సాయి దీపావళి !

 శ్రీ సాయి నాధాయనమః 

1375718_558214310913798_1431700169_n

“సాయి బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు”.

ఈ దీపావళి కి, సరిగ్గా ఒక సంవత్సరం అయింది ఈ “సాయి సన్నిధి ” వెబ్సైటు ని బాబా నాతో ప్రారంభింప చేసి .. నాచే తన సేవ చేయించుకునే మార్గం చూయించి, సాయి సేవ చేస్తున్న అమూల్యమయిన ఆనందాన్ని ,సంతృప్తి ని నాకు ప్రసాదిస్తున్న సాయి దేవుడికి సాష్టాంగ ప్రణామములు సమర్పించుకుంటున్నా !!….ఈ దీపావళి సందర్భం గా, మన లోని మాయాతిమిరాలని తొలగిస్తూ, మన లో ఆధ్యాత్మిక చైతన్య వెలుగులు నింపవలసింది గా మనమందరమూ ఆ సాయినాధుని ప్రార్థిద్దాము..

20953645_10155664993434747_8280137140841177293_nదీపావళి అనగానే, మనకు సాయి నాధుడు నీటి తోనే దీపాలు వెలిగించి, భక్తుల మోము లో ఆనందపు ప్రకాశాన్ని నింపిన లీల గుర్తుకొస్తుంది..అలాగే దీపావళి రోజే , సుదూర ప్రాంతం లో వున్న తన భక్తురాలి బిడ్డ ని రక్షించిన సాయి ప్రేమ గుర్తుకొస్తుంది ..ఆ ప్రేమ స్వరూపుని ఆ లీలలు మరొక్కసారి స్మరించుకుందాము ..

చేయి కాలితే కాలింది ,బిడ్డ రక్షింప బడింది”

1910వ సంవత్సరము (ఘన త్రయోదశినాడు, యనగా) దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు, ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంత సేపయిన తరువాత హఠాత్తుగ కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగ యుండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండేయు దీనిని జూచి, వెంటనే బాబా వైపుకు పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగ వెనుకకు లాగేను. “దేవా ! ఇట్లేల చేసితిరని బాబా నడిగిరి. (మరేదో లోకములో యుండినట్లుండిన) బాబా బాహ్యస్మతి తెచ్చుకొని, “ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను యొడిలో నుంచుకొని, కొలిమి నూరుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలితే కాలినది. అది నా కంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నా కానందము గలుగచేయుచున్న “దని జవాబిచ్చెను.సాయి ప్రేమ అమోఘము !!

“నీటి తో దీపాలు వెలిగించిన సాయి దేవుడు”

సాయికి దీపాలు వెలిగించటమంటే చాలా యిష్టం. గ్రామంలో గల దుకాణదారుల నుంచి నూనెను యాచించి దానితో ప్రతిరోజూ మసీదులో రాత్రిపూట దీపాలను వెలిగిస్తూ వుంటాడు .రోజూ అలా నూనె యివ్వడం దండగని తలచి ఆ వర్తకులు అంతా కలిసి పన్నాగం పన్నారు. దుకాణదారులను కట్టడిచేసి నూనె యివ్వకుండా ,దీపాలు వెలగకుండా చేసి, సాయి అసమర్థుడని అందరికీ ప్రచారం చేయాలని కుయుక్తి పన్ని , ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదన్నారు. బాబా నిశ్చింతగా మశీదుచేరి, నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు త్రాగేసారు. తర్వాత ప్రమిదలలో నీరుపోసి, వత్తులు వేసి వెలిగించారు. దీపాలు చక్కగా వెలిగాయి. ఆ వర్తకుల హృదయాలలోని చీకట్లు తొలగి, ఆయనను క్షమాపణ వేడారు. “ఇష్టం లేకుంటే ఏమీ యివ్వనక్కరలేదు గాని లేదని అబద్ధం చెప్పవద్దు; యివ్వము అని చెప్పాలి” అని హితం చెప్పారు బాబా. ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా ప్రాకింది.ఈవిధం గా బాబా నీటి తో దీపాలు వెలిగించడం చూసిన భక్తుల మనసులు ఆనందం తో నాట్య మాడాయి, జై సాయిరాం!!

మెరుపు,  ఉరుమూ రానున్న కుంభవృష్టిని సూచించినట్లు, మానవాళికి ఆయన నుండి దివ్యలీలలు వరించనున్నాయని తెలిపే శంఖారావమైంది యీ లీల… జై సాయిరాం !! జై జై సాయిరాం!!

ఈ రోజు నా సాయి దేవుడు ….45690795_1939912149420327_6836097585875255296_n

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close