శ్రీ సాయి నాధాయ నమః
సాయి అనుగ్రహం తో , నాకు ఈ మధ్య జరిగిన ఒక అనుభవం మీతో పంచు కోవాలనుకుంటున్నాను .
నేను రోజూ నా పక్కన శ్రీ యోగానంద గారి బుక్ పెట్టుకుని పడుకోవడం నాకు అలవాటు .ఒకరోజు నిద్ర లో వుండగా ,మధ్య లో నేను చయితన్య స్థితి లో కి వొచ్చినాక, నాకు ఒక దృశ్యము కనిపించి నది . అది కల కాదు నా మనో నేత్రం తో నా ముందున్నది నాకు కనిపిస్తున్నది . పూర్తి చయితన్యం తో నేను చూస్తున్నాను .కానీ కళ్ళు మూసుకొని చూస్తున్నాను. ఏంటంటే, నా ఎడమ పక్క నుండి లేత కాషాయం కలర్ లోన ఒక మనిషి ఆకారం పై కి లేచి నా పొట్ట పై ఉన్న నా చేతి ని విసురు గా పక్క కి నెట్టింది . ఆ హఠాత్ పరిణామానికి నేను ఉలిక్కి పడి ఏయ్ అని కూడా బయటికి అనేశాను ఎవరూ అని అడిగినట్లు గా.. అయితే నేను నిజంగా నా పక్క న జరుగుతున్నదే నేను నా మూడవ నేత్రం తో చూసానన్నది అర్థమయ్యింది . ఎలా అంటే, ఆ ఆకారం నా చేతిని నా పొట్ట పై నుండి విసురుగా పక్క కి నెట్టేస్తున్న దృశ్యం చూస్తున్నప్పుడే ,నా చేతి విసురుగా నా ప్రమేయం లేకుండా నిజం గానే పక్కకి విసురు గా పడింది. నా ఎడమ పక్కన శ్రీ యోగానంద గారి ముఖ చిత్రం ఉన్న బుక్ వుంది. నాకు తెలిసింది ఏంటంటే శ్రీ లేత కాషాయం రంగు బట్టలు కట్టుకునే యోగానంద గారే నా చేతి ని అలా నా పొట్ట పై నుండి తప్పించి పక్క కి నెట్టేశారు.(వారు నా మూడవ నేత్రానికి మాత్రమే కనిపించారు). ఎందుకంటె అప్పటికి నా చేతి ,నిద్ర లో చాలా సేపు నుండి కదలకుండా నా పొట్ట పైన ఉండుట చే రక్తప్రసరణ ఆగి చేతి రాయి లా గా మొద్దు బారి విపరీతమయిన నొప్పి తో వుంది.ఇంకా కాస్సేపు అదే స్థితి లో ఉంటె, ఇంకా చాలా ఇబ్బంది అయ్యేది..జరగబోయే ఆ ఇబ్బంది నుండి తప్పించడానికి నా చేతిని నా పొట్ట పైనుండి అలా తప్పించారని అర్థమయ్యింది.
ఇక్కడ మూడవ నేత్రం అంటే, మన కనుబొమ్మల మధ్యన ఉంటుంది. ఇది అందరి లో ఉంటుంది. ధ్యానం మొదలయిన వాటి వల్ల ఒక్కోసారి ఇది జాగృతం అవుతుంది. అలా జరిగినప్పుడు మనకి జరగబోయేవి లేదా మన ముందు జరుగుతున్నవి చిన్న చిన్న విషయాలయినా మనకి దృశ్యాలు గా కనిపిస్తాయి..ఇంట్లో మన అమ్మ చేసే కూర సడ్డెన్ గా మనకి కనిపిస్తుంది. తీరా వంటింట్లో కి వెళ్లి చూస్తే అదే ఉంటుంది. అలాగే సడన్ గా ఒక బొమ్మ కనిపిస్తుంది స్పష్టం గా. అదే బొమ్మ కొన్ని రోజులకి ఏ షాప్ లో నో, బయట ఎక్కడో చూస్తాము. కొందరికి జీవితం లో జరిగే కీలక ఘట్టాలు కూడా ముందే కనిపిస్తాయి. ఈ మూడవ నేత్రం జాగృతం అయ్యేప్పుడు నుదురు మధ్య లో లేదా కనుబొమ్మల మధ్య లో ఒక స్పందన అవుతుంది, ఇవన్నీ మనం సాయి భక్తి లో లీనమయ్యి ధ్యానాదుల్లో, మన ఏకాగ్రత నిలిపినప్పుడు వాటంతట అవే జరిగిపోతుంటాయి.ఆ భారం కూడా సాయి దే.
మనం నమ్ముకునే ఆ దైవానికి ఎంత శ్రద్ధ తన భక్తులపై ఉంటుందో కదా. వారెప్పుడూ మన గూర్చియే ఆలోచిస్తారు.. మనం మాత్రం వారి పట్ల అంత శ్రద్ధ అస్సలు కనబరచము. ( నా దృష్టి లో దైవ శక్తి ఒక్కటే, శ్రీ యోగానంద గారి లో వున్నదీ మనం పూజించే సాయి శక్తే. అనంత జలము కుండలో ఉన్న, బిందె లో వున్నా ఒక్కటే, దాన్ని కప్పి ఉంచే ఆకారాలు భిన్నము.).మనము కూడా వారి పట్ల శ్రద్ధ తో ఉంటే , మనం దాట లేని భవ సాగరం లేదు, మనం అందుకోలేని ఉన్నత శిఖరాలు వుండవు.ప్రపంచం లో మనకి కావాల్సిన ప్రతీది మన చెంతకే వస్తుంది అప్పుడు. కాబట్టి ప్రపంచం లో ని అన్ని గౌరవ మర్యాదలు కోసం ప్రాకులాడకుండా, సాయి సామ్రాజ్యం లో, సాయి మహారాజ్ దగ్గర ప్రేమ పొందడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు సర్వస్వము మనదే ఇక, ఇక మనకు ఇంకేమి అవసరం లేదు. సాయి వంటి సర్వ శ్రేష్ఠుడు , జన్మ జన్మ లకీ మనలని విడువని వాడు మన చెంతన ఉండగా, ఎప్పుడు మనలని వదిలేస్తారా వారికే తెలియని ఈ ప్రాపంచిక జనాలని నమ్ముకోవద్దు.వారికొరకు ప్రాకులాడొద్దు. ఆ ప్రయత్నం లో ఆరాటాలు తప్ప చివరకి మిగిలేది శూన్యం. కాబట్టి ఈ తెలివి తక్కువ ఆరాటాలయిన దనం కోసం ఆరాటం, గౌరవాలు పేరు గుర్తింపు కోసం ఆరాటం, వ్యక్తుల ప్రేమ కోసం ఆరాటం ఇవన్నీ పక్కన పెట్టెయ్యాలి. మనలని అసలుగా నిఖార్సు గా ప్రేమించే అత్యంత శ్రేష్ఠమయిన ప్రేమికుడిని వెతకండి.ఎవరయితే మన లోని అన్ని లోపాలని తెలిసి కూడా, మనం జన్మ జన్మలనుండీ చేస్తూ వఛ్చిన పాపపు రాశులకి తాను సాక్షి అయినా కూడా,మన పై అంతే ప్రేమతో మనలని ఉద్ధరించడానికి తపిస్తూ వుండే మహిమాత్ముడు ఎవరో తెలుసా?
ఆయనే , ఆ “భగవంతుడు”