సందేహాలు- గురుగారి సమాధానాలు
ప్ర; ధ్యానం ఎలా చేసుకోవాలి? ఏ సమయం లో చేసుకోవాలి? ఎంత సమయం చేసుకోవాలి?
జ : ధ్యానం నీకు వీలయినప్పుడు చేసుకో, కానీ రోజూ అదే టైం కి చేసుకోవాలి. ధ్యానం ఎప్పుడు మంచిది అంటే సూర్యోదయానికి ముందే అయితే మంచిది.సూర్యోదయానికి గంటన్నర ముందే అనగా నాలుగు నాలుగున్నరకి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి సుమారు 45 నిమిషాలకి తగ్గకుండా ధ్యానం చేసుకుంటే మంచిది..స్టార్టింగ్ లో అంత చెయ్యలేకపోతే రోజు పది నిమిషాలు , 20 ,30 నిమిషాలు యిలా పెంచుకుంటూ పోవాలి. కనీసం అలా 45 నిమిషాలకి తగ్గకుండా ఎంత సేపయినా చేసుకోవచ్చు.
ప్ర: మనసు బుద్ధి లగ్నం కావాలంటే ఏం చెయ్యాలి?
జ: ప్రాపంచిక విషయాలు తగ్గించుకోవాలి (యూట్యూబ్, ఫేస్బుక్ ,ఇంటర్నెట్ లో పనికిరాని చెత్త విషయాలు , సోది కబుర్లు చూస్తూ ఉండొద్దు ). మన బాధ్యత మనం సక్రమం గ నిర్వహిస్తూ మిగిలిన టైం లో అనవసర విషయాల జోలికి పోకుండా ప్రపంచం నుండి ఎంత జ్ఞానం తీసుకోవాలో అంతే తీసుకోవాలి.అపుడు మిగిలిన మనసు సమయం కాళీ గా ఉంటుంది. అది దేవుడి పై పెట్టు.
ప్ర: ఆడవారు ఇబ్బందికరమయిన రోజులలో కూడా పూజ చేసుకోవచ్చా?
జ: సాయిబాబా పూజ విషయం లో చేసుకోవచ్చూ. తప్పు లేదు. అది శారీరకం గ శరీరం లో జరిగే ఒక ప్రక్రియ మాత్రమే.పవిత్రత మనసులో ఉండడం అవసరం . కానీ మీ ఇంట్లో పరిస్థితులకి అనుగుణం గా నడుచుకోవాలి. మీ అత్తగారు ఆ రోజుల్లో పూజ వద్దంటే చెయ్యకు..మీ ఇంట్లో వాళ్లకి ఇబ్బంది లేకపోతే చేసుకోవచ్చు.ఏదయినా “నొప్పింపక తానొవ్వక” అనే పద్ధతి లో ఉండాలి.