ఒక విద్యార్ధి ని తన వైపు లాక్కుని తన భక్తుడిగా మార్చుకోవడమే కాక, అతని జీవిత పర్యంతం అతని ఆశలన్నీ నెరవేర్చిన సాయి మాత లీల యిపుడు తెలుసుకుందాము .
విద్యార్ధి ఉన్నత విద్య కోరిక నెరవేర్చిన సాయి గణేశుడు !!
నేను 1984 సంవత్సరం లో లోధీ Road దయాల్ సింగ్ కాలేజీలో B.Sc చదివేవాడిని.నా కాలేజీ చదువు అయిపోవడం తో నేను పరీక్ష ఫలితాల కోసం కాలేజికి పోయినాను. ఇంకా ఫలితాలు రాలేదు అన్నారు. నిరాశతో నేను నా స్నేహితుని ఇంటికి పోయినాను. దారిలో మూడు మందిరాలు వస్తాయి. నేను మూడు మందిరాలకు వెళ్ళి నమస్కారం పెట్టుకున్నాను. మూడో మందిరం మొదటి మెట్టు ఎక్కాను, ఇంతలో అనుకున్నా, “వద్దు, నాకు పరీక్షలో 75% వస్తే ఈ మందిరానికి నేను స్వయంగా వస్తాను” అని వెనక్కి వచ్చేశాను. మరుసటి రోజు ఫలితాలు వచ్చాయి. నా స్నేహితులు నాతో, “Congrats నీకు 75% వచ్చాయి” అన్నారు. 65 కష్టపడినా కానీ ఇన్ని మార్కులు వస్తాయని ఊహించలేదు. నేను ముందు నమ్మలేదు. నేనే వెళ్ళి చూసుకున్నాను. సంతోషం పట్టలేకపోయాను. అప్పుడు వెంటనే ఆమందిరం గుర్తు వచ్చింది.వెంటనే ఆ మందిరానికి పరుగు పెట్టాను. అక్కడ హారతి జరుగుతా వుంది. గురువారం అవ్వడం వలన చాలా జనం వున్నారు. అక్కడ తెల్లని పాలరాతి విగ్రహం చూశాక నాకు పట్టలేని ఆనందం వేసింది. అది”శిరిడీ సాయిబాబా”అని ముందు నాకు తెలియదు. అలా నన్ను బాబా నాకు తెలియకుండానే తనవైపుకు ఆకర్షించేలా చేసారు. అందరూ హారతి పాడుతున్నారు, “నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధ” ఆ line మాత్రం నాకు మాటి మాటికీ గుర్తు వస్తావుంది. వచ్చేటప్పుడు అనుకున్న నేను ప్రతిరోజు ఈ మందిరానికి వస్తాను అని, ఈ విధంగా నాకు బాబా మీద భక్తి, విశ్వాసాలు పెరుగుతూ వచ్చాయి.
B Sc లో మంచి మార్కులు వచ్చాక, M Sc చేయాలనీ ఉండేది , బాబా కృప వలన నాకు హిందూ కాలేజీలో Seat వచ్చింది. ఆ రోజుల్లోనే నాకు బాబా మీద భక్తి విశ్వాసాలు పెరుగుతూ వచ్చాయి. ప్రతి గురువారం మందిరం వెళ్ళడం నియమంగా చేసుకున్నాను.నేను ఎప్పుడు అనుకునే వాడిని, చదువు అయిపోయినాక ఉద్యోగం వస్తే 1 or 2 Km దూరంలో బాబా మందిరం ఉంటే బాగుండు అని.
ఇంకా M Sc Result కూడా రాలేదు, బాబా నాకు DAB స్కూల్, పీతంపూర్ Branch లో PGT ఉద్యోగం ఇప్పించారు. నాకు ఇంతకు ముందే తెలిసింది రోహిణి sector-7 లో బాబా యొక్క మందిర నిర్మాణం జరుగుతూ వుంది అని. ఆ మందిరాన్నిమొదట sector3 కట్టాలని అనుకున్నారు, మళ్ళీ అక్కడ స్థలం దొరకనందువలన sector 7 లో కట్టారు.ప్రజలు ఇండ్లు కట్టాలనుకునే ప్లేస్ మార్చుకుంటారు కానీ, భగవంతుడు భక్తుని కోసం తన మందిరం ప్లేస్ మార్చుకోవడం ఇదే చరిత్రలో మొదటి సారి ఏమో అనిపిస్తుంది. ఇది బాబా యొక్క అద్భుతమైన లీలనే. ఆ రోజునుంచి నాకు బాబా సేవ చేసుకొనే అదృష్టం దొరికింది.
ముందు నుంచి నాకు భజన పాటలు పాడాలని వుండేది. కాని పాడలేక పోయేవాడిని. మెల్ల మెల్లగా బాబా దయ వలన పాడటం మొదలుపెట్టాను.మెల్ల మెల్లగా బాబానే 1 1/2 hour continuous గా పాడే శక్తి సామర్ధ్యాలను ఇచ్చాడు. నాకు ఇంకా చదవాలని వుండేది. ఉద్యోగంతో పాటు బాబా నాకు Bed చేసే అదృష్టాన్ని కూడా ఇచ్చారు.
One year తరువాత బాబా ప్రేరణ వలన Med కూడా చేయాలనుకున్నాను. అది కూడా పూర్తి చేశాను. తర్వాత PHD చేయాలని కూడా అనుకున్నాను . ఇంతలోDelhi University Professor నరేంద్రనాద్ ను కలిసే అవకాశాన్ని బాబానే కల్పించారు. అక్కడే నేను అతడికి నా Phd గురించి చెప్పాను. అతను నా దగ్గరే Phd చేయి అన్నారు. వెంటనే ఇంతలో ,బాబా నన్ను ఇంకో professor మదన్ మోహన్ బజాజ్ ని కలిసే అవకాశం ఇచ్చారు. “నీవు Phd మదన్ మోహన్ బజాజ్ దగ్గరే చేయాలి” అని బాబా నన్ను ఆదేశించారు. ఆ ఇద్దరు professor లు ఒకే college లో పనిచేస్తారు. స్నేహితులు కూడా.
నేను ఏ exam రాయకుండానే Mr. మదన్ మోహన్ బజాజ్ దగ్గర నా Phd start చేశాను. నా department లో ముందుకలిసిన professor నరేంద్రనాద్ ను నేను కలిశాను. నేను అతనికి ఏమి చెప్పకుండా Dr. Bajaj దగ్గర నా Phd మొదలు పెట్టాను.ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళతో meatings అవుతాయి. ప్రశంసా పత్రాలు తీసుకోవడం చాలా అవసరం, ముందు చెప్పిన professor(నరేంద్రనాద్ ) ఇవ్వరనుకున్నా. ఎందుకంటే ఆయనకు చెప్పకుండా Dr. Bajaj దగ్గర Phd start చేశాను. కాని బాబా కృప ఏమిటంటే ఆయనే వచ్చి నాకు ప్రశంసా పత్రాలు తప్పకుండ ఇస్తాను అన్నాడు.భగవాన్ ఏమి చేసిన మన మంచికే చేస్తాడు అన్నాడు. బాబా లీల చూడండి ఎవరికైతే నేను అబద్దం చెప్పానో అతనే నాకు ప్రశంసాపత్రం ఇచ్చాడు, తరువాత నాకు phd admission అయింది.నా గురించి Mr. నరేంద్రనాద్ చాలా బాగా రాశాడు కూడా , కాని దైవనిర్ణయం చూడండి, నాకు ఆ ప్రశంసా పత్రం ఇచ్చిన మూడో రోజే Mr. నరేంద్ర చనిపోయాడు.అందుకే బాబా నన్ను అయన దగ్గర చేయనీయలేదు. బాబాకు భూత, భవిషత్తు, వర్తమానాలు తెలుసు. తన భక్తులను రక్షించడానికి అనేక రకాల లీలలు చేస్తాడు.అలా నా phd కూడా అయిపోయింది.
నేను “సాయి శక్తి” అనే పుస్తకం కూడా రాశాను.దానిలో ద్వారకామాయి బాబా చిత్రపటానికి దోమ తెర కడతారు, దీపం వెలిగిస్తారు. చాలా సార్లు ఆ దీపం దానిఅంతటా అదే వూగుతుంది.చూస్తే గాలి ఏమి వుండదు. ఈ విషయం గురించి సంస్థానం వాళ్ళు video కూడా తీశారు.నేను కూడా ఒకసారి ఆ video సంపాదించాను.
ఈ విధంగా సాయిబాబా నా జీవిత పర్యతం నాతోనే వున్నారు. తరువాత బాబా గురించి చాలా books కూడా చదివాను. చాలా పుస్తకాలు కూడా రాశాను. చూడండి అయన మందిరం మొదటి మెట్టు ఎక్కలేని వాడిని బాబా ఎలా తయారు చేశారు.అంత ఆయనకు తెలుసు.”
సర్వం సాయినాథార్పణమస్తు..
రవీంద్రనాథ్ కాకరియా, న్యూఢిల్లీ,
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు :
మాధవి, భువనేశ్వర్