శ్రీ సత్ చిత్ ఆనంద సమర్ధ సద్గురువు కృపాళువు సాయి నాథ్ మహారాజ్ కీ జై …సద్గురు సాంబశివగురుదేవ కీ జై సాయిబాబా తనని నమ్మిన భక్తులని వెన్నంటి కాపాడుతాడు అన్నదానికి మరొక నిదర్శనం గా శ్యామ్ దాస్ అనే భక్తుడి అనుభవం గ్రహిద్దాము
ఉద్ధవేశ్ అలియాస్ శ్యామ్ దాస్ :
శ్యాందాస్ గారికి పుణ్యక్షేత్రాలు దర్శించుకున అలవాటు ఉండేది. ఒకసారి కొందరు యాత్రికులతోబాటు స్టీమర్ ద్వారా ద్వారక కి ప్రయాణం అవుతాడు.అతని దగ్గర ఒక డబ్బు సంచి లో స్టీమర్ టికెట్స్ మరియు కొంత డబ్బు ఉండెను.. తర్వాత తాను బాబా ప్రేరణ తో టికెట్స్ తన జేబు లో పెట్టుకున్నాడు. అయినా డబ్బు మాత్రం ఆ సంచిలోనే ఉండిపోయెను. ఆ సాయంత్రం అతను స్టీమర్ యొక్క రోలింగ్ దగ్గర నించుని ఉండగా అకస్మాత్తు గా ఆ డబ్బు సంచి సముద్రం లో పడిపోయెను. ప్రయాణపు టికెట్ వున్నాయి కానీ అవసరాలకి ఉపయోగపడే డబ్బు లేనందుకు అతను వ్యాకులపడసాగాడు . శ్యాందాస్ కొడుకు గిరిధర్ కి అప్పుడే ఒక స్పష్టమయిన కల బాబా చూయించారు. కలలో ఒక ఫకీర్ గిరిధర్ ని నిద్రనుండి లేపుతూ ” ద్వారక లో మీ తండ్రి కోసం డబ్బులు పంపించు” అన్నాడు. అతను లేచి చుట్టూచూసేసరికి ఎవరు లేకపోవడం వలన మరల పడుకుంటాడు. ఈసారి ఆ ఫకీర్ కోపం తో “నేను నిన్ను మీ తండ్రి కి డబ్బులు పంపిచామన్నాను. అతను అక్కడ ఇరుక్కున్నాడు. నువ్వేమో ఇక్కడ హాయిగా పడుకున్నావా” అనీ అనగా గిరిధర్ లేచి ఆ ఫకీర్ ని వెతకడానికి గుమ్మం దాకా వెళ్లగా అక్కడఎవరూ లేకుండెను. అతను ఆ స్వప్నం గూర్చి ఆలోచించి నిజం గా నే తన తండ్రి ఏదో కష్టం లో వుండి ఉండొచ్చు అనుకుంటాడు. ఆరోజే తనకి భీమా కంపెనీ నుండి డబ్బులు రాగ వాటిని తన తండ్రి కి పంపించడం జరుగుతుంది. డబ్బులు అందుకున్న శ్యాందాస్ ఒకవైపు సంతోషం ఒకవైపు ఆశ్చర్యానికి లోనవుతాడు. ఇంటికి తిరిగి వచ్చాక తన కొడుకు ద్వారా సాయి లీల తెలుసుకుని పులకించిపోతాడు.
ఆ తరువాత శ్యాందాస్ షిరిడి కి బాబా దర్శనార్థం వెళ్లగా, శ్యామా బాబా తో దేవా , మీ దర్శనార్ధం శ్యామదాస్ వచ్చాడు ..అనగా బాబా తన సహజమైన చిద్విలాసం తో “నేను చాలా కాలం నుండి తన యోగక్షేమాలు చూస్తూ వున్నాను. భవిష్యత్తు లో నూ చూస్తుంటాను ” అన్నారు. బాబా శ్యాందాస్ తో “నువ్వు డబ్బుసంచి ని సముద్రం లో పడవేసుకున్నావు. అల్లా మాలిక్ నీకు డబ్బులిచ్చాడు ..నీకు త్రాగడానికి ” మంచి నీళ్లు కూడా ఇచ్చాడు.” అనగానే శ్యాందాస్అంతా గుర్తుకు తెచ్చుకుని బాబా యొక్క భక్త వత్సలత కి, ప్రేమకి వుద్వేగుడయ్యి బాబా వారి శ్రీచరణములపై వాలిపోయాడు.
ఈ లీల తో బాటు నిన్న మా పూజ గది లో బాబా చూపిన లీల మీతో పంచుకుంటాను. మొన్న మార్నింగ్ పూజ చేసేప్పుడు నేనే బాబా ఫోటో శుభ్రం చేసి మళ్ళీ గోడకి పెడుతున్నప్పుడు గోడ పై పెయింటెడ్ టైల్ పై ఉన్న దత్తాత్రేయుణ్ణి సాయి ఫోటో కవర్ చేస్తోన్న విషయం గమనించాను. పర్వాలేదు లే, ఈసారి ముందటిలా వెంకటేశ్వరుణ్ణి కవర్ చెయ్యట్లేదు గా బాబా ఫోటో ( సాయి తో నా అనుభవాలు శీర్షికన వఛ్చిన నా అనుభవం చదివే వుంటారు. అప్పుడు యిలాగే బాలాజీ ఫోటో ని కవర్ చేస్తూ నేనే బాబా ఫోటో పెట్టి పూజించాను), ఈసారి దత్తాత్రేయుడేగా , బాబా దత్తాత్రేయులు ఒక్కరే కదా ,ఏం కాదులే బాబా అనుకుని అలాగే బాబా ఫోటో దత్తాత్రేయుల వారి ని కవర్ చేసేలా పెట్టాను నాకెదురుగా ఉంటుందని
ఇలా ఫోటో పెట్టడం జరిగింది
మరుసటి రోజు అనగా నిన్న నేను పూజ చేయడం కోసం పూజ రూమ్ లో వెళ్లగా దత్తాత్రేయులవారు కనిపించేలా బాబా ఫోటో పక్కకి జరిగి వుంది . బాబా జరిగారు అన్నది నేను గుర్తించగలిగేలా బాబా ఫోటో గోడ కి ఒక చివర మాత్రమే ఆనించి వుంది, ఎందుకంటె ఎప్పుడూ నేను గోడ కి అలా ఫోటో ని ఒక చివర మాత్రమే ఆనుకుని ఉండేలా పెట్టను . మా ఇంట్లో వారిని అడగ్గా వారు కూడా ఫోటో జరపలేదని తెలిసింది. బాబా ఫోటో ఇలా పక్కకి జరిగి వుంది .
అపుడు నాకర్ధమయ్యింది బాబా మా పూజ గది లో తన ఉనికి ని ఈ లీల ద్వారా తెలియా జేశారని.. జై సాయిరాం
Sairam
LikeLike