సాయిరాం..సాయి బంధువు మాధవి గారు తనకి జరిగిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు, వారి మాటల్లోనే…
“సాయిరాం. “సమాధి అనంతరం కూడా నేను అప్రమత్తుడనే, నా భక్తులు ఎప్పుడు నన్ను తలచి పిలిచినా నేను వారి ముందు ప్రత్యక్షం అవుతాను “ అని బాబా భక్తులకిచ్చిన వాగ్దానం ఎంత అక్షర సత్యమో ఈ లీల చదివితే మనకు తెలుస్తోంది.
నాకు భువనేశ్వర్ నుంచి శంబల్పూర్ అనే ఊరికి బదిలీ అయ్యింది. మా వారు silchir అనే ఊరిలో ఉండేవారు. ఆయనకు భువనేశ్వర్ బదిలీ అయ్యింది.అదే రోజు నాకు శంబల్పూర్ వెళ్లాల్సి వచ్చింది. నేను మా వారూ చాలా సంవత్సరాలుగా వేరు,వేరు ఉన్నాము.ఇంకా అలా వేరు ఉండడం నాకు ఇష్టం లేదు.కానీ ఉద్యోగం. మరి ఏమి చేయలేము.చాలా దుఃఖం తో నేను అక్కడికి వెళ్లి జాయిన్ అయ్యాను. ఇల్లు లేదు ఉండటానికి.అందుకని quarter ఇచ్చేవారకు సెలవు పెట్టి భువనేశ్వర్ వెళ్ళాను. 15 రోజుల తరువాత quarter ఇచ్చారు.అప్పుడు రామనవమి పండగ వచ్చింది. అందుకని మా వారిని వెళ్లి ఇల్లు ready చెయ్యమని చెప్పాను. నేను రామనవమి తరువాత వెల్దామని అనుకున్నాను.మాఆయన వెళ్లి ఇల్లు అంత బాగా clean చేయించారు.ముందు ఆ ఇంట్లో ఉన్నవాళ్లు ఇంట్లో చాలా చెత్త వేసి వెళ్లారు. మా వారు పనివాళ్ల తో మొత్తం clean చేయించి,అంత చెత్త బయట పడేసి కాల్చేయమన్నారు. పనివాళ్ళు మొత్తం చెత్త తీసుకెళ్లారు.నేను భువనేశ్వర్ లో రామనవమి రోజు చాలా బాధ పడుతూ బాబా ముందు, ” బాబా,నువ్వు లేకుండా నేను అంతదూరం ఎలా వేళ్లను? నాకు ఇంత పరీక్ష ఎందుకు పెట్టారు”అని చాలా వికల మనసుతో బాధ పడుతున్నాను. పాపం, బాబా నా బాధ చూడలేక పోయినారు.నాదేకాదు..ఎవరు దుఃఖపడిన ఆయన చూడలేరు.మా వారికి అదే టైం లో శంబల్పూర్ లో ఇల్లు clean చేస్తుండగా ఒక పెద్ద బాబావారి ఫోటో దొరికింది. అది మట్టిలో మాణిక్యం లాగా ఆ రాజదిరాజ్ యోగిరాజ్ ఎంతో దర్జాగా విరాజమాన్ అయ్యి, “నేనుండ భయమేల” అంటూ ఫోటో రూపం లో కనపడినారు,ఆ ఫోటో ని ఇక్కడ జత పరుస్తున్నాను
ఆశ్చర్యం లో కెల్ల ఆశ్చర్యం అది మా ఇద్దరికీ .ఎలా వచ్చింది ఆ ఫోటో అక్కడికి? ఎవరు ఇచ్చారు? ఏమో.ఇంతవరకు తెలీదు.అంతే. మా వారి కళ్ళలో నీళ్ళు..ఆ ఫోటో రూపం లో బాబా రామనవమి రోజు మా ఇంటికి వచ్చారు. మా వారు నాకు ఫోన్ చేసి చెప్పారు, “బాబా నీకంటే ముందే నీ ఇంటికి వచ్చారు”, నీ దుఃఖం దూరం చెయ్యడానికి” అని.
సాయి చరిత్ర లో బాబా ఫోటో రూపం లో రెండు సార్లు వెళ్లారు.ఒకసారి శ్యామకు, ఒకసారి హేమాదపంత్ కు ఫోటో రూపం లో దర్శనమిచ్చి ఆనందపర్చారు. ఇంకా ఎన్నోసార్లు ఇలా బాబా యెంతో మందికి అనుభూతి ఇచ్చి వుంటారు.
కానీ ఆ సమయం లో,రామనవమి రోజు ఆ రూపం లో నన్ను ఆశీర్వదిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. . సాయి చరిత్ర అక్షరసత్య గ్రంధము. “ప్రాణజాయ్ పర్ వచనం నా జాయే” అని తులసిరామయణం లో ఉన్నట్లు ఆయన శతదినోత్సవం లో రామనవమి రోజు నాకు రుజువు చేసి చూపించారు.
ఇప్పుడు నేను జాబ్ లో జాయిన్ అయ్యాను. ఎంతో సంతోషంగా ఉన్నాను.ఆయనే మళ్ళీ నన్ను మావారి దగ్గరికి చేరుస్తారు. అని నమ్మకం నాకు ఉంది.
-మాధవి
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు !