మధ్యాహ్న ఆరతి(తెలుగు అర్థముతో)

                          39939165_2120557251351842_8457988656886448128_o.jpg  

                               మధ్యాహ్న ఆరతి

(మధ్యాహ్నం 12 గం||లకు ధూప దీప నైవేద్యానంతరము 5 వత్తులతో ఆరతి యివ్వాలి)

                 1.అభంగము

ఘేవునియా పంచారతీ – కరూ బాబాన్సీ ఆరతీ

సాయిసీ ఆరతీ – కరూ బాబాన్సీ ఆరతీ

ఉఠా ఉఠా హో బాంధవ – ఓవాళూహా రఖుమాధవ

సాయీ రమాధవ – ఓవాళూ హా రఖుమాధవ

కరూనియా స్థిర మన – పాహు గంభీర హేధ్యాన

సాయిచే హే ధ్యాన – పాహు గంబీర హే ధ్యాన

కృష్ణనాథా దత్తసాయి – జడో చిత్త తుయేపాయీ

చిత్త దేవాపాయీ – జడోచిత్త తుయేపాయీ!!

అర్థము : 1. ఓ సాయిబాబా మీకు అయిదు వత్తులతో పంచారతి చేసెదము. 2. బంధువులారా సాయి మాధవునికి ఆరతి యిచ్చుటకు లేచి రండు. 3. స్థిర మనస్సుతో ఆచంచల భక్తితో సాయిని ధ్యానించెదము. 4. కృష్ణదత్త స్వరూపుడివైన సాయీ మందబుద్ది గల మా మనసులను నిరంతరము నీపై మరలునట్లు చేయుము.

                      2.ఆరతి

ఆరతి సాయిబాబా ! సౌఖ్యదాతార జీవా !

చరణరజాతలి ! ద్యావా దాసా విసావా భక్తా విసావా    ||ఆరతి||

జాళూనియా అనంగ ! స్వస్వరూపీ రాహే దంగ !

మముక్షుజనా దావీ ! నిజ దోళా శ్రీరంగ డోళా       || ఆ||

జయా మనీ జైసా భావ ! తయాతైసా అనుభవ !

దావిసీ దయాఘనా ! ఐసీ తుజీ హీ మావ    || తుజీ||    ||ఆ||

తుమచే నామ ధ్యాతా ! హరే సంసృతివ్యథా !

అగాధ తవ కరణీ ! మార్గ దావీసీ అనాథా      ||దావీసీ ||    ||ఆ||

కలియుగీ అవతార ! సగుణబ్రహ్మ సాచార !

అవతీర్ణ ఝాలాసే ! స్వామి దత్త దిగంబర దత్త!! ||ఆ||

ఆఠ దివసా గురువారీ ! భక్త కరితీ వారీ !

ప్రభుపద పహావయా ! భవభయ నివారీ    || భయ||      ||ఆ||

మాఝా నిజద్రవ్యఠెవ తవ చరణరజ సేవా

మాగనే హేచి ఆతా ! తుమ దేవాధీ దేవా దేవా!!        ||ఆ||

ఇచ్చిత దీన చాతక ! నిర్మలతోయ నిజసూఖ !

పాజావే మాధవా యా ! సంభాళ ఆపులీభాక       ||ఆపూ||   ||ఆ||

అర్ధము : 1. ఓ సాయిబాబా మీకు హారతి చేసెదము. నీవు సర్వ జీవులకు సౌఖ్యము నిచ్చువాడవు. 2. మీ దాసులము,మీ భక్తులము అయిన మాకు మీ పాదధూళిలో స్థానమివ్వండి 3. మీరు కాముని దగ్ధం చేశారు. ఎప్పుడూ పూర్తిగా ఆత్మస్థితిలోనే వుంటారు. 4. ముక్తికోరు జనులకు మీరు నిజ దృష్టిని ప్రసాదిస్తారు. 5.మీరు ఎవరి మనోభావాలను బట్టి వారికి అలాంటి అనుభవము యిస్తుంటారు. 6. ఓ దయాఘనా ! వారి వారి మనోభావాలను బట్టి నీవు నీ శక్తిని కూడ చూపిస్తుంటావు. 7. మీ నామ ధ్యానము ప్రాపంచిక బాధలను తొలగిస్తుంది. 8. మీ చేతలు అగాధములు. అనాధలకు సరైన మార్గం చూపువాడవు. 9. కలియుగంలో వెలసిన భగవత్స్వరూపుడవు. సంచరించే సగుణబ్రహ్మ స్వరూపుడవు. 10. దత్త దిగంబర స్వామిగా మీరు అవతరించారు. 11. ప్రతి 8 రోజులకొకసారి వచ్చు గురువారమునాడు భక్తులు మీ దగ్గరకు వస్తారు. 12. పాదములాశ్రయించు భక్తుల భవభయములు తొలగించెదరు. 13.మీ పాదధూళి సేవకు నా యొక్క సర్వధనము ” ఖర్చగునట్లుగా చేయుమని మిమ్ము ప్రార్ధిస్తున్నాను. 14, 15. ఓ దేవాధిదేవా! చాతకపక్షి నిర్మలమైన జలమునే త్రాగును. 16. మా రూపమనే జలమును మాత్రమే త్రాగునట్లుగా నన్ను అనుగ్రహించుము, ఓ మాధవ!

                     3 ఆరతి

జయదేవ జయదేవ దత్తా అవధూతా ! ఓ సాయీ అవధూత

జోడుని కరతవ చరణీ ఠేవితో మాథా ! జయదేవ ! జయదేవ!

అవతరసీ తూ యేతా ధర్మాతే గ్లానీ !

నాస్తికా నాహీ తూ లావిసీ నిజభజనీ

దావీసీ నానా లీలా అసంఖ్య రూపానీ

హరిసీ దీనాంచే తూ సంకట దినరజనీ      ||జయ||

యవన స్వరూపి ఏక్యా దర్శన త్వా దిధలే !

సంశయ నిరసునియా తదద్వైతా ఘాలవిలే !

గోపిచందా మందా త్వాచీ ఉద్దరిలే

మోమినవంశీ జన్ముని లోకాం తారియలే    ||జయ||

భేద న తత్త్వో హిందూ-యవనాంచా కాహీ !

దావాయాసీ ఝాలా పునరపి నరదేహీ

పాహసీ ప్రేమానే తూ హిందూ యవనాహీ

దావీసీ ఆత్మత్వానే వ్యాపక హా సాయీ     ||జయ||

దేవా సాయినాథా త్వత్పద నత హ్వావే !

పరమాయా మోహిత జనమోచన ఝునివావే !

త్వత్కృపయా సకలాంచే సంకట నిరసావే !

దేశీల తరిదే త్వద్యశ కృష్ణానే గావే       ||జయ||

అర్ధము : దత్త స్వరూపుడైన ఓ సాయీ అవధూత ! మీకు జయము! జయము. 2. నా చేతులు జోడించి, నా తలను మీ పాదములపై వుంచుతున్నాను. 3. ధర్మము నశించబోవు చున్నప్పుడు మీరు అవతరించెదరు.4. నాస్తికులను కూడ మీ భజనలోనికి మీరు ఆకర్షిస్తారు. 5. అంతులేని రూపాలలో మీరు మీ లీలలు చూపిస్తారు. 6. దీనుల బాధలను అహర్నిశలూ హరిస్తూ వుంటారు. 7. మీరు స్వయంగా యవన స్వరూపంగా (ముస్లిం) దర్శనమిచ్చారు. 8. అందువలన హిందూ-ముస్లిం అనే ద్వైతభావాన్ని తొలగించి, అందరూ ఒకటే అని బోధిస్తున్నారు. 9. అనేకులైన మందబుద్దులనుద్ధరిస్తున్నారు. 10. మోమిన్ వంశంలో జన్మించి లోకాన్ని తరింప చేస్తున్నారు. 11. హిందూ ముస్లిం అనే బేధంలేదని నిరూపించుటకు, 12. మీరు ఈ నరరూపంగా మళ్ళీ అవతరించారు. 13. హిందువులను ముస్లిములను కూడ మీరు ప్రేమతో చూస్తారు. 14. అందరిలో వున్న ఆత్మ తత్వమొకటే అని నిరూపిస్తారు. 15. ఓ సాయినాధ ! దేవా నీ పాదములకు నమస్కారము. 16. మాయచే మోహితులైన ప్రజలకు త్వరగా ముక్తిని కలిగించుము. 17.మీ కృప వుంటే సమస్త విధములైన ఆటంకాలు తొలగిపోతాయి. 18. మీ కీర్తిని గానంచేసే అదృష్టం ఈ కృష్ణునికి (రచయిత) కలిగించండి.

                   4.అభంగము

శిరడి మాఝే పండరపుర – సాయిబాబా రమావర

బాబా రమావర – సాయిబాబా రమావర.

శుద్ద భక్తి చంద్రభాగా – భావ పుండలీక జాగా.

పుండలీక జాగా – భావ పుండలీక జాగా.

యాహో యాహో అవఘే జన కరా బాబాన్సీ వందన

సాయీసీ వందన కరా – బాబాన్సీ వందన

గణూమానే బాబా సాయీ – ధావపావ మాఝే ఆయీ

పావమాఝ ఆయీ – ధావపావ మాఝే ఆయీ

అర్ధము :1. షిరిడి నాకు పండరీ పురము. సాయిబాబాయే రమావరుడైన విఠలుడు. 2. పరిశుద్ధమైన భక్తి భావము చంద్రభాగానది. భక్తి భావమే పుండలీకుని నివాసము ! 3.ఓ జనులారా! రండి, రండి బాబాకు వందనము చేయండి. 4. ఈ దాసుగుణు పిలుస్తున్నాడు. తల్లిలాంటి ఓసాయి. నన్ను కాపాడ పరుగు పరుగున రమ్ము.

               

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close