దత్తసాయి కృప!
సాయిబంధువు శ్రీమతి సుమతి గారు, దత్తావతారమయిన సాయి చూయించిన లీల యిలా వివరిస్తున్నారు.
“నా మనువడు రాహుల్ కు 1 1/2 సంవత్సరముల వయసు అప్పుడు 15 రోజుల పాటు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వచ్చేది, మళ్ళీ తెల్లవారి 4 గంటలకు తగ్గుతు ఉండేది.దినమంతా బాగా తిరిగేవాడు, ఆడుకొనేవాడు, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి జ్వరం. జ్వరం వలన వాడు పాలు తాగేవాడు కాదు, భోజనం చేసేవాడు కూడా కాదు. అందువలన చాలా Week .ఎంతోమంది doctors చూపించాను. ఒక్క మందు కూడా పని చేసేదికాదు.ఏ doctor కు అంతు చిక్కలేదు, జబ్బు ఏమిటో అని! ఇలా మేము చాలా బాధతో వుండే వాళ్ళం వాడి గురించి.
ఒక రోజు నా స్నేహితురాలు మా ఇంటికి వచ్చింది రాహుల్ ను చూడటానికి . బాబానే ఆవిడ ద్వారా సందేశం పంపారు అనిపిస్తుంది నాకు. ఆవిడ అనింది,“మనం సాయిబాబాను దత్తావతారంగా కొలుస్తాం కదా! రాహుల్ కు ఏ మందు పనిచేయడం లేదు, నరసింహాసరస్వతి కార్యక్షేత్రం శ్రీ గాణగాపురం లో భూతప్రేతాల ద్వారా పీడింపబడే వాళ్ళను శ్రీ సాయినాథుడు దత్తాత్రేయ రూపంలో ఆ క్షేత్రంలో బాగు చేస్తారు” అని చెప్పింది. “ఒకవేళ రాహుల్ అలా పీడింపబడుతూవుంటే ,” ఓ దత్త సాయి ” నా బాబు రాహుల్ ను నువ్వే రక్షించాలి”, అని నా మనసులో తలచి రాహుల్ కు విభూతి నుదుట పెట్టి , కొంచెం విభూతి నీళ్లలో కలిపి తాగించాను. “రాహుల్ కు వచ్చే జ్వరం శరీరానికి సంబంధించింది అయితే రోజంతా వుండాలి, లేదా వేరే ఏదన్నా అయితే రోజు సాయంత్రం వచ్చి పొద్దున్న బాగవ్వాలి” అనుకున్నాను మనసులో..
ఆ రోజు రాత్రి 11 గంటలకు లేచాడు. కాఫీ ఇవ్వమ్మా అని అడిగాడు(నిజంగా ఇంకా మాటలు కూడా సరిగా రావు వాడికి). నేను నిద్ర లేచి టెంపరేచర్ చూశాను. మామూలుగానే వుంది. నేను వాడిని దేవుడి గదిలో కూర్చోపెట్టి కాఫీ తీసుకురావడానికి వెళ్ళాను. అంతే! ఆశ్చర్యం!… అంత చిన్న పిల్లడు దేవుడి గదిలో భూతం వచ్చిన వాళ్ళ లాగా వూగిపోతున్నాడు. పాపం ఒక గంట తరువాత పడిపోయాడు క్రింద. అసలే చిన్నవాడు దానికి తోడు జ్వరంతో వున్నాడు. ఇంక నా ప్రాణం బాబా సమాధి వైపు(మనసు లో) పరుగు పెట్టింది. “బాబా ఏంటి ఈ నీ పరీక్ష? రాహుల్ బాగు అవుతాడు అనుకున్నాము. ఇలా దీన స్థితిలో పెట్టావు వాడిని. బాబా బ్రతికించు లేదంటే తీసుకొని పో. కానీ ఇంత చిన్న పసిబిడ్డను ఇంత పెద్ద హింస పెట్టకు” అని వేదనగా ప్రార్ధించాను .అంతే ,ఆ సాయినాథుని కరుణ జల్లులా ఆశీర్వద రూపంలో వచ్చేసింది.
రాహుల్ లేచాడు. అమ్మ కాఫీ ఇవ్వు అని అడిగాడు, కాఫీ వాడే తన సొంతగా తాగాడు. వాడు అలా భూతం ఆవహించి నట్లు వుగుతూవుంటే మేము ఐదుమందిమి వాడిని పట్టుకోలేక పోయాము.అలాంటి వాడు ఇప్పుడు కాఫీ అడుగుతున్నాడు. అలా కాఫీ తాగి తెల్లవారేసరికి మంచి నిద్రలోకి వెళ్ళాడు. మళ్ళి పొద్దున్న 9 గంటలకు లేచాడు. ఆ రోజు నుంచి ఇంక వాడికి జ్వరం రాలేదు. ఇప్పటి వరకు బాగున్నాడు. school కూడా వెళ్తున్నాడు. అందుకే మనం రోజు చదివే సాయిబాబా అష్టోత్తర నామాలలో “ఓం ఆద్బుతానంత చర్యాయ నమః”, అని చదువుతాం అయన చేసే చర్యలు అద్భుతాలు ..ఇలానే వుంటాయి.
అందుకే సర్వం సాయినాథార్పణమస్తు, అని మీరు అనండి.
సుమతి
పునా, మహారాష్ట్ర
సేకరణ : శ్రీమతి మాధవి , భువనేశ్వర్