జై సాయి రామ్ !
పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి ద్వారా నిర్హహించబడే సాయి కోటి మహా యజ్ఞాల్లో ,పరమ పావన సాయి నామములు నిక్షిప్తం చేస్తూ నిర్మించబడే సాయి కోటి మహా స్థూపము ల వద్ద, భక్తులు చవి చూస్తున్న సాయి లీలలు ఈ శీర్షిక న తెలుసుకుందాము.
బాగుపడిన చెవి
నా పేరు ఇమ్మానేని వీరరాఘవమ్మ. నేను విజయవాడ వాస్తవ్యులు ,సూర్యప్రకాశ్ గారి భార్యను. నా భర్త ద్వారా గురుదేవుల చరణ సన్నిధికి చేరుకున్న నేను నిజంగా ఎంతో అదృష్టవంతురాలిని. ఒకసారి నాకు కుడిచెవి నెప్పిగా ఉండి చీము వస్తూ ఉండటం చేత విజయవాడలో ఇఎన్. టి. డాక్టరుకు చూపించుకొనటం జరిగినది. డాక్టరుగారు పరీక్ష చేసి “చెవికి ఆపరేషన్ చేయవలసి వుంటుంది, ఆపరేషన్ కు షుమారుగా 10వేలు వరకు ఖర్చు అవుతాయి” అని చెప్పినారు.
మాది మధ్యతరగతి కుటుంబం. ఇంట్లో ఖర్చులు ఎక్కువ. 10 వేలు అనగానే చెమటలు పట్టేసాయి.(ఆ రోజుల్లో 10 వేలు విలువ ఎక్కువ ).. అంతడబ్బు ఎక్కడ నుండి తీసుకురాగలం అని బెంగ .చెవి గురించి ఏమి చేయాలో తెలీని అయోమయ పరిస్థితి. డాక్టరు మాత్రం ,ఎంత త్వరగా చేయిస్తే అంతమంచిది, ఆలస్యం చేయకూడదు అని అన్నారు. మేము ఏమీ అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఇంటికి చేరుకున్నాము.
ఇంతలో ,మా వారిని ఏలూరు ఆశ్రమమునకు రమ్మని గురుదేవులనుండి కబురు వచ్చినది. అక్కడకు వెళ్లిన మావారు గురుదేవులకు నా చెవి విషయాన్ని వివరించటం జరిగినది. అది విన్న గురువుగారు “ఆపరేషన్ అక్కర్లేదు, విజయవాడలో వ్యాగన్ వర్క్ షాప్ కాలనీ లోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో యజ్ఞం జరిగింది కదా! ఆ యజ్ఞంలో నిర్మించబడిన సాయికోటి స్తూపం చుట్టూ 40 రోజులు – రోజుకు 11 సార్లు ప్రదక్షిణ చేయమనండి” అని చెప్పారు. అదే విధంగా నేను 40 రోజులు ప్రదక్షిణ చేయగానే చెవిలో నుండి చీము రావటం ఆగిపోయినది. తరువాత డాక్టరుకు చూపించుకొనగా వారు చెవిని టెస్ట్ చేసి, చక్కగా ఉన్నదని, ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదని చెప్పటం జరిగినది.
జై సాయి రామ్ !