శ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు సాయి నాథ్ మహారాజ కీ జై !!
నాకు ఈ మధ్య జరిగిన సాయి లీల మీతో పంచుకుంటున్నాను. సాధారణం గా మనం ఏదయినా ఆధ్యాత్మికపరమయిన నిర్ణయం తీసుకుంటున్నపుడు సమాజం నుండి గానీ, మన కుటుంబ సభ్యుల నుండి గానీ, అడ్డంకులు తిరస్కారం అపుడపుడూ ఎదురవుతుంటాయి. దానికి ఒక్కో సరి మనం చేసుకున్న దుష్కర్మ లు కూడా కారణం అవుతాయి . మన దుష్కర్మ ఫలం మనల్ని సత్కర్మ చేసే అవకాశం అందనివ్వక అడ్డంకుల్ని సృష్టిస్తుందని అంటారు . అలాగే, నేను కొన్ని సంవత్సరాలు గా చేయాలనీ అనుకున్న సత్కర్మ కి కొన్ని అడ్డంకులు వచ్చేవి ..బాబా మందిర నిర్మాణ స్థలం కొందామనుకున్నా ఎక్కడా కుదర లేదు. మా కుటుంబ సభ్యుల తిరస్కారం తో , ఆ వచ్చిన అవకాశం కోల్పోవడం.. ఇలా జరిగేది. చివరకి నాకున్న ప్లాట్ లో బాబా గారి కొరకు చిన్న మందిరం కట్టించుకోవాలనే ఆశ సాయి నాలో కల్గించాడు . అయితే , అప్పుడూ మా కుటుంబ సభ్యుల నుండి అడ్డంకి వచ్చింది. వాళ్లు ఎన్ని సార్లు ఆ ప్రస్తావన తెచ్చినా సహకరించడానికి ఒప్పుకోలేదు. చివరకి వారు వద్దన్నా, ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకోవడం మొదలయిన ఏర్పాట్లు నేను ప్రారంభించడం జరిగింది. ఆ విషయం వారం క్రిందట, రాత్రి వారికీ తెలిసి, చాలా గొడవ చేయడం జరిగింది. ఆ పరిస్థితి తీవ్రత నేను అస్సలు expect చేయలేదు, అంతలా వారు నాపై విరుచుకు పడి నాకు అత్యంత అవమానం జరగ బోయే ఒక నిర్ణయం కూడా మరుసటి ఉదయం అమలుపరచాలని కూడా నిశ్చయించుకోవడం జరిగింది ..అకస్మాత్తు గా జరుగుతున్న ఈ పరిణామం చూసి నాకు ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటె నేను బాబా అనుమతి తీసుకున్నాకూడా ఇలా జరుగుతుందేమిటి ?అంటే బాబా చిట్స్ ద్వారా చెప్పిన సందేశం అబద్ధమేనా ?” అని చాలా కృంగిపోయాను.ఆ రాత్రంతా బాధ తో ఆ ఆలోచనల్లో నే గడిపాను.బాబా ను , “బాబా ఎందుకీ అవమానం, ఎందుకు ఇన్ని అడ్డంకులు” అని అడుగుతూనే వున్నాను , మల్లి బాబా ప్రేరణ వల్ల, సిస్టం ఆన్ చేసి face book లో పోస్ట్ చూస్తుంటే, ఒక సాయి బంధువు పోస్ట్ లో బాబా సందేశం, “ఇప్పుడు నీ అనుమానాలు తొలగిపోయినవా?” అని వుంది .
అపుడు వెంటనే నాకు బాబా సత్ చరిత్ర లోని ఒక కథ గుర్తుకు వచ్చింది ..అందులో ,పితళే భార్య తన కొడుకు ని బాబా వద్దకు తీసుకుని వస్తే,బాబా ముందరే, ఆ పిల్ల వాడికి అంత వరకూ రాని పెద్ద మూర్ఛ వచ్చి స్పృహ తప్పి పడిపోతే , ఆ తల్లి, “బాబా వద్దకి వస్తే ఇలా జరిగిందేమిటి? అని ఆవేదన చెందుతుంది .. బాబా దయ తో , “పిల్ల వాడిని బస కు తీసుకుని పొమ్ము . అర్థ గంట లో చయితన్యం వస్తుంది అని చెప్పగా, అలాగే జరుగుతుంది. అపుడు బాబా ఆమె తో , “ఇప్పుడు నీ అనుమానాలు తొలగిపోయినవా ? ఎవరికయితే నమ్మకం ఓపిక కలదో వారినే భగవంతుడు కాపాడుతాడు ” అని చెపుతారు. సరిగ్గా అలాగే , ఆ రాత్రి జరిగిన ఉత్పాతం తెల్లవారి నేను లేచేసరికి మాయమయింది . ఒక్క రాత్రి లోనే బాబా ,వారి మనసులు మార్చేశాడు. వారు ఏం అనుకున్నారో తెలియదు కానీ ఆ మరుసటి ఉదయం వారు చాల positive గా నాకు సహకరించడం మొదలు పెట్టారు .అలా బాబా దయతో, ఈరోజే ఆ చిన్న మందిరానికి శంకుస్థాపన జరిపించడం జరిగింది .
ప్లాట్ శుద్ధి అవడానికి నిన్న అనగా బుధవారం ఏడు గంటల పాటు సాయి నామం ప్లాట్ లో బాబా చేయించారు. గంట కి ఇద్దరి చొప్పున ఏడు గంటలు ఏడు బాచ్ లు చేయడం అవసరం. ఒకరు నామం చెప్తే, మరొకరు నామం అంటారు .మిగితావారు వీరితో కల్సి చెప్తారు. అలా కనీసం 14 మంది కావాలి .అయితే , మా పట్టణానికి పక్కనున్న ఆ village కి రావడానికి ఇంట్రస్ట్ లేక, వీలు కాక, తగిన మంది రాలేరు . అయినా కూడా , ” అక్క, ఏడు గంటలు బాబా నామం చెప్పమంటే, ఒక్కడిని అయినా సరే చెప్తాను. బాబా కన్నా ఎక్కువనా ? ” అని ప్రారంభం నుండి చివరి వరకు కార్యక్రమానికి సహకరించిన మురళి అనే సాయి బంధువు భక్తి చూసి ఆనందపడ్డాను .అలాగే ఇంకా నలుగురు సాయి భక్తులం కల్సి వంతులవారీగా 7 గంటలు కూర్చుని సాయి నామం బాబా కృప తో నిర్విఘ్నం గా జరుపుకున్నాము..సర్వ భారాన్ని తానే వహిస్తూ ఉండటం వల్ల ,ప్రతీ ది అలా అలవోక గా దానంతట అదే జరిగిపోతోంది. ఇలాగే మందిర నిర్మాణం అయ్యే వరకు నా వెంట వుంది నన్ను నడిపిస్తూ , నన్ను శుద్ధి పరచుకునే అవకాశం అలా కలిపిస్తూ , నాచే సత్కార్యాలు సమృద్ధి గా చేయించమని ప్రార్థిస్తున్నాను మన భక్త వత్సలుడయిన సాయినాధుణ్ణి.
ఈ సందర్భం గా బాబా చూపిన ఈ లీల ను నేను మరిచిపోలేను .. సుమారు సంవత్సరం నుండీ ,మా కుటుంబం లో సాగుతోన్న ఇలాంటి పరిణామాల్లో , ధాయిర్యం చెపుతూ , నా సంకల్పం నుండి పక్కకి పోనివ్వకుండా తగిన ప్రేరణ కూడా అందించే ఏర్పాటు సాయి నాధుడు చేసి పెట్టాడు, సాయి గుళ్లో ని అర్చకుడు, సాయి మందిర నిర్మాత అయిన ఒక గొప్ప సాయి భక్తుడి పరిచయం ద్వారా ..తల్లి తన పిల్లలని వృద్ధి లోనికి తీసుకురావడానికి, సలహా ఇవ్వడమే కాకుండా , తగిన పరిస్థితులని ఎలా కలిపిస్తుందో, అధేవిధం గా సాయి తన భక్తులని ఉద్దరించడానికి అహర్నిశలూ శ్రమిస్తాడు . తన భక్తుడు ఏ చిన్న పొరపాటు కూడా చేయనివ్వకుండా చూసుకుంటాడు. మనము మన శరీరం , మనసు ఆయనదే అని మన జీవితాన్ని అయన పాదాల చెంత సమర్పించినపుడే , అయన ఆ బాధ్యత తీసుకుంటారు . కాబట్టి ఈ క్షణం నుండి సాయి ని మనల్ని వెన్నంటి ఉండమని , వారి భావన విడవని భక్తి ని , వారి సేవ చేసుకునే శక్తి ని ఇవ్వమని ప్రార్ధిద్దాము ..
జై సాయి రామ్!