సాయిరాం !!
ఈరోజు ఇందాకే జరిగిన లీల మీతో షేర్ చేసుకుంటున్నాను .
ఈ రోజటి సాయి లీల ను రెడీ చేసుకుందామని కంప్యూటర్ ఆన్ చేసి ప్రయత్నిస్తున్నాను. కానీ నా laptop లో internet కేబుల్ వైరు అమర్చే port లో ప్రాబ్లెమ్ వల్ల కొన్ని రోజులుగా సిస్టం లో ఇంటర్నెట్ కనెక్షన్ అందడం లేదు. network వాళ్ళు వచ్చి port problem ..servicing center లో repair చేయించుకోండి అని చెప్పినా వెళ్లడం కుదరలేదు.ఈ మధ్య పోస్ట్స్ రెగ్యులర్ గ పెట్టలేకపోతున్నాను .ఈరోజు నుండి అయినా ఆ పని చేయాలి అని చాలాసేపటినుండి ట్రై చేస్తున్నాను ఆ వైర్ ని port లో కదిలిస్తూ (లూస్ కనెక్షన్ . కదిలిస్తుంటేనే కనెక్ట్ అవుతోంది )..కానీ ఫలితం లేకపోయింది. మళ్ళీ ఈ రోజు కూడా ఇక వెబ్ సైట్ లో పోస్టింగ్ కుదరదా అనుకుంటూ laptop టేబుల్ పైనే నేను పెట్టుకున్న సాయి ఫోటో ముందు, నేను వెలిగించిన అగరవత్తి బూడిద కనిపించింది. ఏం చేయాలో తెలియక దాన్నే సాయి విభూతి గా భావించి , ఆ కేబుల్ వైరు కు పెట్టి, కేబుల్ వైరు port లో తిరిగి పెడుతూ ,మనసులో ఇలా వస్తువులు పనిచేయకపోతే , వస్తువుల కి కూడా విభూతి పెడుతున్నానేంటి పిచ్చి గా అనుకుంటూ , అయినా చూద్దాం , సాయి దయ అని , మళ్ళీ సాయి ని తలచుకుని పోర్ట్ లో వైరు ని పెట్టాను . చాలా ఆశ్చర్యం గా వైరు పెట్టగానే ఇంటర్నెట్ కనెక్ట్ అయింది .చాలా ఆనందమేసింది. పది నిమిషాలనుండి దాన్ని పోర్ట్ లో పెట్టి కనెక్షన్ కోసం కదిలిస్తూ వున్నా, ఇలాగె కేబుల్ వైరు తీసేసి మళ్ళీ పెట్టి చూసినా కనెక్ట్ కానిది బాబా విభూతి పెట్టగానే కనెక్ట్ అయ్యింది . . ఇక ఈరోజు ,ఈ లీల నే పోస్ట్ చేద్దామనుకుని మీతో షేర్ చేసుకున్నాను .
బాబా విభూతి సర్వరోగ నివారిణి మాత్రమే కాదు electronic goods లో technical problems ని కుడా సరిచేసే సర్వ సమస్య నివారిణి అని అర్థమవుతోంది ..చూసారా , బాబా ని నమ్ముకుంటే ,బాబా అనుగ్రహం మనలని అనుక్షణం కాపాడుతుంది. ఆయన ని అన్ని విషయాల్లో మన ఏకయిక తోడు నీడ అనుకున్నప్పుడే బాబా మన సర్వ భారాలను మోస్తాడు .సాయి విభూతి మనకి కామధేనువు లాంటిది. ప్రపంచం లో ప్రజలు అంతా బంగారం ఆస్తి సంపదల కోసం పాకులాడుతుంటారు .కానీ నిజ సాయి భక్తులకి ఆ అష్ట ఐశ్వర్యాలు నిజంగా బూడిద తో సమానం .బాబా విభూతే చాలు ఆ సకల ఐశ్వర్యాలను మన ముందు కి తేగలదు.కానీ మనకు సాయి అనుగ్రహసంపదె పెన్నిధి లాంటిది. మనమందరము నిజ సాయి భక్తులుగా సాయి మహిమ ని గుర్తించి సాయి తప్ప నితంబెరుగము అన్నట్లుగా సాయి నే మది నిండా నింపుకుని, సాయి వూది ని రక్షా కవచం గా, నిజ ఆభరణం గా భావిస్తూ సాగుదాం .
జై సాయిరాం !!