సాయిరాం. బాబా తన భక్తుల మనసులో మెదిలే ప్రతీ ఆలోచనని గ్రహించి వెంటనే వారి భావన కి అనుగుణం గా ఎలాంటి లీలలు చూయిస్తారో ఈ క్రింది లీల చుడండి. ఈ లీలని ఒడిస్సా లోని భువనేశ్వర్ కి చెందిన సాయి బంధువు శ్రీమతి మాధవి గారు మన ముందుకి తెస్తున్నారు. చదవండి .
“నేను మాధవి,భువనేశ్వర్ నుంచి. అందరూ సాయి బంధువులకి సాయిరాం..ఇపుడు నేను చెప్పబోయే లీలను మీకు ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు.దీన్ని సాయి లీల అనేదానికన్న,ఆయనకు తన భక్తులమీద చెప్పనలవికాని కరుణ అంటే బాగుంటుంది.ఇది 70 వసంతాలు దాటిన ఒక భక్తుని అనుభవం.US లో వుంటారు.నిన్న అర్ధరాత్రి నాతో పంచుకున్నారు బాబా చూపిన కృపను.కానీ తన పేరు వెల్లడి చేయకు.అన్నారు.అసలు విషయాన్ని ఆయన మాటలలోనే విందాము.”
సాయి రాం..మొన్న సోమవారం మా ఇంటి తోటలో రెండు పసుపుపచ్చ గులాబీ పూల మొగ్గలు ఉండినాయి.. నేను అనుకున్నాను గురువారం బాబా పూజకు ఇవి అద్భుతంగా ఉంటాయి,అని ఎంతో సంతోషపడిపోయినాను. రోజూ సాయంత్రం చూసుకునే వాడిని. అవి నిన్న బుధవారం సాయంత్రానికి పూర్తిగా విచ్చుకున్నాయి. ముందు వాటికి తుంచి ఫ్రిడ్జ్ లో దాచుకుందాం, అనుకున్నాను.కానీ తరువాత “వద్దులే,రేపు పొద్దునే తుంచుదాం..అనుకోని అలాగే ఉంచాను. గురువారం రానేవచ్చింది .తొందరగా లేచాను. నేను ఆ రెండు పచ్చగులాబీ ల లో ఒకటి,బాబా కోసం,ఇంకోటి దక్షిణామూర్తి భగవాన్ కోసం పెడతాను అనుకున్నాను.పొద్దున లేచి చూస్తే,అసలు అక్కడ పువ్వులు లేవు. “సోమవారం నుంచి ఎదురు చూస్తున్నాను,ఎక్కడ పోయినాయి,ఏమో బాబా కు నచ్చలేదేమో”,అని మనసులో చాలా బాధ పడ్డాను.
అంతేకద,మనం మాములు మనుషులం,ముందు, వెనక ఆలోచించకుండా బాధ పడుతూవుంటాము.కానీ ” తాను ఒకటి తలచిన,దైవం ఇంకొకటి తలచును” అని సామెత ప్రకారం దైవం ఆలోచన వేరేగా ఉంది. నేను పూజ చేసుకుందామని దేవుడిగది లో కి వెళ్ళాను.చూస్తే,రెండ పసుపుపచ్చ రోజా పూలు దక్షిణామూర్తి దేవుడికే పెట్టి ఉన్నాయి.మనసులో “అయ్యో, బాబా నీకు నేను ఒక్కటి కూడా ఇవ్వలేక పోయినాను,అదే భారతదేశం అయివుంటే వెంటనే బజార్ కు వెళ్లి రెండు పువ్వులు తెచ్చిండు,ఇక్కడ నాకు ఏమి తెలీదు,నన్ను క్షమించు సాయి’ అనుకోని నా రోజు వారీ పారాయణం మొదలు పెట్టాను. ఇంతలో ఆశ్చర్యం” దక్షిణామూర్తి భగవాన్ కు పెట్టిన పసుపు రోజా పువ్వు రెక్కలు ఊడి నా సాయి చరిత్ర మీద పడినాయి. గాలి లేదు,ఏమి లేదు,ఏదో అద్భుతం జరిగినట్లు నాకు అనిపించింది.నాకు బాబా కృప కు చాలా ఆనందంగా అనిపించింది .పూజ అయిపోయినాక నీళ్ళ కోసం వంటగది లోకి వెళ్ళాను.చూస్తే అక్కడ ఫ్రెష్ గా ఉన్న రోజా పుల రెక్కలు బోలెడన్నివున్నాయి,ఎవరు పెట్టారో, ఇంట్లో ఎవ్వరు లేరు,అంతకు ముందు చూస్తే లేవు,సాయి చరిత్ర పారాయణం తరువాత చూస్తే ఎన్నో వున్నాయి.నేను ఆనందం పట్టలేక పోయినాను.ఆ పసుపుపచ్చ రోజా పులా రెక్కలు తెచ్చి బాబా పాదాలమీద ఉంచాను రెండు మూడు రెక్కలు. చెప్పుకుంటే చిన్న లీలనే. కానీ ఎలా జరిగింది,ఎందుకు జరిగింది?? 70 వసంతాలు నిండిన ఒక వృద్దుడి హృదయంతరాలల్లో ఉన్న చిన్న కోరికను బాబా స్వయం గా వచ్చి తీర్చారు,అంటే ఆయనకు ఎంత కృపనో తన భక్తుల పైన.మీరే ఆలోచించండి.అందుకే ఆయనను కరుణా నిదాన్.. అంటారు. కరుణా నిదాన్ అంటే శ్రీరామ చంద్రుడు.. అందుకే ఆయన సాయి రాముడు.
సర్వం సాయినాధార్పణమస్తు.
Sai Ram
LikeLike