కాకి రూపం లో సాయి

సాయిరాం, తిరుపతినుండి పేరు వెల్లడించడానికిష్టపడని ఒక సాయి బంధువు తన అనుభవం వివరిస్తున్నారు. .వారి మాటల్లోనే చదివి ఆనందించండి.

193915_171150229602493_3015710_o”ఈ అనుభవం సాయిబాబా లీలా విశేషం .మీతో పంచుకుంటున్నదుకు చాల ఆనందం గా ఉంది .ఈ లీల 7 ఇయర్స్ ముందు జరిగింది .నేను అపట్లో సాయిబాబాకి కాకడ హారతి, శేజ్ ఆరతి పాడుతాను .బాబా జీవిత చరిత్ర చదువుతాను .ఒక రోజు బాబా బుక్ లో నానా చాందోర్కర్ ర్ కి బాబా కలలో కనపడి ఈ రోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని రాసివుంది .నేను అది చదివి బాబా మా ఇంటికి కూడా భోజనానికి వస్తే బాగుంటుంది అనుకున్నాను .మరుసటి రోజు అన్ని రకాల వంటలు చేసి ఎదురుచూస్తున్నాను.12 పీఎం ఇయ్యింది ఇంకా ఎవ్వరు కనపడలేదు అంటే బాబా ఏ రూపం లో వస్తారో తెలియదు కదా .1. 30 పీఎం ఇయ్యింది .నాకు చాల భాధ వేసింది .నేను తినలేదు .ఇంటిలోకి వెళ్ళాను. అప్పుడు ఒక కాకి గట్టిగ అరిచింది .కాకి ఆలా అరవడం మొదటి సారి విన్నాను. బయటకి వెళ్లి చూసాను .సరే నేను వండిన అన్నింటిని ఒక ప్లేట్ లో వేసి తీసుకెళ్ళాను .మాములుగా కాకి ఎవరైనా వస్తే ఎగిరిపోతుంది .కానీ ఈ కాకి నేను ఆ ప్లేట్ పెట్టేంతవకు అక్కడే ఉన్నది అస్సలు కదలలేదు . నా  ముందరే అన్నీ తిన్నది . తిన్నాక 10 సెకండ్స్ అలాగే ఉన్నదీ. నేను షాక్ అయ్యాను  తరువాత వెళ్ళిపోయింది .ఆ అనుభవం ఎప్పటికి మర్చిపోలేను .అప్పుడప్పుడు ఆ కాకి వచ్చి అరుస్తుంది .నేను దానికి పెట్టాకే నేను తింటాను . సాయినాధుడే కాకి రూపం లో నేను నివేదించిన భోజనం స్వీకరించాడని నా నమ్మకం.

ఆ తరువాత మేము వేరే ఇల్లు మారాము .నాకు పెట్టాకే తినేది అలవాటు వున్నది . ఇక్కడ ఒక కుక్క ఉంది .దానికి పెట్టాకే నేను తినేది . బాబా లీలలు అనంతాలు ఇది నా  అనుభవం .

నేను బాబా పై రాసుకున్న పాట

పల్లవి:
ఎ౦తపని చేశావయ్య సాయిబాబా !
నిను వదలలేక ఉన్నామయ్యా సాయిబాబా!
మీ లాగా నన్ను కాపా డేదెవరయ్యా, మీవలె నన్ను దీవి౦చు వారు ఎవరయ్యా…
చరణ౦:
ఏనాటి బ౦ధమై నీ ఒడిలో చేరాము,
ఈ జగత్తు వ్యామైహంలో పడి కొట్టుకుంటున్నా
నాకు ఆధారం నీవే సాయి ,నా ఆవేదన తీర్చేది నీవే సాయి,
సాయి,సాయి….. “సాయిబాబా “

చరణం:
ఎన్నెన్నో దేవతల రూపాలున్నా..
సాయిరూపం ఒకటే అన్నా…
భక్తులకు అభయమిచ్చే దేవుడవయ్యా,ఆపద్బాందవుడవయ్యా
పరమాత్ముడవయ్యా….పరమాత్ముడవయ్యా…..
“సాయిబాబా”

 

  • చూసారా , బాబా సర్వాంతర్యామి..పశు పక్ష్యాది క్రిమి కీటకాల్లో నూ తన ఉనికి ని మనకు అవగతం చేయిస్తారు. వీరి లీల విన్న తర్వాత నాకు జరిగిన ఒక చిన్న సాయి లీల గుర్తుకు వస్తోంది. అది యిపుడు మీతో పంచుకుంటున్నాను. 5 సంవత్సరాల క్రితం అనుకుంటా , ఒక రోజు మా యింట్లో వాళ్ళు అందరూ వూరెళ్ళారు. నాకు ఆరోజు రాత్రి ఒంటరిగా భయం గా అనిపించింది. బాబా , ఒంటరి గా వుంది బాధ గా వుంది అనుకున్నాను. ఆ తర్వాత వీధి తలుపు వేసుకుని పడుకుందామని తలుపు వేయబోతున్నాను , అంతలోనే ఒక గుండ్రటి పెద్ద పురుగు బయటినుండి లోపలికి వచ్చింది.ఆ రకం పురుగు ను ఇప్పటివరకు అసలు నేను చూడనే లేదు.పెద్దగా, గుండ్రంగా బెల్లం రంగు లో వింత గా శబ్దం చేస్తూ వచ్చింది .నేను ఆశ్చర్యం తో, కొంచం భయం తో మా ఇంటి హాల్ లోనే నిల్చుని దాన్నే చూస్తున్నాను. ఆ పురుగు మా ఇంట్లో ఎదురెదురుగా వున్న రెండు బెడ్ రూమ్స్ వుండగా , సరిగ్గా నేను పడుకునే బెడ్ రూమ్ లోకి నేరుగా ఎగురుకుంటూ వెళ్ళింది. ఇంకెక్కడా వాలకుండా సరిగ్గా నా బెడ్ పయినే వాలి కదలకుండా అలాగే చాలా సేపు ఉండిపోయింది. నేను పడుకుందామని అనుకునే లోపు ఈ పురుగు రావడం , వస్తూనే సరిగ్గా బెడ్ పైనే నేరు గా సెటిల్ అవడం తో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంత సేపు చూసినా, అది నా బెడ్ పై నుండి అస్సలు కదలట్లేదు.నాకు పెద్ద పురుగులంటే భయం కావడం వల్ల నేను ఆ పురుగు బయటకు రాకుండా ఆ రూమ్ లో లైట్ అలాగే ఉంచి ,ఆ బెడ్ రూమ్ కి డోర్ బయట నుండి గొళ్ళెం పెట్టి , ఎదురుగా వున్న బెడ్ రూమ్ లో పడుకున్నాను. ఆ పురుగు రాకుండా , ఈ రూమ్ లో లైట్ ఆఫ్ చేసి,ఈ రూమ్ తలుపు క్రింద సందు ని ఒక పెద్ద బట్ట తో గట్టిగా కవర్ కూడా చేసి అపుడు పడుకున్నాను… తెల్లారి లేచాక చూస్తే ఆశ్చర్యం !!!.నా పక్కన చూస్తే అదే పురుగు నా బెడ్ పై నా తల పక్కనే వుంది.ఎందుకంటె ఆరోజు ఇంట్లో ఎక్కడా పురుగులు లేవు. లైట్ పురుగులు వచ్చే కాలం కూడా కాదు.నేను తలుపు గొళ్ళెం పెట్టిన రూమ్ లో చూడగా అక్కడ పురుగు లేదు.ఇది రాత్రి వచ్చిన పురుగు అని నేను గుర్తు పట్టాను .కానీ అది చనిపోయి వుంది.పురుగు బయటకి రాకుండా ఇన్ని జాగ్రత్త లు తీసుకున్నా ఆ పురుగు ఎలా నా బెడ్ పై కి వచ్చిందో తెలియట్లేదు.ఎలా చనిపోయిందో తెలియట్లేదు.నేను ఒంటరిగా బాధ పడుతున్నానని బాబా ఆ రూపం లో వచ్చాడా , మరి వస్తే ఉదయం ఆ పురుగు నా పక్కనే చనిపోయి వుంది. అది ఏంటో ఇప్పటికీ తెలియలేదు… జై సాయి రామ్ .12745607_543170192525388_3490990727437284058_n13350421_1605281609732382_6249792825437540228_o

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close