మధ్యాహ్న ఆరతి(తెలుగు అర్థముతో)

                              9. ప్రార్ధన

ఐసా యే యీబా | సాయి దిగంబరా |

అక్షయరూప అవతారా | సర్వహి వ్యాపక తూ!

శృతిసారా-అనసూయాత్రికుమారా ఐసా యేయీ బా ||

కాశీ స్నాన జప ప్రతి దివసీ-కోల్హాపుర భిక్షేసి

నిర్మల నది తుంగా | జల ప్రాసీ – నిద్రామాహుర దేశీ           ||ఐసా||

జోళీ లోంబతసే వామ కరీ – త్రిశూల ఢమరూధారీ ||

భక్తా వరద సదా సుఖకారీ – దేశీల ముక్తి చారీ !                   ||ఐసా||

పాయీ పాదుకా జపమాలా – కమండలూ మృగధాలా

ధారణ కరిశీ బా నాగజటా – ముగుట శోభతో మాధా               ||ఐll

తత్పర తుఝ్యా యా జేధ్యానీ – అక్షయ త్యాంచే సదనీ

లక్ష్మీ వాస కరీ దినరజనీ – రక్షిసి సంకట వారుని                   ||ఐసా||

యా పరి ధ్యాన తుఝే గురురాయా – దృశ్య కరీ నయనా యా

పూర్ణానందసుఖే హీ కాయా – లావిసి హరిగుణగాయా

ఐసా యేయీ బా | సాయిదిగంబరా….మహరాజేయీబా           ||ఐసా||

 

అర్ధము : దిగంబరా ! అంతములేని రూపముగల సాయి అవతార ! ఓసర్వవ్యాపకా, ఇటు రావయ్య 2. నీవు వేదములకు సారమువంటి వాడవు. అనసూయాదేవి అత్రి మహామునులకు కుమారునిగా అవతరించిన ఓ మహారాజా యిటురావయ్యా 3. ప్రతిరోజు కాశీక్షేత్రంలో స్నానం చేసి, కొల్హాపురంలో భిక్ష చేసుకొని, నిర్మలమైన తుంగభద్రా నదిలో నీటిని సేవించి దత్త క్షేత్రమైన మహోరం లో నిద్రించు సాయిదేవా త్వరగా ఇటురా. 4. ఎడమ చేతిలో భిక్ష చేయుటకు జోలె వేసుకొని, త్రిశూలము, ఢమరులను ధరించి, ఎప్పుడూ భక్తులకు వరములను, సుఖములను ఇస్తూ త్వరగా ముక్తి దారిని చూపించే సాయీశ్వరా ఇటురమ్ము. 5. పాదుకలు, చేతిలో జపమాల, కమండలము, మృగచర్మములను ధరించి, జటా జూటమున నాగేంద్రునిచే అలంకరించబడిన సాయి ఇటురా, 6. భక్తియుక్తముగా నిన్నెవరు ధ్యానిస్తారో వారియింట ఏ లోటు రానీయకుండ లక్ష్మిదేవి నివసించేటట్లు చేస్తూ పగలు రాత్రులందు కూడ వారిని రక్షిస్తూ వారి బాధలను దూరం చేయు సాయి యిటురమ్ము. 7. ఎల్లప్పుడూ నీ ధ్యానమును నాకు కలిగించుము గురువరా. నా కన్నులకు కనిపించి నాకు పరిపూర్ణమైన ఆనందమును, సుఖమును కలిగించి, ఈ నా శరీరము ఎప్పుడూ భగవంతుని గుణ గానములో తరించునట్లు చేయుటకు త్వరగారమ్ము సాయిదేవా.

               10. శ్రీ సాయినాధ మహిమ స్తోత్రము

సదా సత్స్యరూపం చిదానందకందం

జగత్సంభవస్థాన సంహార హే తుమ్

స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాధమ్                  ||నమామి||

భవధ్వాంతవిధ్వంస మారతాండ మీద్యం

మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యమ్

గద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం                    ||నమామి!!

భవాంబోధిమగ్నార్థితానాం జనానాం

స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం

సముద్ధారణార్ధ కలౌసంభవం తం                        ||నమామి||

                                                                         

సదా నింబవృక్షస్య మూలాధివాసాత్

సుథాస్రవిణం తిక్తమప్యప్రియం తమ్

తరుం కల్పవృక్షాధికం సాథయం తం                          ||నమామి||

                                                                          

సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే

భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవామ్

నృణా కుర్వతాం భుక్తిముక్తిప్రదం తం                         ||నమామి||

అనేకాశృతాతర్క్య లీలావిలాసైః

సమావిష్కృతేశాన భాస్వత్ర్పభావమ్

అహంభావహీనం ప్రసన్నాత్మభావమ్                         ||నమామి||

సతాం విశ్రమారామమేవాభిరామం

సదా సజ్జనైస్సంస్తుతం సన్న మధ్భిహి

జనామోదదం భక్త భద్ర ప్రదంతం                                  ||నమామి||

అజన్మాద్యమేకం పరం బ్రహ్మ సాక్షాత్స్వయం

సంభవం రామమేవావతీర్ణమ్

భవద్దర్శనాత్సంపునీతః ప్రభోహం                                   ||నమామి||

శ్రీ సాయీశ కృపానిధే ఖిలనృణాం సర్వార్థ సిద్దిప్రద

యుష్మత్పాదరజః ప్రభావమతులం ధాతాపి వక్తా క్షమః

సద్భక్త్యా శరణం కృతాంజలిపుట సంప్రాపితోస్మి ప్రభో

శ్రీమత్సాయిపరేశపాదకమలాన్నాన్యచ్ఛరణ్యం మమ

సాయిరూపధరరాఘవోత్తమం

భక్తకామవిబుధద్రుమం ప్రభుమ్

మాయయోపహతచిత్తశుద్ధయే

చింతయామ్యహమహర్నిశంముదా

శరత్సుధాంశుప్రతిమప్రకాశం

కృపాతపత్రం తవ సాయినాధ

త్వదీయపాదాబ్జసమాశ్రితానాం

స్వచ్ఛాయయా తాపమపాకరోతు

ఉపాసనాదైవతసాయినాధ

సవైర్మయోపాసనినా స్తుతస్త్వమ్

రమేన్మనో మే తవ పాదయుగ్మే

భృంగో యదాబీజే మకరంద లుబ్ధ :

అనేక జన్మార్జితపాపసంక్షయో

భవేద్భవత్పాదసరోజదర్శనాత్

క్షమస్వ సర్వానపరాధపుంజకాన్

ప్రసీద సాయీశ సద్గురో దయానిధే

శ్రీ సాయి నాథ చరణామృతపూర్ణ చిత్తా

స్తత్పాద సేవ నరతా స్సతతంచ భక్త్యా

సంసార జన్యదురితౌఘవినిర్గతాస్తే

కైవల్యధామ పరమం సమవాప్నువంతి

స్తోత్రమేతత్పఠేద్భక్త్యాయో నరసన్మనాస్సదా

సద్గురు సాయినాథస్య కృపాపాత్రం భవెధృవమ్

ఇతి శ్రీ సాయినాథ మహిమ్నస్తోత్రం సంపూర్ణం.

అర్ధము : 1.సదా మంచి రూపము గలవాడు. ఎల్లప్పుడు ఆనందము కలిగించువాడు ఈ ప్రపంచాన్ని పుట్టించి, పోషించి లయింపచేయువాడు, తన భక్తుల కోరిక ప్రకారం మానవరూపంలో దర్శనమిచ్చు ఈశ్వర స్వరూపుడైనసాయినాధునకు నమస్కరించుచున్నాను.

2.సంసారమనే చీకటిని తొలగించు సూర్యునివంటి వాడు, మనోవాక్కుల కతీతుడు, మునులు ధ్యానము చేసిపొందదగిన గమ్యస్థానం, నిర్మల నిర్గుణరూపుడు, ప్రపంచమంతా వ్యాపించియున్నవాడు అయిన శ్రీసాయీశునకు నమస్కరించుచున్నాను.

3. సంసార సాగరంలో మునుగుతున్న జనులలో,పాదముల నాశ్రయించినవారిని, నీయందు ప్రేమలు కలవారిని ఉద్ధరించుటకు ఈ కలియుగములో అవతరించిన ఈశ్వరరూపుడవైన సాయి, నీకు నమస్కరించుచున్నాను.

4.ఎల్లప్పుడు వేపచెట్టు మొదలు దగ్గర నివసించి ఆ వేప చెట్టును కల్పవృక్షము కన్న అధిక శక్తివంతముగా మార్చిన సద్గురు సాయికి నమస్కారము.

5.ఎప్పుడూ ఆ కల్పవృక్షము క్రింద కూర్చున్న నీకు వారివారి యిష్టానుసారము సపర్యలు, సేవలు చేయు నరులకు భుక్తిని, ముక్తిని కలిగించు సాయిదేవా నమస్కారము.

6. వేదములచే అనేక రకములుగ తర్కించబడినలీలావిలాస రూపుడు, తూర్పు దిశలో సూర్యకాంతిని ప్రజ్వలింపచేయువాడు, అహంకారములేక ప్రసన్నమైన ఆత్మ స్థితిలో నుండు సాయికి నమస్కారము.

7.సాధుజనులకు విశ్రాంతినిచ్చి ఆనందవరచుచూ ఎప్పుడూ సజ్జనులచే మనస్పూర్తిగా పొగడబడుచూ, జనులందరినీ ఆనందపరచి,భక్తులకు భద్రత కలిగించే సాయి పాదములకు నమస్కారము.

8.జన్మలేని పరతత్వుడు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు శ్రీరామునిలా తన యిష్ట ప్రకారము జన్మించినవాడు అయిన సాయినాధ ప్రభువు దర్శన మాత్రముచేతనే పునీతులయ్యెదము.

9.శ్రీ సాయీశ! కృపాసాగర! సర్వమానవులకు వారి వారి కోరికలు నెరవేర్చువాడా, నీ పాదధూళి మహిమను బ్రహ్మదేవుడు కూడ పొగడలేడు. సద్భక్తితో నేను చేతులు జోడించి నిన్ను శరణువేడాను. సాయి రూపంలో వున్న నీ పాదములను తప్ప యింక నేనెవరినీ ఆశ్రయించను.

10. సాయి రూపమును ధరించిన ఉత్తముడైన శ్రీరాముని,భక్తుల కోరికలను నెరవేర్చు ప్రభువును, మాయతో కప్పబడిన నా మనస్సు శుద్ధి పొందించుటకై సంతోషముతో రాత్రింబగళ్ళు ప్రార్ధించెదను.

11.కిరణములవలె వెలుగు శరత్ చంద్రుని దయాసాగరుడైన ఓ సాయినాధా ! నీ పాదముల నాశ్రయించిన వారి తాపములను హరించి స్వచ్చమైనఆత్మజ్ఞానమును ప్రసాదింతువు.

12. ఉపాసించదగు దైవ స్వరూపుడవైన ఓ సాయినాధా!ఉపాసకుడైన నాచేత నీవు పొగడబడుచున్నావు. మకరందమును త్రాగు తుమ్మెద వూవునందు రమించునట్లు నా మనస్సు కూడ నీ పాదములయందు రమించినది.

13. నీ పాదపద్మములు దర్శించిన మాత్రంచేత అనేక జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. సద్గురు, దయానిధే, నేను చేసిన అంతులేని అపరాధములనన్నింటినీ క్షమించి నన్ననుగ్రహించుము.

14. శ్రీ సాయినాధ చరణామృతమునందే పూర్తి మనసులగ్నముచేసి, ఆ పాద సేవ ఎప్పుడూ చేస్తూ వుండే భక్తులకు, ప్రాపంచికమైన సంసారిక బాధలు తొలగిపోయి కైవల్యము పొందగలరు. ఎవరైతే ఈ స్తోత్రమును భక్తి శ్రద్దలతో ప్రతి రోజు పఠించెదరో వారు సద్గురుడైన సాయి దేవుని కృప కిపాత్రులయ్యెదరు. ఇది నిశ్చయము. 

                         11.ప్రార్ధన 

కరచరణకృతంవాక్కాయజం కర్మజంవా

శ్రవణ నయనజంవా మానసంవాపరాధమ్ ||

విదితమవిదితంవా సర్వమేతత్ క్షమస్వ

జయజయ కరుణ అబ్దే శ్రీ ప్రభో సాయినాథ ||

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై !

అర్ధము : చేతులతోగాని, కాళ్ళతోగాని, శరీరముతోగాని, చేయు పనులద్వారా గాని, చెవులద్వారాగాని, కళ్ళద్వారాగాని, మనస్సుతోగాని, తెలిసిగాని లేక తెలియకగాని నేను చేసిన అన్ని అపరాధములను కరుణాసాగరుడవైన ఓ సాయినాథ ప్రభో ! క్షమించి నన్ను రక్షించుము.

ఓం రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సాయినాథ్ మహరాజ్ !

♥శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ  జై!♥

(మధ్యాహ్న హరతి కార్యక్రమము సమాప్తము)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close