమాజం లో ని హీనులని, బీదవారిని ఆదరించడం, అన్నం పెట్టడం, ఇతర సేవలు అందించడమూ సత్కర్మలని మనకు తెలుసు.ఈర్ష స్వార్ధ క్రోధాదులతో మనం చేసే పనులు దుష్కర్మలై మనలని బాధిస్తాయి. ఆ యా పనులు చేసేలా కలి మాయ మనలని ప్రొత్సాహిస్తూ ఉంటుంది. మన పక్కవారు అభివృద్ధి చెందుతుంటే కొందరి మనసు లో మాయ చేరి, వారిని ఎలాగయినా నాశనం చేయు, లేదా అపకీర్తి తెచ్చేలా వారి పయి దుష్ప్రచారం చేయమని పోరుతుంది. వద్దు అంటూ బుద్ధి చెప్పే మాట ని పట్టించుకోకుండా చివరికి మాయ కి లొంగిపోయి తప్పుడు పనులు చేసేస్తాము.అలాగే, ఎవరయినా మనలని నిందించినా, మనం తిరిగి కోపం తో వూగిపోతూ ప్రతి నింద చేస్తాము.ఇలాగె ఎన్నో. చివరకి మన జీవితపు బ్యాంకు లో , పాపా పుణ్యాల మన ఖాతా లో మరో తప్పు చేరిపోతుంది. ఆ సందర్భం లో. మనం కఠినం గా , దృఢం గా వుండి , మనసు చెప్పే మాయ మాటలకి లొంగక, విజ్ఞత తో బుద్ధి ని సారధి గా పెట్టుకొని చేడు వైపు మరలకుండా ఉంటే, దుష్కర్మలు చేసి, తద్వారా ఆ ఫలితాలను అనుభవించకుండా మనలని మనం కాపాడుకోగలుగుతాము..

దీనికై జగద్రక్షకుడయిన సాయి సహాయం అర్థించాలి.. పిలిస్తే పలికే సాయినాధుడు తప్పక మనలని చెడు కర్మ చేయకుండా అడ్డుకుంటాడు.ఎందుకంటె, కర్మ ఫలాలు చాలా ఖచ్చితం గా ఉంటాయి అని సాయి హెచరించారు .సాయి జీవిత చరిత్ర లో మనం గమనించొచ్చు ఈ విషయాన్ని. ఒక రోజు సాయి ఒక భక్తురాలి ఇంటికి మధ్యాహ్న సమయం లో భిక్ష కి వెళతాడు. అదే సమయం లో ఆమె తన ముసలి మామ గారికి అన్నం పెట్టడానికి , ప్లేట్ లో అన్నీ పెట్టుకోబోతుండగా, సాయి భిక్ష కి రావడం గమనించి తన మామ గారిని కాసేపు ఆగమని చెప్తుంది.అపుడు బాబా ఆమె ని వారించి, ” అమ్మ, మీ మామగారికి భోజనం పెట్టడం నీ కర్తవ్యం. నాకు భోజనం పెట్టడం సత్కర్మ. సత్కర్మ కన్నా మన కర్తవ్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లేనిచో,నువ్వు తప్పు చేసినట్లు అవుతుంది. నన్ను నమ్ముకున్న నీచే తప్పు జరగకుండా చూడడం నా బాధ్యత” అని చెప్పారు. ఇలా ఏ చిన్న విషయం లో నూ మనం తప్పు చేయకుండా సాయి మనలని కాపాడుతుంటారు (ఒకవేళ సాయి ని నమ్ముకుని ఉంటే)..

మనం ఏ కర్మ చేస్తే ఆ ఫలితం తప్పక అనుభవించాలి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు.మనసు తో చేసె తప్పుడు పనులకి మానసిక బాధలు, శరీరం తో చేసే చెడు పనులకి శారీరిక అనారోగ్య సమస్యలు సాధారణం గా వస్తాయని మహాత్ములు చెపుతారు,. ఈనాడు సమాజం లో ఎవరయితే హత్యా, మానభంగాలు ఎవరిపట్ల అయితే చేస్థారో, మరుజన్మ లో వారి ద్వారానే అదే హత్యా , మానభంగాల బారిన పడుతారని అంటారు.. అందువల్లా పాప భీతి, దైవ ప్రీతీ ఉండాలంటారు.

12508888_10207106813541637_8652847225849349238_nదేవుడి పట్ల ప్రేమ తో కూడిన భక్తి మనలని మన కర్మ అనే సాగరం నుండి దాటించే నావ లాంటిది. భగవంతుడికి తన నిజ భక్తుల మీద ప్రేమ సాటి లేనిదీ. నిజ భక్తుడు కష్టాల్లో వున్నపుడు, ఆర్తి తో పిలిచే పిలుపు కి కరిగిపోయే భక్త వస్తలుడు. కర్మ ఫలితంగా వచ్చే సంకటాలను, ఆ కర్మ ని స్వయంగా తాను అనుభవించడమొ లేక కర్మ ని చాలా మటుకు తగ్గించి నామ మాత్రం గ తన నిజ భక్తుని చే అనుభవింప చేస్తాడు ఆ భగవంతుడు. సాధారణంగా అయితే 100 శాతం అనుభవించవలసిన మన కర్మ ఫలాలని, మన చే, మనకి తెలియకుండానే మనచే పాప పరిహారం చేయించడం ద్వారా కేవలం మనచే పది శాతం ఫలితాలని అనుభవింపచేస్తాడు సాయి నాధుడు. కానీ పదే పదే తప్పులు చేస్తూ బాబా రక్షణ నుండి మనం దూరం కావొద్దు.

సాధారణం గ కొన్ని సందర్భాలలో కొందరు ఎన్ని దుర్మార్గాలు చేసినా , హాయిగా సంతోషం గా బ్రతుకుతుండటం కొందరికి ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. మేము ఎంతో భక్తి తో బాబా ని సేవిస్తున్నా , ఈ కష్టాలు తప్పవేంటి అని బాధపడుతూ వుంటారు. అయితే గురుగారు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారు చెప్పిన సమాధానం ఏంటంటే, సాధారణం గా మనంచేసిన కర్మ ఫలం మనకి తిరిగి రావడానికి కనీసం 15 నుండి 20 సంవత్సరాలు పడుతుందట, దుర్మార్గులకయితే ఇంకా చాలా సంవత్సరాల తరువాత వారు చేసుకున్న కర్మ తిరిగొచ్చి కర్మ క్షయం అవుతుందంట, అంటే, వారి కర్మ క్షయం అవడానికి చాలా సమయం పట్టడమే కాక, అంత టైం లో కొత్తగా చేసుకున్న దుష్కర్మల ఫలితాలని అనుభవించడానికి మరో నీచ జన్మ, ఆ తర్వాత మరో నీచ జన్మ ఇలా సాగిపోతూ వుంటుందట. సజ్జనులకయితే వాళ్ళు చేసుకున్న కర్మ ఫలం వెంటనే అదే రోజు కు తిరిగి వస్తుందట..అలా సాయి తన నిజ భక్తులు చేసిన కర్మ ఫలాలని వెంట వెంటనే ఇఛ్చి(అది కూడా చాలా మటుకు తగ్గించి.) , వారి ముసలితనపు దశ లో, వారి కి ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతం గా వుంచుతాడట.అందుకే, నిజ భక్తులకి వారి సమస్యలు ఎక్కువ గా ఉన్నట్లు అనిపిస్తుంధి.అది తెలియక మనం మన సాయి ని నిందిస్తాము.అలా చేయవద్దు.

12507288_930792953701915_4277852592150666064_n (1)మన ప్రతీ సమస్య వెనక కారణం మనం చేసుకున్న కర్మ అనీ, దయాళువయినా సాయి మన కర్మ ని చాలా మటుకు తగ్గించగా మిగిలినదే మనం అనుభవిస్తున్నామన్న సత్యాన్ని ప్రతీ సాయి భక్తుడూ గుర్తుంచుకోవాలి.
కర్మ చేయడం వేసిన బాణం లాంటిది,ఫలితాన్ని తప్పక ఇస్తుంది కాబట్టి మనం మన ప్రతీ ఆలోచన, ప్రతీ పని చేసే ముందు బుద్ధి తో అలోచించి ఇది మంచిదేనా కాదా అని ప్రశ్నించుకోవాలి, మరియు బాబా సలహా అనుమతి పొందాక మాత్రమే ఆయా పనులు చేస్తే మనం కర్మ కోరలకి చిక్కుకోము. దానికయి నిత్యం ఆధ్యాత్మిక గ్రంధాలు చదవడం , భగవంతుడి నామ స్మరణ ,సత్సాంగత్యం చేస్తూ ఉండాలి. ఇవి మన మనసులని పవిత్రపరిచి మనలని చెడు వైపు వెళ్లకుండా చూస్తుంది.అలాగే ప్రతిరోజూ పూజ, ధ్యానం చేస్తూ మన మనసుని భగవంతుడిపయి నిలపాలి.దీనివల్ల మంచి చెడుల విచక్షణా జ్ఞానం కలుగుతుంది.ఈ ప్రక్రియ జీవితాంతం చేయాలి. ఎందుకంటే, ఇక మనము ఏ తప్పులు చేయము అని ధీమా తో సద్గ్రంధాల పారాయణం, సధ్సాంగత్యం మాని వేసినచో, ఎప్పుడు మల్లీ మాయ మనలని లొంగదీసుకుంటుందో మనకి తెలియదు. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తం గా వుండి అరిషడ్వార్గాలనే శత్రువులని తుద ముట్టించడానికి సాయి సైనికుడిగా పోరాడాలి.

12489241_1947331785491864_4547523204605062966_oఅయితే ఇప్పటికే కొన్ని తప్పులు చేసేసి ఉంటే గనుక వాటి పరిహారానికయి ప్రయత్నించాలి.ఉదాహరణ కి ఎవరికయితే ద్రోహం చేసామో, వారికి తిరిగి న్యాయం చేయాలి. ఎవరిదగ్గరయితే దొంగతనం చేసామో వారికీ వారి వస్తువు ఇచ్ఛేయ్యాలి.ధ్యానం ద్వారా మన కర్మ నాశనం చేసుకోవచ్చ్చని చెబుతారు.ప్రతి రోజు ఉదయం సాయంత్రం 45 నిమిషాలకి తగ్గకుండా నిర్ణీత టైం లో ధ్యానం మంచిదట.

అయితే బద్ధకం , నిర్లక్ష్యం వాళ్ళ మనం ఇవన్నీ పాటించలేకపోతున్నాము. శ్రద్ధ తో , ఓర్పు తో ఇవన్నీ మనం పాటిస్తే మన ఉన్నతి నిశ్చయము. ఇది మనకు మనమే సాధించుకొని మనం మంచి స్థితి ని పొందాలని ఆశిద్దాము.

ఆధారం: పూజ్య గురుదేవులు, సాయి పాద రేణువులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి బోధనలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close