నూతన సంవత్సరం సందర్భం గా, పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి ఆధ్వర్యం లో , 120 అడుగుల సాయి కోటి మహా స్థూపం ఆవిష్కరణ ఈరోజు కర్నూల్ జిల్లా లోని నంద్యాల లోజరుగుతోంది.. ఆ మహా స్థూపం మీకోసం.. దర్శించండి, తరించండి..
శ్రీ సాయినాధాయనమః!.. సాయి బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో, మనమంతా సాయి మార్గం లో, సాయి సేవ లో తరించే సంకల్పాన్ని ఈ రోజు నుండీ మదిలో నిలుపుకుందాము. దానికయి కావాల్సిన శక్తి సామర్థ్యాలను , భక్తి ని, పవిత్రత ని ఇవ్వమని వేడుకుందాము సాయినాధుని ..
పార్శీ అబ్బాయి ఆపరేషన్ ని సాయిబాబా తన శరీరంలోకి తీసుకున్న విధానం.
యూనియన్ bank ఇండస్ట్రియల్ relation cell,దీనిలో లింబూవాల అనే పేరుగల పార్శీ వ్యక్తి ముఖ్య అధికారిగా వుండినారు.అతను పార్శీ అతను అయినా మన హిందూ తత్వజ్ఞానం గురించి చాలా బాగా తెలుసు అతనికి.మన భగవద్గీత,శంకరభాష్యం కూడా చదివేవాడు. సాయిబాబా మీద చాలా భక్తి,శ్రద్ధలు వుండేవి. నా ప్రాణస్నేహితుడు పద్మాకర్ మహల్ కు,లింబూవాల కి మంచి స్నేహం వుండేది. ఒకసారి లింబూవాల చాలా దుఃఖంగా,చింతగా ఎదో చాలా కష్టాన్ని మోస్తున్నవానిగా కనపడ్డాడు. పద్మాకర్ ” ఏమి అలా వున్నావు,ఏమైంది కారణం ఏమి,”అని అడిగాడు.
దానికి లింబూవాల సమాధానం ఇలా చెప్పాడు. “నాకు ఒక్కడే కొడుకు.వాడికి ఈరోజు appendix ఆపరేషన్ జరిగేటప్పుడు అది పగిలిపోయింది. డాక్టర్స్ అంటున్నారు 99% బతకడు. ఆశ పెట్టుకోకండి. 1% బ్రతకచ్చు,ఆ భగవంతుని ఆశీర్వాదం వుంటే అన్నారు”.అది చెప్తూ లింబూవాల సాహెబ్ భయకరంగా ఏడుస్తున్నాడు. పద్మాకర్ అతనికి స్వాంతన చెప్తూ ఇలా అన్నాడు,“మన చేతిలో ఏమీలేదు,మనం బాబానే నమ్ముకొని వున్నాం కాబట్టి ఆయనే మనకు రక్షగా వుంటాడు.నువ్వు సాయిబాబానే వేడుకో బాగు చేస్తాడు,ఆయన శరణాగతవత్సలుడు, దీనజనబాంధవుడు” అని ఏవో చెప్తూ వున్నాడు.
ఇద్దరూ అక్కడే ఉన్న బాబా ఫోటో దగ్గర కూర్చున్నారు చింతాక్రాంతులై. బాబా తన భక్తుల కష్టాలను చూస్తూ వూరుకుంటాడా! “సమాధి సమాధానపరుస్తుంది” అని అన్నదానికి అనుగుణంగా బాబా వచ్చేశారు.
ఎలా అంటే ఆపరేషన్ theatre నుండి డాక్టర్ పరుగులు పెట్టుకుంటూ సంతోషంగా , “ఆపరేషన్ సక్సస్ అయింది.ఈరోజు ఆశ్చర్యం లోకెల్ల ఆశ్చర్యం!! నాచేతికి చాలా కీర్తిప్రతిష్టలు వచ్చాయి. నిజానికి ఒక పెద్ద చమత్కారం జరిగింది “అనుకుంటు లింబూవాలతో అన్నాడు, “మీ అబ్బాయి బ్రతికాడు” అని. ఈ విషయాలన్ని పద్మాకర్ కూడా విన్నాడు.డాక్టర్ వెళ్ళిపొయినాడు. పద్మాకర్ ఒక బాబాలీల చెప్పాడు లింబూవాలకు.అది ఏమిటంటే,“నాకు రాత్రి ఒక కల వచ్చింది,కలలో బాబా అన్నారు,”అతని చేతికి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి” అని తన కఫనీ ని పైకి ఎత్తాడు.బాబా కడుపు మీద ఆపరేషన్ అయిన గుర్తులు స్పష్టంగా కనపడ్డాయి.బాబా ఆపరేషన్ తన మీద వేసుకొని,తన భక్తుడిని రక్షించారు. కాని ఆసమయంలో నాకు అర్థంకాలేదు(అని పద్మాకర్ లింబూవాలకి చెప్పాడు). ఇంక లింబూవాల కళ్ళలో సంతోషంతో కూడిన నీళ్ళు కారుతూనే వున్నాయి.
“దీనజనవత్సల సాయిరాం! పాహి పాహి ప్రభో” అని మాత్రం అనగలిగాడు.
సూర్యకాంత యాదవ్.
ఈ బాబావారి లీల తెలుగులోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్,