సాయిరాం. మనము బాబా ని లేదా భగవంతుడిని ఏవేవో కోరికలు కోరుతుంటాము ఏవేవో ఇమ్మని పోరు పెడుతుంటాము బాబా దగ్గర. మన అర్హత పాత్రత ఎంత ఉందొ ఎరుక అనేది లేకుండా మన కోరికల పై నే దృష్టి పెట్టుకుని ఉంటాము ..కానీ బాబా కి మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఇవ్వాలో ఏది యివ్వకూడదో బాబా కి ఖచ్చితం గా తెలిసి ఉంటుంది. కానీ , అజ్ఞానం తో మనం అనుకున్నదే మనకు అవసరము అనే భావన తో మన కోరిక తీరనందుకో ,ఆలస్యం అవుతున్నందుకో మనం బాబా ని నిందిస్తాము. అందుకే సర్వస్వ శరణాగతి అలవర్చుకోవడం సాయి భక్తులుగా మనకి అత్యంత అవసరము .
ఒకసారి జ్యోతేన్ద్ద్ర తర్కడ్ వేసవి సెలవుల్లో బాబా దర్శనార్థం షిరిడి ఒచ్చారు . అపుడే ఒక స్త్రీ గంప లో తరభూజా పళ్ళ గంప తో వీధి లో వెళ్లుచుండగా బాబా ఆ పళ్ళను కొనెను వాటి ని భక్తులకి ముక్కలు గా కోసి పంచి పెట్టసాగారు. ఆ సమయం లో ద్వారాకామాయి కి ఒక వ్యక్తి బాబా దర్శనార్థం వచ్చ్చాడు. ఆయన తన మధుమేహం రోగాన్ని నయం చేయమని ప్రార్థించమని ఇతరులు బలవంతం చేసి బాబా వద్ద కి పంపగా వస్తాడు. బాబా తరభూజా పళ్ళ ముక్క యొక్క యెర్రని గుజ్జు భాగాన్ని తర్ఖడ్ కి యిచ్చి , ఆకుపచ్చ్చని తోలు భాగాన్ని ఆ వ్యక్తి కి ఇఛ్చి తినమంటాడు . అపుడు ఆ వ్యక్తి కోపం తో “నేనేమి పశువును కాదు. యిలా తొక్కలు తోళ్ళు తినడానికి ” అని అక్కడినుండి వెళ్ళిపోతాడు. అపుడు బాబా , “ఆ మహాశయుడికి పండు తోలు తినడం యిష్టం లేదు . సరే, అయితే నువ్వు దీన్ని తిను ” అని అనగా తర్కడ్ గురు ప్రసాదం గా దాన్ని తింటాడు. ఆశ్చర్యం!! ఆ తొక్క పండిన అరటిపండు గుజ్జు లా మృదువు గా , చాలా తియ్య గా ఉన్నది . తర్కడ్ తన జీవితం లో అంత తీయని తొక్క తిని లేకుండెను . శరణాగతి భావన తో బాబా యిచ్చింది తిన్న తర్ఖడ్ కి ఇక జీవితం లో ఏ అనారోగ్యము దరిచేరలేదు. వాస్తవానికి ఆ వ్యక్తి యొక్క మధుమేహ రోగ నివృత్తి కె బాబా ఆ తొక్క తినమని ఆ వ్యక్తి కి ఆజ్ఞాపించి ఉండెను కానీ ఆ వ్యక్తి బాబా తన క్షేమం కొరకే అలా ఆజ్ఞాపించాడని గ్రహించలేక , అజ్ఞాన అహంకారం లో మునిగి పోయి సాయి నుండి దూరమయ్యాడు.తన రోగ నివృత్తి బాబా నుండి పోందలేకపోయాడు .
ఈ విధం గా జీవితం లో మనకి ఎదురయ్యే ఏ ప్రలోభానికీ లొంగక, బాబా పట్ల దృఢమయిన భక్తి విశ్వాసాలతో మన జీవితం లోని సర్వ భారాలని , బాబా పాదాలపయి వేస్తే , బాబా మన భారాలను తాను వహిస్తాడు అపుడు మనకి ఏ చింతా లేదిక .అన్ని నిర్ణయాలని సాయి కి వదిలేసి మనం బాబా వడి లో నిశ్చింత గా ఉందాము . అన్నీ ఆయనే చూసుకుంటారు ఏ చిన్నా విషయమయినా ఆయన ఇష్టానికే వదిలేద్దాము.ఎందుకంటె, సాయి కి మన గూర్చి ,మనకేది మంచిదో అనే విషయం గూర్చి మన కన్నా వారికే సంపూర్ణం గా తెలుసు. ఎందుకంటె, జన్మ జన్మ ల నుండీ మనలని వెంటాడుతూ వస్తున్నారు బాబా.. మన గత సంస్కారాలు, అవసరాలు అన్నీ ఆయనకి ఎరుక. అప్పుడే పుట్టిన శిశువు కి తన కేమి కావాలో ఏమీ తెలియదు. కానీ తల్లి తన బిడ్డ కి ఏది ఎప్పుడు అవసరమో అవి అన్నీ సకాలం లో అందించి ఆనంద పడుతుంది. అలా మనం బాబా వడి లో పసివాళ్ళము గా మనలని భావించుకుని, ప్రతీది నీకే వదిలేస్తున్నా బాబా అని చెప్పుకోవాలి. నా చెయ్యి పట్టుకుని నడిపించు బాబా అని వేడుకోవాలి.ఎందుకంటె సతచరిత్ర లో చెప్పబడినట్లుగా, ఈ జీవితం అంతు తెలియని కీకారణ్యం లాంటిది. దీనిలో ఎక్కడ గోతులు ఉన్నాయో, ఎక్కడ క్రుర మృగాలు మన పయి దాడి చేస్తాయో తెలియదు. కాబట్టి సాయి చేయి పట్టుకుని వారి వెంట మన జీవితం సాగించినచో మనం సుఖం గ ఉంటాము.
కానీ ఇక్కడ బాబా పట్ల అనన్య భక్తి నమ్మకం అవసరము ..అంటే బాబా నిర్ణయాన్ని హృదయ పూర్వకంగా ఒప్పుకోవాలి. “ఏ భక్తుడయితే అనన్య భక్తి తో నన్ను శరణాగతి వేడుతాడో నన్నే స్మరిస్తాడో ధ్యానిస్తాడో , వాడి నలువయిపులా ఉండి, వాడి యోగ క్షేమాలని నేనే చూసుకుంటాను ” అని బాబా అన్నారు . కాబట్టి మనం బాబా పట్ల అలాంటి ధృడ విశ్వాసం నమ్మకం ని అలవర్చుకుందాము . సాయి సన్నిధి లో ఆనందం గా జీవిద్దాము నిశ్చిన్త గా…