సాయి దేవా శరణం
సాయీ, చాలా ఆనందం గా ఉంది. నీ కృప వల్ల కల్గిన ఈ ఆనందం నేను మరవలేనిది.
సాయిరాం , నేను ఈ వెబ్ సైట్ ప్రారంభించి ఒక సంవత్సరం అయింది, ఈ సందర్భం గా కాబోలు సాయి నాధుడు నాకు ఈ ఆనందకర లీల ప్రసాదించాడు.సాయి ప్రేమ వర్ణించలేము. నాకు కంప్యూటర్ knowledge అంతగా లేకున్నా, నాచే వెబ్ సైట్ ఓపెన్ చేయించి సాయి సేవ చేయిస్తున్నందుకు సాయి నాథుడికి కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. ప్రారంభం లో వెబ్సైటు కంప్లీట్ గా రెడీ అవలేదు, వేరే కొన్ని websites ని చూసినప్పుడు వాళ్ళు మెనూ బార్ లో పేజెస్ కి sub పేజెస్ పెట్టుకోవడం గమనించాను. అంటే కర్సర్ ని పేజీ name పై టచ్ చేయగానే కింద sub పేజీ బార్ ఓపెన్ అవుతుంది. నేను సాయి సత్చరిత్ర ఇంగ్లీష్ వెర్షన్ కోసం ఇలా చాఫ్టర్లు sub pages పెట్టుకోవాలని అనిపించి చాలా ట్రై చేశాను, కానీ నాకు ఆ విషయం లో పరిజ్ఞానం లేక పోవడం వల్ల చేయలేక పోయాను.wordpress వారి సపోర్ట్ టీం ని సంప్రదించినా , వారి suggestions లో ఆ టెక్నికల్ వర్డ్స్ అర్థం కాలేదు. అస్సలు చేయలేక పోయాను. కానీ మనసులో చాల ఆశ గా ఉండేది ఎపుడు నేను అలా సతచరిత్ర రెడీ చేస్తానో అని.
ఈ రోజు పేస్ బుక్ లో , బాబా యొక్క సమాధి శతాబ్ది ఉత్సవాల్లో భాగం గా చేసిన అందమయిన అలంకరణ చూయిస్తున్న వీడియో చూసి, “బాబా నీ సమాధి ఉత్సవాలు జరుగుతున్నాయి కానీ నేను నీకోసం అస్సలు ఏమి చేయట్లేదు (నిజానికి మనం బాబా కోసం ఏమి చేయలేము, బాబా సేవ చేసుకుని మనకు మనమే మంచి చేసుకుంటాము ), అసలు ఈ సందర్భం గా పారాయణ చదవడం కూడా ప్రారంభం చేసుకోలేక పోయాను ” అని బాధ పడ్డాను.తర్వాత అనుకోకుండా బాబా సత్చరిత్ర e -book post చేద్దామని అనుకుని స్టార్ట్ చేసిన విషయం మళ్ళీ గుర్తొచ్చి ,ఈరోజయినా ఆ ప్రయత్నం లో సక్సెస్ అయితే బాగుండుననిపించింది . వెంటనే బాబా తో, బాబా నీకు నా మీద ప్రేమ ఉంటే నాకు సహాయం చేయు ఈ విషయం లో, మిగి తావాళ్లూ చేసినట్లు మన వెబ్సైటు కి కుడా sub pages add నువ్వే చేయించు , నేను ఎవ్వరినీ ఈ విషయం లో సంప్రదించను అని వేడుకున్నాను . బాబా నా మాట విని నా కోరిక మన్నించారు.ఈరోజు నాచే ఈ విషయం ప్రయత్నం చేయించారు. ఆశ్చర్యం గా , నా మనసు లో కూర్చుని బాబా suggestions ఇస్తున్నట్లు గానే, అన్నీ నా మనసుకు తొందరగా, వాటంతట అవ్వే అర్థం అయ్యి స్టెప్ బై స్టెప్ చేస్తూ పోయి sub pages add చేసుకోగల్గాను. ఇదంతా బాబా నే చేశారు. కంప్యూటర్ knowledge , వెబ్ designing తెలిసిన వారికి ఇది చిన్న విషయం. కానీ సంవత్సరం నుండీ ప్రయత్నిస్తున్నా సాధించలేని మాకు, సాయి దేవుడి కృపతో కొంచం వ్యవధి లో నే సాధించేలా చేసిన ,బాబా ప్రేమ బహుమానం అమూల్యమయినది.
నేను ఒక్కటి గమనించిందేంటంటే , మనం ఎంతగా సాయి పై భారం వేస్తే అంత సాయి మన భారాన్ని మోస్తాడు. అంటే నీవు తప్ప నితంబెరుగ అని, బాబా తప్ప మనకి ఎవరూ మనవారు కారు, బాబా యే మన దిక్కు , మన భారం సాయిదే అని భక్తిపూర్వకం గా శరణు వేడినప్పుడు, బాబా వెంటనే మన దరి చేరి తన భక్త వత్సలత మాధుర్యం మనకి తెలియ చేస్తాడు. అందుకే అంటారు,” ఎవరు అనుగ్రహిస్తే , ఇంకెవరి ఆగ్రహాలు పనిచేయవో, ఎవరి ఆధీనం లో నే ప్రపంచం ఉండునో ,ఆ దేవ దేవుణ్ణే మరిచి అమాయక వెర్రి జనులు నశ్వర విషయాల కోసం పాకులాడుతుంటారు” అని.
బాబా కృప చే మా వెబ్ సైట్ యొక్క followers పెరగాలని , తద్వారా సాయి సేవ లో భాగం గా, సాయి ప్రేరణతో మేము పోస్ట్ చేసే సాయి లీలలు అందరినీ చేరాలని , ఈ కోరిక ని కుడా మన్నించాలని సాయి ని వేడుకుంటున్నాను.అన్యథా శరణం నాస్తి…
బాబా నాచే చేయించిన సాయి సత్చరిత్ర e -book లింక్ పంపుచున్నాను. యిది పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారు రచించారు,వారికి నా యొక్క వేల వేల ప్రణామములు. యిది ,మొదటి అధ్యాయం వరకు పోస్ట్ చేశాను. బాబా దయ తో రేపు మిగితా భాగం పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. జై సాయిరాం !