సాయిరాం. సాయి బంధువు మాధవి గారు తనకు జరిగిన అనుభవాన్ని మనకి వివరిస్తున్నారు.వారి మాటల్లోనే..
“ఓం సాయిరాం. నేను మాధవి (భువనేశ్వర్). బాబా నాకు ప్రసాదించిన గొప్ప అనుభవాన్ని సాయి బంధువులతో పంచుకుందామని రాస్తున్నాను.మనం బాబా అష్టోత్తరం లో రోజు చదువుతాము. “ఓం కాలాతీతయా నమః” అంటే కాలానికి కూడా అతీతమైన వాడు, అని. అదే అనుభవాన్ని నాకు కలిగించారు బాబా.
కాలిఫోర్నియా లో స్థాపించిన , “విశ్వాసాయి ద్వారాకమాయి” అనే ఒక సంస్థలో నేను మెంబెర్ ని.వాళ్ళు ప్రతి సంవత్సరము విశ్వాసాయి సమ్మేళనం జరుపుకుంటారు. ఒక్కోసారి ఒక్కోచోట జరుగుతుంది.అప్పుడు అందరూ తెలుగు వాళ్ళు కలిసి బాబా భజనలు, ఆరతులు, పారాయణలు వైభవంగా చేసుకుంటారు. ఆ సంస్థను హైద్రాబాద్ కు చెందిన లక్స్మోజీ గారు స్థాపించారు.ఎప్పుడు విశ్వాసాయి సమ్మేళనం జరిగినా ,నేను షిర్డీకి వెళ్లి మా విశ్వాసాయి సమ్మేళనం ఇన్విటేషన్ కార్డ్ బాబా కు సమర్పించి వస్తాను. గత 5 సంవత్సరాలుగా నేను చేస్తు న్నాను.ఈసారి నేను వెళ్ళేది వద్దులే, అనుకున్నాను. అదే మా లక్స్మోజీ గారికి కూడా చెప్పాను.
కానీ బాబా ప్లాన్ వేరేగా వుంది. ఆయన ఈ సేవ ఎలాగై నా నాతోనే చేయించాలనుకున్నారు కాబోలు.నేను కరెక్ట్ సమయానికి షిర్డీ వెళ్లాల్సి వచ్చిం ది. మా అక్క కూతురు కాలిఫోర్నియాలో ఉంటుంది. ఆ అమ్మాయి “షిర్డీ నేను వస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి, అని టికెట్ కూడా చేసి పంపింది.
ఈ విధంగా నేను షిర్డీ జులై 11 న చేరుకున్నాను. వాళ్ళు 12th పొద్దున చేరుకున్నారు. 11 న నేను రెండు సార్లు బాబా దర్శనం చేసుకున్నాను. రెండు సార్లు బాబా నారింజ రంగు డ్రెస్ లో ఎంతో దేదీప్యమానంగా వెలిగి పోతున్నారు.నాకు చాలా నచ్చింది. అస్సలు నా కళ్ళు తిప్పుకోలేక పోయినాను. అప్పుడు అక్కడే సంకల్పం చేసుకున్నాను, “ఈ డ్రెస్ బయట షాప్ లో ఉంటే కొనుక్కొని మా విశ్వాసాయి సమ్మేళనం కు పంపుతాను”, అనుకున్నాను.కానీ అది నేను అనుకున్నంత సులభం కాదు అని తెలుసు నాకు. షిర్డీ లో బాబా కోసం భక్తులు, ఎక్కడెక్కడ నుంచో డ్రెస్ తెచ్చి ఇస్తారు. అది ఒకవేళ కొన్నా కానీ కాలిఫోర్నియా ఎలా చేరుతుంది? అందుకే ఆశ కూడా వదిలేసాను.
కానీ బాబా నా సంకల్పాన్ని ఈ విధంగా తీరుస్తారని నాకు అస్సలు తెలియదు.12th పొద్దున మా అక్క కూతురు వాళ్ళు వచ్చారు. అన్ని దర్శనాలు చేసుకున్నాము.విశ్వాసాయి సమ్మేళనం ఇన్విటేషన్ కూడా నేనే సమాధి మందిర్ బాబా పాదాల వద్ద పెట్టి, “బాబా, అందరికి నీ ఆశీర్వాదం ఇవ్వు” అని ప్రార్థన కూడా చేసుకున్నాను ఎప్పటిలా.
మా అమ్మాయికి బాబా నారింజ colour డ్రెస్ గురించి చెప్పాను. ఒకవేళ షాప్ లో దొరికితే కొని పంపుతాను, నువ్వు కాలిఫోర్నియాలో లక్స్మోజీ గారి ఇంట్లో ఇవ్వు, అని చెప్పాను. అది సరే, అని చెప్పి 13th పొద్దున వెళ్లిపోయినారు. నేను 13th షిర్డీ లో బాబా దర్శనం చేసుకొని, లెండి బాగ్ వెళ్ళాను. అక్కడ బాబాకు వాడిన బట్టల షాప్ ఉంది. అక్కడికి వెళ్ళాను, ఏదన్నా కొందామని, చూసి ఆశ్చర్య పోయినాను.నాకు ఆ షాప్ లో నేను బాబా కు వేసిన నారింజ color డ్రెస్ షాప్ కు అమ్మకానికి వచ్చింది. ఇంకా రేట్ కూడా రాయలేదు. అప్పుడే వచ్చింది, అని చెప్పారు.ఇంకేముంది, వెంటనే కొనేసాను. నా ఆనందానికి హద్దులు లేవు. బాబా డ్రెస్ నా చేతిలో వచ్చింది,.. అదృష్టం, అనుకున్నాను.
వెంటనే హైదరాబాద్ లో,మా అక్క కూతురు, వాళ్ళ ఇంటికి పోస్ట్ లో పంపినాను. just వాళ్ళు కాలిఫోర్నియా రిటర్న్ వెళ్ళేదానికి బయలుదేరినారు. అప్పుడే. ఆ బాబా డ్రెస్ మంజిల్ చేరింది. కానీ మా అమ్మాయి కాలిఫోర్నియా (sanjose) చేరేసరికి లక్స్మోజీ గారు కెనడా విశ్వాసాయి సమ్మేళనానికి వెళ్లిపోయింటారు అని, మళ్ళీ నాకు టెన్షన్, చేరుతుందో, లేదో, అని.
అక్కడ మళ్ళీ బాబా లీల చేశారు. మా అమ్మాయి వెళ్లే flight 20నిమిషాలు ముందు చేరింది.వెంటనే అది లక్స్మోజీ గారి ఇంటికి పరుగు పెట్టింది. ఆ షిర్డీ నుంచి వచ్చిన బాబా డ్రెస్ ఇవ్వడానికి.అక్కడ వాళ్ళు జస్ట్ రెడీ అయ్యారు. సామాన్లు కార్ లో పెట్టుకున్నారు. బాబా విగ్రహానికి మంగళ స్నానం చేయించి ఏమి డ్రెస్ వెయ్యాలి, అని ఆలోచిస్తున్నారు, ఇంతలో మా అమ్మాయి వెళ్లి, “గురువుగారు, షిర్డీ నుంచి బాబా డ్రెస్ తెచ్చాను,” అని నేను పంపిన డ్రెస్ ఇచ్చింది.ఆయన షిర్డీ నుంచి ఎలా తెచ్చావు? మాధవి పంపిందా? అని అడిగారు. అవును, అని చెప్పి మా అమ్మాయి ఇంటికి వెళ్లి పోయింది .ఆనందం పట్టలేక మా లక్స్మోజీ గారి కళ్ళలో నీళ్ళువచ్చాయి. “బాబా, విశ్వాసాయి సమ్మేళనం కోసం షిర్డీ నుంచి నీకు వేసి బట్టలు వస్తాయని, నేను ఎప్పుడు అనుకోలేదు, నీకృప అనంతం” అని ఆయన అనుకున్నారు. ఎలాగైనా నా సంకల్పం నిజం చేయడానికి , కాలాలకు అతీతంగా ఆ బాబా డ్రెస్ విశ్వాసాయి సమ్మేళనం చేరింది. అందరూ బాబా కృప కు ఆశ్చర్య పోయినారు. ఇప్పుడు చెప్పండి, షిర్డీ, ఎక్కడ?, హైద్రాబాద్ ఎక్కడ? కాలిఫోర్నియా ఎక్కడ? కెనడా ఎక్కడ? ఇంత ప్రయాణం చేసి బాబా డ్రెస్ మంజిల్ చేరింది. బాబా కృప అనంతం.
అందుకే మన సాయి నాథుడు కాలాతీతుడు అంటాను.”
జై సాయి రాం.
Satguru Sai Nath Maharaj ki Jai 🙏🙏🙏🙏🙏
LikeLiked by 1 person
Chala baagundi.sai ram..
LikeLiked by 1 person
Sai leela chaala baagundi
LikeLiked by 1 person