దేవ్ బాబా (అనంత్ ప్రభు వాల్వాల్కర్ ) గారి జీవితం లో బాబా చూపిన లీలలు:
విట్టల భక్తుడయిన రాజారామ్ కాకా , మరియు దభోల్కర్ పుత్రిక అయిన సీతాబాయి దంపతులకి దేవ్ బాబా జన్మించెను. దేవ్ తన తల్లి గర్భం లో వున్నప్పుడు ఆమె చాల ఇబ్బందులు పడెను.ఆమె చాల అనారోగ్య పరిస్థితుల్లో ఉండెను.ఆమె టెట్నస్ వ్యాధి తో బాధ పడగా తండ్రి అయిన ధబోల్కర్ చాలా చింతిస్తూ బాబా వద్దకి పరిగెత్తి పరిస్థితి వివరిస్తాడు..బాబా అతడిని ఓదారుస్తూ ,’ఏ కష్టం లేకుండా ప్రసవం అవుతుంది. మగ బిడ్డ పుడతాడు ‘ అని దీవిస్తాడు.
ప్రసవ సమయం వస్తుంది, దభోల్కర్ బాబా ని సహాయం కోసం ప్రార్థిస్తూ బయట వేచివుంటాడు. రాజారామ్ కూడా తనకి జ్ఞానేశ్వర్ లాంటి కొడుకు కావాలని విట్టల్ ని ప్రార్థిస్తాడు.ప్రసవం బాబా చెప్పినట్లుగా సుఖం గా అవుతుంది .మగ బిడ్డ పుడతాడు
ధబోల్కర్ లోనికి వెళ్లి చూడగా, తన కూతురు, పుట్టిన ఆ శిశువు ని దగ్గరికి తీసుకోకుండా ఒక మూలన పడుకోబెట్టడం చూసి బాధపడతాడు.ఆ శిశువు తల చుట్టూ కాంతివంతమైన వలయం అతడికి కనిపించగా ఆశ్చర్య పోతాడు..ఆ కాంతి తో వున్న ఆ శిశువు ని ఎత్తుకోడానికే భయపడి వాడి కి స్తన్యం ఇవ్వడానికి ఆమె నిరాకరించగా ధబోల్కర్ మనమడిని తీసుకొని షిరిడి వెళ్తాడు . బాబా కి మొత్తం వివరించి బాధపడగా, బాబా ఆ శిశువు ని తన వడి లో కి తీసుకుని ఊరడిస్తూ తన బొటన వేలిని శిశువు నోట్లో పెట్టగా ఆ శిశువు చప్పరించగానే పాలు బొటన వేలి నుండి ధార గా వస్తాయి.ఇలా బాబా పసివాడి ఆకలి తీరుస్తాడు
పెరిగి పెద్దవాడయ్యాక దేవ్ బాబా p.e t టీచర్ గా పని చేస్తుండెను. అతను తన విద్యార్థులందరినీ సమానం గా ప్రేమించేవాడు. కానీ విద్యార్థుల్లో రెండు వర్గాలు ఉండేవి. ఒక వర్గం వారు దేవ్ బాబా తమను పక్షపాతం తో చూస్తున్నాడని మరో అధ్యాపకుడికి ఫిర్యాదు చేస్తారు. ఆ అధ్యాపకుడు దేవ్ బాబా ని కొట్టి గాయపరచాలని పధకం వేసుకుంటాడు..వేరే టీచర్స్ ఈ విషయం దేవ్ కి చెప్పగా, అతను “తాను రేపు పాఠశాల కి రానే రాడు” అంటాడు..నిజంగానే , అతను ఆ సాయంత్రం ఈత కి వెళ్ళినపుడు నీటి లో మునిగి చనిపోతాడు ..అపుడు దేవ్ బాబా తనకి బాబా కొన్ని సిద్ధులనిచాడని తెలుసుకుంటాడు..
హే సాయి దేవా,, నీ పిల్లలమయిన మమ్మల్ని నీ చల్లని దృష్టి తో కాపాడుము. మేమెప్పుడూ నీ ఒడిలో పసి పాప లా వుండెదము గాక. జై సాయిబాబా.
- బాబా, ఈరోజు నా జన్మ దినము!
“నా తల్లి ,తండ్రి, గురువు, స్నేహితుడు అన్నీ నీవే. నాపై ఎప్పుడూ నీ కరుణ దృష్టి ని చూపు చుండుము.నన్ను నీకు దూరం చేసే నా మాయ శత్రువుల బారి నుండి నన్ను సదా కాపాడుతుండుము. నేను నిన్ను విడిచి ఉండలేను తండ్రీ, నీ చెయ్యి విడిచి నేను ఈ మాయా ప్రపంచపు తిరునాళ్ల లో చిక్కుకుని దారి తప్పకుండ కాపాడుము. నీ చెయ్యి నేను విడిచిననూ నువ్వు నన్ను గట్టిగా పట్టుకొనుము.నిన్ను చేరే నా ఆశయం తో , నీ సేవ చేసుకునే భాగ్యం ఎల్లప్పుడూ నాకు ప్రసాదించుము.నన్ను ఆ ఆశయ దిశ గా ప్రొత్సాఅహిస్తూ,నీ పవిత్ర సన్నిధి కి చేర్చగలిగే సాయి స్నేహాన్ని నేను శాశ్వతం గా పొందు గాక. దానికి నీ కరుణ వుండు గాక. నా మనసు తనువు నీ సేవ లో శ్రమించి పరమానందాన్ని పొందే స్థితి నాకు కల్గు గాక. ఈ స్థితిలో నే, నేను సంతుష్టురాలిని అగుగాక…నాలో అనుక్షణం , సాయి భావనలు పురివిప్పి ఆనందోత్సహాలతో నా మది నాట్యమాడుగాక..హే సాయి ,నాకు ఈ నాటి నా జన్మదినాన బహుమతి గా ఈ నా కోరికని నెరవేర్చమని నీ బిడ్డ గా నిన్ను వేడుచున్నాను.
- ఈనాటి జన్మదినాన నా పరమ స్నేహితుడు (అని నేను అనుకుంటున్నాను) అయినా శ్రీ యోగానంద గారిని ఏదయినా సందేశం ఇవ్వమని వేడుకున్నాను, facebook మాధ్యమం గా వారిచ్చ్చిన సందేశం క్రింద జత చేస్తున్నాను.
The divine power of its own accord wants to help you:you don’t have to coax.But you do have to use your will to demand as His child,and to behave as His child.
–Paramhansa Yogananda