దత్త జయంతి సందర్భం గా ,ఆ పరమ పావనుని లీల తెలుసుకుందాము.ఈ లీల ని విశాఖపట్నం నుండి లక్ష్మి గారు వివరిస్తున్నారు .. వారి మాటల్లోనే …
గురుదేవుల భక్తి – దత్తస్వామియొక్క శక్తి
“నా అనుభవాలని మీ అందరితో పంచుకోవాలని, తద్వారా పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి పాదపద్మాలకి నా అనుభవం అనే ఒక పుష్పాన్ని సమర్పించాలని ఇది రాస్తున్నాను. గురువుగారి పరిచయానికి పూర్వం ఒక ఆలయానికి మేము దత్తాత్రేయుడి చిన్న విగ్రహం తెప్పించాము. కారణాంతరాలవల్ల ఆ గుడిలో మేము దాన్ని ప్రతిష్టించలేక నా స్నేహితురాలి ఇంట్లో 2సం.లు ఉంచాము. దత్తస్వామికి చిన్న వెండి పాదుకలు, త్రిశూలం కూడా చేయించాము. ఈ లోపు ఆ విగ్రహాన్ని ఉంచుకున్న మా స్నేహితురాలు, స్వామిని అలా వదిలేయడం వల్ల వాళ్ళ పనులు కావడంలేదని బాధపడ్డారట, అది నాకు తెలియదు (తరువాత వేరే వారి వల్ల తెలిసింది.) కానీ వాళ్ళు బాధపడ్డ రోజే నాకు “దత్తస్వామి ని ఏదైనా బాబా గుళ్ళో ఇస్తే జాగ్రత్తగా ప్రతిష్టించుకుంటారు. మేమనుకున్న దేవాలయంలో వద్దు ” అని ప్రేరణ కలిగింది. సరే ఎవరికి ఇవ్వాలి? దత్తాత్రేయుడి గురించి మాకు పెద్దగా తెలీదు. ఒకరు ఇద్దర్ని అడిగితే తెలియదన్నారు. హఠాత్తుగా అపుడు నాకు గురువుగారు గుర్తుకువచ్చారు. వారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వారు ఆ దత్తస్వామి కి సరైన అర్హత కల్పిస్తారని అనిపించి ,వారికి ఈ విషయం ఉత్తరం రాసాను. వెంటనే వారు అనుమతించి స్వామిని 10 రోజులో వచ్చి తీసుకువెళ్తాము ,ready (packing) చేసి ఉంచమని letter రాసారు.
అప్పటి నుండి జరిగిన ప్రతిసంఘటన దత్తస్వామి చెప్పి చేయించుకున్నారు. గురువుగార్ని నాకు స్ఫురణకి తెచ్చారు. అప్పటి నుండి ఏం చేయాలి అని అనుకున్నా, టైంకి జరిగిపోయేవి. నా ఉద్దేశ్యం స్వామిని గురువుగారికి అప్పజెప్పాక ఇంక మనకీ ఆయనకీ ఏమీ సంబంధం ఉండదని. ఈలోపు గురువుగారు రాసిన లేటర్లో నన్ను సాయిచరిత్ర 3 సార్లు పారాయణ చేయమన్నారు. సాయిచరిత్రతో పాటు గురుచరిత్ర కూడా పారాయణ మొదలు పెట్టాను.
దత్తస్వామి మా స్నేహితురాలి ఇంట్లో ఉన్నాడని చెప్పాను కదా ,అక్కడ వాళ్ళు బాధపడకుండా Convince చేసి, తీసుకువెళ్ళిపోతామని చెప్పి గురువుగారి తాలూకా మనుషులు వస్తారు కాబట్టి విగ్రహాన్ని pack చేయించి ఉంచాలని చెప్పాను . “మీ డ్రైవర్ అప్పారావుకి కబురు పెడదాము అతను బాగా పేక్ చేస్తాడు” అని అతనికి కబురు చేసే లోపే అతనే రావడం వెళ్ళిస్వామి విగ్రహం తేవడం జరిగింది. కానీ స్వామి వెండి ఆభరణాలు కనబడ లేదు. దత్త స్వామి వెళ్ళిపోయి పాదుకలు త్రిశూలం ఉండిపోతాయేమోనని, అవి ఎలా చేరుస్తాము, అని అనుకునేలోపు నా స్నేహితురాలు ,కనబడ్డాయి తీసుకువెళ్ళమని ఫోన్ చేసింది. సరిగ్గా అప్పుడే నా మూడు పారాయణలు పూర్తయినాయి. బుధవారానికి నేను బాబాగారి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు పూర్తి చేసి మా స్నేహితురాలు దగ్గర నుండి వెండి పాదుకలు, త్రిశూలం తీసుకుని ఇంటికి చేరేలోగా విగ్రహాం కొరకు గురువుగారు పంపిన శ్రీమన్నారాయణ, పాత్రో గార్లు మా వరండాలో కూర్చుని ఉన్నారు. వారికి స్వామి విగ్రహం నేను సమర్పిస్తే,వారి ద్వారా నాకు గురువుగారు పసుపు, కుంకుమ, ఎర్రచందనం కొబ్బరికాయ పంపండం జరిగింది .నా పారాయణం పూర్తి అయిన రోజే నేను గురుప్రసాదం అందుకోవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. గురువుగారు దత్తస్వామిని కాకినాడ ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఉంచమన్నారని నాతో చెప్పి ,వారు నామంతో స్వామిని తీసుకువెళ్ళి ప్రభాకర్ రావు గారింట్లో పెట్టారట. ప్రభాకర్ రావుగారు ఆశ్రమంలో స్వామి ప్రతిష్ట ఉన్నది ,అని సాయిచరిత్ర పారాయణ చేయడం ప్రారంభించి, స్వామి వెండి పాదుకలను ప్లేటులో బియ్యం పోసి పెట్టి పారాయణం చేశారు .పారాయణ చేసే రోజుల్లో, రెండు చిన్న చిన్న పాదాల గుర్తులు బియ్యంలో పడ్డాయని చెప్పారు. అది చాల మంది వారింట్లోని వారు, సాయిభక్తులు చూసారట.
స్వామిని పిభ్రవరి నెలలో పంపితే ,మార్చి 31న గురువుగారు కాకినాడ శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమంలో ప్రతిష్ఠ చేసారు. ఆ ప్రతిష్టకి వెళ్ళే అదృష్టం బాబాగారి అనుగ్రహం వల్ల మాకూ కలిగింది. ప్రతిష్ట జరిపి నేత్రోన్మీలనం చేసి దత్తస్వామి కళ్ళకు కట్టిన గుడ్డ తీసివేయగానే స్వామి కళ్ళ నుండి నీరురావడం జరిగింది. ఈ సంఘటన స్వయంగా మేమంతా చూసి ఎంతో పరవశించినాము. 2సం.ల తరువాత గురువుగారి ద్వారా ప్రతిష్ట చేయించుకున్నందుకు ఆ స్వామికి కలిగిన ఆనందమో! లేక మేము అన్ని రోజులు ఆయన్ని పట్టించుకోకుండా ఉంచేసినందుకు కలిగిన బాధో మాకు తెలీలేదు. ఎది ఎమైనా ఆనాడు జరిగిన అద్బుతం మా జీవితంలో మరువలేనిది. ఆ అనుభవంతో గురుదేవుల భక్తి ,స్వామి యొక్క శక్తి రెండు తెలిసినవి.
Smt. K. LAXMI
VISAKHAPATNAM,
గుంటూరు జిల్లా ,చిలకలూరి పేట కి దగ్గరలోని పురుషోత్తమ పట్నం లోని దత్తసాయి స్థూపం ఈ సందర్భం గా మీ కోసం.. దర్శించండి తరించండి..
ఓం శ్రీ సాయి దత్తా ! జయ జయ దత్తా !
Chala baagundi.sairam
LikeLiked by 1 person