శ్రీ సాయి గాయత్రీ మంత్రం మహిమ వర్ణన తో మరో సారి మన ముందుకు వస్తున్నారు సాయి బంధువు శ్రీ మతి మాధవి గారు..వారికి జరిగిన అనుభవం వారి మాటల్లోనే …
“సాయి బంధువులకు అందరికి సాయిరాం..నేను సాయి గాయత్రీ మంత్రం ప్రచారానికి,దాని మహత్యం గురించి ప్రజలకి తెలియా చేయ్యాడానికి ఈక్కడ ఒక చిన్న పల్లెటూరికి వెళ్ళాను.అక్కడ అందరూ తెలుగు వాళ్లే.ఒక అయిదు, ఆరు పల్లెల వాళ్ళు కలిసి ఒక పెద్ద సాయి బాబా మందిరం కట్టించారు.ఆ మందిరం లో ఉన్న బాబాగారికి చాలా మహిమలు ఉన్నాయని ఇక్కడ ప్రసిద్ధి.అక్టోబర్ ఏడో తారీకున,సంజయ్ సత్పత్తి అని ఒక ప్రొఫెసర్ “గురు భాగవతం“గురించి చెప్పడానికి ఆ మందిరానికి వచ్చారు. అది వినడానికి మన తెలుగు వాళ్ళు అందరూ వచ్చారు.అందుకే మంచి gathering ఉంటుంది అని నన్నుకుడా రమ్మన్నారు. సాయి గాయత్రీ గురించి చెప్పడానికి నేను వెళ్ళాను.అక్కడ సంజయ్ సత్పత్తి గారిని కూడా కలిశాను. మేము 15 ఇయర్స్ కిందట భువనేశ్వర్ దూరదర్శన్ లో కలిసి ఒక ప్రోగ్రాం చేసేవాళ్ళము.కుశల సమాచారాలు అయినాక ఆయన నాకు బాబా సమక్షం లో ఒక తెలుగు బుక్ ప్రెసెంట్ చేశారు. నేను అనుకున్నాను,” ఈన ఒరియా ఆయన, తెలుగు బుక్ ఎలా ఇచ్చారు అని“.అదే మాట ఆయనతో అన్నాను.ఆయన అన్నారు, “ఇది తెలుగు భాష అని కూడా నాకు తెలీదు.ఎవరో నాకు గిఫ్ట్ గా ఇచ్చారు,ఎందుకో నీకు ఇవ్వాలని పించింది” అన్నారు. చూడండి, అక్కడ అందరూ తెలుగు వాళ్లే.అయిన ఆ బుక్ నాకే ఇచ్చారు.ఆ బుక్ ఆయన దగ్గర పది నెలల నుంచి ఉందంట.ఈ పదినెలలలో ఆయన ఎంతో మంది తెలుగు వాళ్ళను కలిసాడు అంట.. కానీ ఎవ్వరికి ఇవ్వాలని అనిపించలేదు.అసలు ఆ బుక్ గుర్తు కుడా రాలేదంట.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి..ఆయన నాకు ప్రెసెంట్ చేసింది , చింతపల్లి ” సాయి సన్నిధి” అనే బుక్..నాకు చింతపల్లి సాయి బాబా అంటే చాలా ఇష్టము.ఎందుకంటే, “షిర్డీ సాయి” సినిమా లో “అమరారామ సుమా రామ ఝరి ” అనే అభిషేకం పాట అక్కడే చిత్రీకరించారు.చాలా బాగుంటుంది.మీ అందరూ విని వుంటారు ఆ పాట అక్కడే చిత్రీకరించారు .నేను మా ఇంట్లో నవ గురువార వ్రతం చేసేటప్పుడు ఆ పాట పెట్టుకొని వింటూ బాబా కు అభిషేకం చేస్తాను.ఈలా 103 వారాలనుంచి చేస్తున్నాను. 108 వారాలు చెయ్యాలని నా సంకల్పం.ఆ మందిరం గురించి తెలుసుకోవాలని నాకు చాలా చాలా ఇష్టం ఉండేది.కానీ అంతదూరం వెళ్లలేక పోయేదాన్ని. ఇప్పుడు బాబా నే ఒరిస్సా లో ఉన్న చిన్న పల్లెటూరు లో నా దగ్గరికి వచ్చారు. ఇది బాబా చేసిన లీల కాక ఏమిటి,చెప్పండి? అసలు ఆ ఒరియా ఆయన రావడం,నేను ఆ మందిరానికి అదే సమయం లో వెళ్లడం, ఆయన చేతుల మీదుగా నాకు ఇష్టమైన బుక్ నాకు చేరడం. ఇదంతా బాబా లీల కాక ఏముంది?ఎక్కడో పలెటూరులో ఉన్న మందిరం లో ఏమి లీల జరుగుతుందో చూడాలి అనుకున్నాను.బాబా ఎంత లీల చేసారో చూడండి.తరువాత,నేను సాయి గాయత్రీ మహా మంత్రం గురించి చెప్పాను.వాళ్ళు అందరూ ఎంతో సంతోషపడ్డారు.ఇపుడు ఎవ్వరిని పలకరించినా బాబా చేసిన లీలల గురించే చెప్తున్నారు.
మీరు కూడా అందరూ ఈ సాయి గాయత్రీ జపయజ్ఞం లో భాగస్వాములు కండి.ఆ సాయి నాథుని కృపకటాక్షాలను పొందండి.”
సర్వం సాయి నాథాతర్పణమస్థు.