ఒక సాయి భక్తుడు పొందిన సాయి లీల వారి మాటల్లోనే,
“ముందుగా సాయి బంధువులందరికి “సాయిరాం.”నేను సదాశివ శంబల్పూర్ నుంచి ఈ లీల వ్రాస్తున్నాను.
నాకు ఒక గురువారం బాబా చూపిన అద్భుతమైనలీలను మీతో పంచుకోవాలని రాస్తున్నాను. నిజంగా,మరుపురాని,మరిచిపోలేని బాబా లీల. ఆయన భక్త వాత్సల్యం వర్ణించనలవి కానిది.
ఆరోజు గురువారం.నేను ప్రతి గురువారం బాబా దర్శనానికి ఆయన మందిరానికి వెళతాను. మాధవి మేడం వాళ్ళు అందరూ కలిసి కట్టిన మందిరం అది. పోయినవారం చాలా వానలు పడినాయి. మీరు news లో చూసివుంటారు. ఒరిస్సా లో చాలా వానలు అని. అప్పుడు నేను గురువారం మందిరానికి వెళుతూ ఉండగా,ఒక వయసుమల్లిన ఆమె 70 years ఉండవచ్చు నడుచుకుంటు అదే మందిరానికి వస్తూవుంది. నేను,ఆవిడ బురద లో నడుస్తున్నాము. ఆమె చేతిలో ఒక పెద్ద రోజా పువ్వులు,సంపెంగ పువ్వుల మాలా ఉంది. అన్ని షాప్స్ వాన వలన మూసి ఉన్నాయి. ఆమెను అడిగాను,”అమ్మ నువ్వు ఈమాల ఎక్కడ కొన్నావు” అని అప్పుడు ఆమె చెప్పింది,”కొనలేదు బాబు నేనే పుష్పాలు కొని పెద మాల బాబాకోసంఅల్లినాను” అనింది. ఇది చూసి నేను ఆశ్చర్య పోయినాను. ఎంత భక్తి బాబా మీద ఈవిడ కు,అనుకున్నాను. పైగా ఆవిడ చాలా బీదరాలు నాలాగే. కానీ బాబా కు ఆ రోజు మాల వేయాలని, పైసలు దాచుకొని, పువ్వులు కొని ఇంట్లో అల్లింది అంట. నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. ఎన్ని రకాల భక్తులు వున్నారు,ఈ విస్వంతరాలల్లో అనుకున్నాను. ఆ ముసలావిడను చెయ్యి పట్టుకొని వెళ్తున్నాను మందిరానికి. ఇంతలో ఆ పూల మాల చెయ్యి జారీ క్రింద పడింది బురద లో. పాపం,ఆమె పడే బాధ చూడాలి,చాలా వేదన పడింది. నాతో అనింది,”సదా, బాబా కు నా పూలమాల నచ్చలేదు కాబోలు,బురద లో పడిపోయింది,నేను ఇంటికి వెనక్కు వెళతాను” అని వెనుతిరిగింది. నేను అన్నాను “వద్దు అమ్మపూలమాల పోతే పోయింది, దర్శనం చేసుకొని వెళదాము,వానలో ఇంతదూరం వచ్చావు. రా వెళదాం” అని నచ్చ చెప్పి ఆమెను మందిరానికి తీసుకెల్లాను.
మందిరం చేరాము ఎలాగోలోపలికి వెళ్ళి చూసి మేము ఆశ్చర్య పోయినాము. అక్కడ ఈమె బాబా కు వెయ్యాలనుకున్న,అవ్వే రంగు కల్గిన పూమాల ధరించి రాజదిరాజ్,యోగిరాజ్ అయినా సాయిదేవుడు విరాజమానుడై వున్నాడు.అప్పుడు ఆమె అన్నది” అరె,సదా..ఇది నేను అల్లిన మాలనే, మరి అక్కడ బురద లో పడిపోయింది కదా, ఇక్కడికి ఎలా వచ్చింది.? నేను అక్కడే వదిలేసాను కదా,అప్పుడు నేను అన్నాను,బాబా లీల చేశారు,నీ భక్తి కి మెచ్చ్చి. చూసావా!, ఇక్కడ ఈరోజు పూల దుకాణాలు లేవు,జనాలు లేరు,ఎలా వచ్చింది ,ఎవరు వేశారు సరిగ్గా అలాంటి మాలనే?ఆయన నీ భక్తికి మెచ్చి, సరిగ్గా బురదలో పడిన ఆ మాలనే స్వఛ్చపరచి మరీ తెచ్చుకున్నాడు,నిన్ను అనుగ్రహించాడు, అన్నాను. అపుడు 70 సంవత్సరాలు నిండిన ఆమె మొఖం లో ఆనందం వర్ణింప నలవి కాదు.
బాబా భక్తవస్థలుడు.దీనజన భాంధవుడు నిజంగా. ఆమె అల్లిన మాల బురదలో పడిపోయినా, ఆమె బాధ చూడలేక, అదే మాలని స్వఛ్చపరచి మరీ బాబా ధరించడం నిజంగా అద్బుతం.స్వచ్ఛమైన భక్తితో మీరు,పత్రం,పుష్పం, ఫలం, తోయం,ఏదీ మీరు సమర్పించిన,నేను స్వీకరిస్తాను, అని చెప్పకనే చెప్పారు సాయి నాథులు. బాబా మన భక్తి ని చూస్తారు. తన భక్తుడు కర్మ మలినాలలో ఒకవేళ మునిగి వున్నా , తన భక్తుడి ని దూరం చేసుకోవడం ఇష్టం లేక, ఆ భక్తుడి కర్మ మాలిన్యాలను తన కృప తో స్వఛ్చపరచి మరీ తనను అక్కున చేసుకుంటారు, అలాంటి కృపా సింధు మన సాయీశ్వరుడు .సర్వం సాయినాథార్పణమస్తు
సేకరణ: సాయి బంధువు, శ్రీమతి మాధవి (భువనేశ్వర్ )