భక్తులు: దేవుళ్ళను గుడికి వెళ్ళి పూజిస్తే మంచి మనసులో తలచుకుంటే మంచిదా?
గురుదేవులు: ప్రశ్నలన్నీ బానే వున్నాయి. దేవుళ్ళను గుడికి వెళ్ళి పూజిస్తే మంచిదా?మనసులో తలచుకుంటే మంచిదా? అంటే పూజ ఎప్పుడూ మనసులోనే మంచిది. మనసులో పూజించటం నిరాకారం అన్నమాట. మనసులో నిరాకారమైన దేవుడికి పూజ చెయ్యాలి. పూజ అంటే ఏమీవుండదు మనసులో భావనే. మనసులో పూజించటం అనేది నెంబరు 1, శ్రేష్ఠం అది. అయితే దీనిగురించి చరిత్ర తెలుసుకోవాలి. చరిత్రలో అసలు విగ్రహాలు లేవు. విగ్రహారాధన భారతదేశంలో మొట్టమొదట లేదు.
భక్తులు: అసలు పుణ్యం జమకాని వ్యక్తి ఇతరుల * శపిస్తే అతని పుణ్యం ఎలా కరుగుతుంది?
గురుదేవులు: పుణ్యం జమకాని వ్యక్తి ఎన్ని తిట్టినా ఏమీఅవ్వదు. ఇందాక ఏమనుకున్నాము, నీ దగ్గర పుణ్యబలం * కొద్దిగా వుంటే నువ్వు ఏదైనా అనుకుంటే అదిజరుగుతుంది. పుణ్యబలం లేని మనిషి ఏమనుకున్నా అది జరగదు. అంటే నేను ఇందాక చెప్పినదానికి రిప్లై అన్నమాట ఇది. నువ్వు అనుకున్నంత మాత్రాన ఏమీ | అవ్వదు. ప్రపంచమంతా నాశనమైపోవాలి అనుకో ఏమీ అవ్వదు, ఒకవేళ అయితే నువ్వు నాశనమవుతావు. ఎందుకంటే నాశనం చేయటానికి శక్తి లేదు కదా అది నీవైపు తిరుగుతుంది. అర్థమైంది. అందుకని పొరపాటునఎప్పుడు ఎవరికీ అపకారం చెయ్యకండి. చెయ్యాలని కూడా అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ బాబావారి సూక్తి మనం గుర్తు తెచ్చుకోవాలి, “అపకారికి కూడా ఉపకారం చేయుము. ఎవరికీ కీడు తలపెట్టకుము” అని.
సేకరణ: “నిత్య సత్యాలు”
గురుదేవులు (శ్రీ అమ్ముల సాంబశివ రావు గారు )