సాయిరాం.. బాబా ఎవరిని ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తారో తెలియదు అని సత్ చరిత్ర లో మనము చదివినట్లుగానే , బాబా సేవ సరిగ్గా చేయని నాకు కూడా బాబా వారు రాత్రి స్వప్నం లో కనిపించారు. మాములుగా నాకు నిద్ర సరిగ్గా పట్టదు. కొన్ని సమస్యలు టెన్షన్స్ వాళ్ళ కలత నిద్ర పడుతోంది .నిద్ర లో ఏవేవో అర్థం లేని కలలు వస్తుంటాయి ..అలాగే ఏదో కల . ఏదో మంచిది కాని దృశ్యం కనిపిస్తోంది. దాన్ని చూస్తున్న నాసూక్ష్మ దృష్టి కి సడన్ గా సాయి సమాధిమందిరం లో నున్న సాయి పాదం కనిపించినది. ఒకవేళ మనము సాయి కాలు మీద కాలు వేసుకున్న పాదం కి దిగువన ఉండి పైకి బాబా ని చూస్తే ఎలా కనిపిస్తారో బాబా , అలా సాయి పాదం కి దిగువన నేనున్నట్లుగా , అలా సాయి రూపం పైనుండి కిందికి నన్ను చూస్తున్నట్లు గా కనిపించింది. రియల్ గానే బాబా కళ్ళు , ముఖం కదులుతున్నాయి. బాబా నన్ను చూస్తున్నారు . అలా ఆ దృశ్యం మాత్రం నేను ఎప్పుడు చూసే యేవో కలలు గా కాకుండా నిజం గా జరిగినట్లు గా అనిపించింది. నా అచేతన స్థితి లో ని భౌతిక భావాల ఫలితం గా నేను చూస్తున్న లౌకిక దృశ్యాలకి బాబా అడ్డుకట్ట వేస్తూ తన దివ్యమైన రూపాన్ని నాకు ప్రసాదించారు. పైగా నాకిష్టమైన బ్లూ కలర్ డ్రెస్ లో సమాధి మందిరంలో సింహాసనం పై వున్నట్లుగా. మార్నింగ్ లేచి ఇది కూడా నా ఊహేనేమో అనుకున్న.. కానీ ఈరోజు నేను చుసిన దృశ్యం లో ని డ్రెస్ లో, బాబా సమాధిమందిరం ఫోటో కూడా నాకివ్వాళ ఫేస్బుక్ లో కనిపించింది అది నిజమేనని బాబా చెపున్నట్లుగా..
- నేను నేర్చుకున్న కొద్దిపాటి భరతనాట్యం కళను పిల్లలకి నేర్పిస్తూ వుంటాను. ఈ మధ్య ఒక ప్రిన్సిపాల్ కాల్ చేసి వాళ్ళ స్కూల్ వార్షికోత్సవం ప్రోగ్రాం కోసం భరతనాట్యం సాంగ్ నేర్పించమన్నారు. నేను సాయిబాబా పాట లేదా శివుడి పాట పై నేర్పిస్తాను అని చెప్పాను. కానీ తాను ఒప్పుకోక, దుర్గా మాత పాట పై (అయిగిరి నందిని) డాన్స్ నేర్పించమన్నారు. కానీ నాకు ముందు నుండీ కూడా అమ్మవారి పై అస్సలు భక్తి భావం ఉండేది కాదు. అందువల్ల నాకు ఆ పాట పై డాన్స్ తయారు చేయడం అస్సలు ఆసక్తి అనిపించలేదు. ఒక చరణం తయారు చేసినంత లో అనుకోకుండా మా గురుగారి సత్సంగ్ కోసం విజయవాడ వెళ్ళాను.(బాబా వెళ్లేలాచేసారు.) అక్కడ సత్సంగ్ అయిపోయాక బస్సు కి ఇంకా చాల టైం వుంది కాబట్టి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను.తిరిగి వెళ్లేప్పుడు కూడా అమ్మవారు తనదయిన రీతి లో పలకరించారు.అలా అమ్మవారి పై భక్తి కలిగింది. తిరిగి వచ్చాక భక్తి గా మిగితా చరణాలు పై డాన్స్ తయారు చేసాను. అప్పటి నుండి తిరిగి వచ్చేప్పుడు మరియు కొన్నిరోజులదాకా ఎక్కడ చూసినా “సాయి దుర్గ” అనే పదాలు,అమ్మ వారి ఫొటోస్ బస్సెస్, ఆటోస్, షాప్స్ పయి ఇలా కొన్ని వందల సార్లు కనిపించాయి. (బాబా అలా చూయించారు). బాబా ఎందుకో అలా ,మిగితా రూపాలు కూడా నావే అని తెలియచేస్తున్నట్లుగా అనిపించి చాలా ఆనందం కలిగింది. “నేనే జగన్మాతను..ఈ కనిపించే రూపాలు నావే ” అన్న బాబా పలుకులు గుర్తొచ్చిఆనందించాను. బాబా, ఈ అధమురాలిపై మీ కృప కి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిని.