బాబా కి పరీక్ష

13124565_1182925031725809_9162158387561173994_n

ఈ కథ లో మనం ఫిరోజ్షా అనే అతడిని బాబా తన దివ్యత్వాన్ని ప్రకటించుకోవడం ద్వారా అతడిని ఎలా తన వాడిగా చెర్చుకున్నారో తెలుసుకుందాము.

1917 వ సంవత్సరం లో ఫిరోజ్శ ఉన్నత విద్యాలయములో చదువుతుండేవాడు. ఒకసారి వారి తల్లితండ్రులు షిరిడి యాత్ర ముగించుకుని తిరిగివచేప్పుడు బాబా యొక్క అందమయిన చిత్రపటం తీసుకువస్తారు .ఇంటికి వచ్చాక బాబా మహిమల గూర్చి కుటుంబసభ్యులందరికీ వర్ణించి చెప్తారు .అంతా విన్న ఫిరోజ్శ మనసులో ఇలా అనుకున్నాడు “ఈ జనాలందరూ బాబాలు ,సాధువుల వెంబడి పరిగెత్తుతారు. ఈ సాయిబాబా వీరికి  భౌతికం గా   మరియు ఆథ్యాత్మికంగా సహాయం చేయగలడా? ఒకవేళ బాబా దివ్య పురుషుడైతే ,వారు నాకు దీని సంకేతం ఇవ్వాలి..అపుడే నేను నమ్మగలను” అని అనుకుని పడుకుంటాడు .

ఆ రాత్రి అతనికి బాబా స్వప్నం లో కనిపించి ఇలా అంటాడు “నీకు నా దివ్యత్వం గూర్చిన ప్రమాణం కావాలా? నీ తండ్రి నా చిత్రపటాన్ని టేబుల్ మీద పెట్టాడు కదా .నువ్వు ప్రొద్దున లేచాక నా ఆ చిత్రపటాన్ని ఎత్తే ప్రయత్నం చేయు.ఒకవేళ నా చిత్రపటాన్ని నువ్వు పైకి ఎత్తగలిగావంటే నేను అసత్యం  అనుకో, ఒకవేళ నా పటాన్ని ఎత్తవాంటె నేను సత్యమని నమ్ము.”…

స్వప్నం కారణం గా అతని కి మెలకువ వచ్చి ఉదయం కోసం ఎదురు చూసి ఉదయం అవగానే ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి ఆ పటాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తాడు ..కానీ ఆశ్చర్యం గా ఆ పటం చాలా బరువుగా ఉన్నందుకు దాన్ని కదిలించలేక పొతాడు.ప్రయత్నం చేసినా కొలది ఆ పటం ఇంకా బరువు అవడం గమనించి హతాశుడవుతాడు.తన ప్రయత్నానికి టేబుల్ పైకి లేచింది, కానీ ఆ పటం మాత్రం కాస్తయినా కధల లేదు. అప్పుడు అతడికి బాబా యొక్క దివ్యత్వం అనుభవం లో కి వస్తుంది.

కొద్దిరోజులకి అతను తన తండ్రి యొక్క మిల్లు లో , డబ్బులు తీసుకోకుండా పని చేయసాగాడు .బాబా తనకి కలలో కనిపించి “నువ్వు చాల కాలం గా పనిచేస్తున్నావు. నీకు జీతం ఇవ్వాల్సిందే ”  అని అంటారు. మరుసటిరోజు బాబా ప్రేరణ తో అతడి అంకుల్ తనతో తన పని లో జీతం వస్తోందా అని అడగ్గా ఫిరోజ్షా లేదు అని చెప్పగా అతని అంకుల్ నెలకి 200 ఇవ్వడం మొదలుపెట్టాడు .ఈ బాబా కృప కి అతను ముగ్ధుడవుతాడు. అతడికి షిరిడి వెళ్లి బాబా ని చూడాలనిపిస్తుంది .షిరిడి ఎలా ఉండవచ్చు అని అనుకోసాగాడు .బాబా ఈ ఆలోచన కూడా గ్రహించి తనవాడిని షిరిడి కి రప్పించుకుని మార్గం ఏర్పరిచాడు.

ఒకరోజు అతడు బస్సు లో యాత్ర చేసుకుంటూ శాంతాక్రుజ్ లో సాయిబాబా వీధి(వీధి పేరు) నుండి వెళ్ళసాగాడు బస్సు లో .తనకి వెంటనే అంతః ప్రేరణ ద్వారా తన ప్రశ్నలకి సమాధానం అక్కడ దొరుకుతుందనిపించి ఆ వీధి లో కి వెళ్లగా తనకి బాబా భక్తుడయిన శ్రీ మోరేశ్వర్ ప్రధాన్ పరిచయ భాగ్యం కలుగుతుంది. ఇక ప్రధాన్ అతడి అన్ని ప్రశ్నలకి సమాధానాలిచ్చి అతడి ని బాబా వద్ద కి చేర్చాడని వేరే చెప్పక్కర్లేదు ..బాబా వారు “పిచుక  కాలికి దారం కట్టి లాగినట్లు గ నా వారిని నేను సప్త సముద్రాల అవతల వున్నా , నా దగ్గరికి లాగుకొందును ” అనే సూక్తి కి యిది నిదర్శనం.

 మనలని కూడా బాబా అనుగ్రహించి తన చింతన ఒక క్షణమయినను వీడని భక్తి ప్రసాదించమని వేడుకుందాము ..జై సాయిబాబా 

2 thoughts on “బాబా కి పరీక్ష

  1. I am very much inspired by above Leela. Baba leelas’ are innumerable but every time feels New one. Further, many times it is like solution/assurance/advise for which we are thinking/searching for . Sai Nath Maharaj ki Jai 🙏

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close