“సాయి భక్తురాలికి బాబా కలలో చేసిన వైద్యం” , తనకు జరిగిన అద్భుతమయిన ఈ లీలని సాయిబంధువు సౌజన్య గారు వివరిస్తున్నారు, వారి మాటల్లోనే ..
నా పేరు సత్య సౌజన్య. నాకు బాబాతో జరిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
నేను ప్రెగ్నెంట్ గా ఉండగా, ఏడవ నెలలో నాకు చాలా తీవ్రంగా జ్వరం వచ్చింది. 105° temperature ఉండేది. నన్ను ఆస్పత్రి లో అడ్మిట్ చేశారు. అప్పుడు మా అమ్మ నాకు చేతిలో ఒక చిన్న వెండి బాబా విగ్రహం పెట్టింది.
నేను, మా అమ్మ, చెప్పాలంటే మా ఇంట్లో అందరూ బాబాను నమ్మేవాళ్ళమే. ఆస్పత్రి లో నాకు సెలైన్ మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే నాకు, కడుపులో బేబీ కి, ఏమి అవ్వకూడదని. అసలు ప్రెగ్నెంట్ అప్పుడు ఆలోపతి మందులు ఇవ్వాలంటే డాక్టర్స్ కూడా ఆలోచిస్తారు. ఇలా రెండు రోజులు జ్వరం తగ్గలేదు. బాబా, నువ్వే చూసుకోవాలి, అని అమ్మ బాబా నామస్మరణ చేస్తూనే వుంది. ఇంకా ఎంతకు జ్వరం తగ్గక పొయ్యేసరికి , అమ్మ ఒక తెలుగు హోమియోపతి మందుల బుక్ తీసి, బాబా మా అమ్మాయి కి ఏమి మందు వేయాలో నువ్వే చెప్పాలి, అని ఒక పేజీ తెరిచి చూసింది.
దానిలో టైఫాయిడ్ జ్వరం మందు(bapttisa 200.హోమియోపతి) వెయ్యమని వచ్చింది. ఆశ్చర్యం, అప్పుడే నా Blood టెస్ట్ లో టైఫాయిడ్ ఉందని వచ్చింది. మా నాన్నగారు హోమియోపతి డాక్టర్ అయ్యినందువలన ఆ మందు వేసుకున్నాను. ఇంకా ఆస్పత్రి లోనే వున్నాను . only సెలైన్ ఇస్తున్నారు. మూడు రోజులు అస్సలు నిద్ర లేదు జ్వరం వలన. అమ్మఇచ్చిన బాబా విగ్రహం నా చేతిలో అలానే ఉంది. మూడు రోజుల తరువాత కొంచెం నిద్ర పట్టింది. కల కూడా వచ్చింది. బాబా కలలో నా గుండె పైన రోలు పెట్టి ఏదో నూరుతున్నారు.ఒకసారి ఆకుపచ్చ, ఒకసారి పసుపుపచ్చ, ఒకసారి ఏదో మట్టి రంగు..ఇలా ఏమిటో నూరి నాకు తాగిస్తున్నారు.నేను “బాబా నాకు వద్దు” అంటున్నాను. బాబా, జ్వరం పోవాలిగా, నోరుముసుకొని నేని ఇచ్చే మందు వేసుకో, అని బలవంతంగా నాకు తాగించారు.
నిజంగా, నన్ను నమ్మండి, అద్భుతమైన కల. ఒక గంట తరువాత నేను నిద్ర లేచాను. చూస్తే నాకు జ్వరం మొత్తం పోయింది. నార్మల్ గా ఉంది temperature.
నాకు తరువాత ఏ కష్టము లేకుండా పాప పుట్టింది. నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఇప్పటివరకు ఏటువంటి అనారోగ్యం లేదు.
బాబా నన్ను యెంత అనుగ్రహించారో మాటల్లో చెప్పలేను. మనం రోజూ అష్టోత్తరం లో చదువుతాము కదా, “ఓం ఆరోగ్యక్షేమదాయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః” అని .అవి అక్షరసత్య నామాలు.ఆ విధంగా బాబా నన్ను కాపాడినారు. మనం సాయి చరిత్ర లో కూడా చదివాము కదా భీమాజి పాటిల్ ను బాబా కలలో రక్షించారు . అందుకే మన జీవితాలే సాయి చరిత్రలు. మనం పుట్టినరోజు నుంచి చనిపోయే రోజు వరకు వచ్చే అన్ని సమస్యలకు సమాధానం సాయి చరిత్ర, అని నేను గట్టిగా నమ్ముతాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్థు.
సేకరణ: శ్రీమతి మాధవి (భువనేశ్వర్)