సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ..
ఒకసారి బాబా సాహెబ్ తర్కాడ్ 1932 వ సంవస్తరం లో షిరిడి లో శ్రీరామ నవమి ఉత్సవము చూడాలని షిరిడి కి వెళ్తాడు.దీక్షిత్ వాడా లో స్నానం చేసిన తరువాత ద్వారకామాయి కి వెళ్లి అత్యంత భక్తి శ్రద్ధ ల తో బాబా చిత్ర పటాన్ని దర్శించుకుని పూజ చేసాడు.తరువాత సాష్టాంగ నమస్కారం చేసి ధుని మాయి లో ని విభూతి తీసుకుని, వెళ్ళిపోడానికి బాబా అనుమతి తీసుకుని సమాధి మందిరం లో కి వెళ్తాడు .అక్కడ అతను సమాధి ని పూజించి దక్షిణ అర్పిస్తాడు. రామనవమి ఉత్సవం అయిపొయింది కనుక ముంబై వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు.
అతడు ఉదయము 11 గంటలకు బస్సు దగ్గరికి వస్తాడు. ఆ బస్సు లో ప్రతి రోజు ముంబై వెళ్ళే యాత్రికులకోసం 3 సీట్స్ ఖాళి గా వుంటాయి. కాని ఆరోజు బస్సు చాలా రద్దీ గా వుంది. ఒక్క సీట్ కుడా ఖాళి గా లేకపోవడం తో తార్క్హాడ్ నిరాశ చెందుతాడు. షిరిడి నుండి తిరిగి వచేప్పుడు బస్సు లో కనీసం మూడు సీట్లు ఖాళి ఉండేవి ఎప్పుడు ..కానీ ఆ రోజు బస్సు మొత్తం చాలా రద్దీగా వుంది కూర్చోడానికి జాగా లేకుండెను,కావున బాబా సాహెబ్ తిరిగి వాడా కి వెళ్ళిపోయాడు.వాడా లో అతని మనసు చాల కలత పడింది . అసలు అలా ఎందుకు జరిగింది, తన పూజ లో ఏమయినా లోటు జరిగిందా అని ఆలోచిస్తూ ఆ రాత్రంతా ఉండిపోతాడు.
మరుసటి ఉదయము ద్వారకామాయి కి వెళ్లి బాబా చిత్రపటము దర్శనం కి చేసుకుంటాడు. ఆశ్చర్యం ..చిత్రపటం లో బాబా ముఖము చాల ఉగ్రము గా కనిపిస్తుంది . అతను నిశబ్దం గా తల దించుకుని ఏదో లోటు జరిగిందని అనుకుంటాడు. కాని ఆ లోటు ఏమిటో గుర్తుకు రాదు. ఆ తర్వాత సమాధి మందిరం కి వెళ్లి బాబా సమాధి పయి తల వుంచగానే సమాధి లో నుండి “అరె, నా సవ్వా రూపాయ ” అనగా, “అరె. నా ఒక రూపాయి 25 పైసలు ” అని వినిపిస్తుంది. అపుడు తర్ఖడ్ కి , షిరిడి కి బయల్దేరేప్పుడు తనకి తన కోడలి కి జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది. తనకోడలు బాబా కి దక్షిణ , సమాధి మందిరం లోని దక్షిణ పెట్టె లో వేయమని ఇస్తుంది. కానీ తర్ఖడ్ దక్షిణ పెట్టె లో కన్నా దక్షిణ కౌంటర్ లో వేస్తే తనకు రసీదు వస్తుంది అలాగే సాయి లీల మాగజైన్ లో తన పేరు కూడా వస్తుందని అంటాడు. అపుడు ఆమె “నేను నా పేరు పబ్లిష్ కావాలని అనుకోవడం లేదు. నేను భక్తి శ్రద్ధ ల తో బాబా కి దక్షిణ అర్పిన్చుకొవాలనుకుంటున్న” అని సమాధానం ఇస్తుంది .మీరు ఈ దక్షిణ , దక్షిణ పెట్టె లో వేయండి”అని ఆమె చెప్పిన విషయం గుర్తొచ్చి, బాబా తనకు తన భక్తురాలు (బాబా సాహెబ్ కోడలు ) ఇచ్చిన దక్షిణ సమర్పించలేనందుకు బాబా కి కోపం వచ్చిందని తెలుసుకుంటాడు. తర్ఖడ్ అలాగే చేస్తాడు.
ఈవిదం గా ” సమాధి చెందినా గాని , నా ఎముకలు మీ తో మాట్లాడును ” అని బాబా మరోసారి నిరూపించాడు.