బాబా తో జి. జి.నార్కే అనుభవాలు

 

జి. జి.నార్కే 

23783479_10214770569767756_7743795405494844696_o.jpg

శ్రీ సాయిబాబాను దర్శించిన భక్తులలో ఎంతగానో చదువుకున్నవారు గూడ ఎందరో వుండేవారు. వారిలో జి. జి.నార్కే ఒకడు. అతడు కలకత్తాలో ఎం. ఏ పాసయ్యాక అతనిని నాటి ఆంగ్ల ప్రభుత్వం 1909లో ఉన్నత విద్య కోసం ఇంగ్లాండుకు పంపింది. అతడు మాంచెస్టర్ లో భూగర్భశాస్త్రంలో ఎమ్.ఎస్. సి. పట్టభద్రుడై ఆగస్టు, 1912లో మనదేశానికి తిరిగివచ్చాడు. అతని మామగారు నాగపూర్ కు చెందిన శ్రీమాన్ బూటీ. ఇతను విద్యావంతుడని సాటి భక్తులందరూ గౌరవించేవారు. ఆధునిక విద్యతోపాటు యితడు మహాత్ముల ప్రభావాన్ని వర్ణించే * జ్ఞానేశ్వరి” వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు గూడ చదువుతుండేవాడు. అతడికంటే ముందునుండే అతని భార్య, తల్లి మామగారు బాబాను దర్శిస్తున్నారు. సాయిబాబా మహాత్ములని, వారి దర్శనం చేసుకోమనీ బూటీ మొన వారు నార్కేకు వ్రాసారు. అతడు, తన దర్శనానికి రమ్మని బాబా చెబితేనే వస్తానన్నాడు. అప్పుడా విషయం బూటీ ప్రస్తావిస్తే అతడు దర్శనానికి రావచ్చని బాబా చెప్పారు. కనుక ఏప్రిల్ 1913లో అతడు తన తల్లితో కలసి శిరిడీ వెళ్ళాడు.IMG_20190219_170433

అతడు తన స్మృతులిలా వ్రాసాడు; “నేను ఏప్రిల్ 1913లో మొదట శిరిడీ వచ్చాను. బాబాకు మావాళ్ళ పై ఎంతో (పేమ. మా తల్లిగారు రాగానే ఒక్కొక్కసారి ఆయన సంతోషంగా ఎగిరి గంతేసి నృత్యం చేసేవారు. మాధవరావ్ దేశ్ పాండే మశీదుకు వచ్చి నన్ను పరిచయం చేయబోతే బాబా, ”నాకు వీణ్ణి పరిచయం చేస్తున్నావా? నాకితడు 30 తరాల నుండీ తెలుసు” అన్నారు. మొట్టమొదట నా హృదయంలో ముద్ర వేసుకున్నది వారి కన్నులే. వారి చూపు నన్ను అణువణువునా దూసుకుపోయింది. చావడిలో కూర్చున్న వారి రూపం నా హృదయం లో ముద్ర వేసుకున్నది. అంతరంగికమైన అనుభవాలు నాకు క్రమంగా కలిగాయి . నేను అచటి వాతావరణానికి అలవాటుపడి వారికి సేవలు చేయడము, ఆరతులకు హాజరవడమూ ప్రారంభించాను.”

“స.1914లో ఒకరోజు బాబా కొన్ని కఫ్నీలు సిద్ధం చేయించి కొందరు భక్తులకు పంచుతున్నారు. నేనది దూరంనుంచి చూచి, ఆయన నాకుగూడ ఒక కఫ్నీ ప్రసాదిస్తే బాగుండనుకొన్నాను. దానిని నా దగ్గర వుంచుకొని బాబా భజన వంటి ప్రత్యేక సందర్భాలలో ధరించవచ్చని నాభావం. కొద్ది సేపయ్యాక నన్ను తమ చెంతకు పిలిచి (పేమగా నా తల నిమురుతూ, ” నీకు కఫ్నీ యివ్వనందుకు నన్ను తప్పుపట్టవద్దు. నీకివ్వడానికి ఆ ఫకీరు (భగవంతుడు) అనుమతించలేదు” అన్నారు. నేను ఉద్యోగాలకోసం కలకత్తా, బొంబాయివంటి దూరప్రాంతాలకు వెళ్ళవలసి వస్తోందని, నన్ననుగ్రహించి మా వూరికిగాని, లేక శిరిడీకిగాని దగ్గరలో ఉద్యోగంలో స్థిరపరచమనీ ఒకరోజు మా అమ్మ బాబాను అడిగింది. ‘అతనిని పూణేలో స్థిరపరుస్తాను’ అన్నారు బాబా. ఒక్కొక్కప్పుడు నాకు ఒకేసారి అనేక ఉద్యోగాలొచ్చి, వాటిలో ఒకదానిని ఎన్నుకోవలసి వచ్చేది. ప్రతిసారీ బాబా నిర్ణయం తీసుకొనేవాణ్ణి. కానీ ఆయన ప్రతిసారీ చివరలో పూణేనగరాన్ని ప్రస్తావించేవారు. ఉదా : 1916లో ఒక వంక వారణాసిలో ప్రొఫెసర్ (అధ్యాపకుడు) ఉద్యోగము, బర్మాలో ఒక ఉద్యోగమూ వచ్చాయి. బాబాను అడిగితే ఆయన ప్రతిసారీ పూణే నగరాన్ని ప్రస్తావిస్తుంటే నేను నవ్వుకునేవాణ్ణి. కారణం పూణేలో నాకు తగిన ఉద్యోగావకాశాలే లేవు. కాని 1918నుండి పూణేలో భూగర్భ రసాయనిక శాస్త్రాలలో అధ్యాపకుడుగా పనిచేస్తున్నాను. అంటే నా భవిష్యత్తంతా వారికి ప్రత్యక్షమన్న మాట!”

నేను 1916 ప్రాంతంలో చాలాకాలం తర్వాత శిరిడీ వెళ్లాను. అక్కడ బాబాకు ఎవరేసేవ చేస్తున్నారో విచారించాను. వామనరావ్ పటేల్ ( వీరే తర్వాత శ్రీసాయి శరణానందులయ్యారు) అనే న్యాయవాది నిత్యమూ బాబాకోసం భిక్షకు వెడుతున్నాడని విని నేను కొంచెం అసూయచెంది, ‘ఆ సేవ నాకే ఎందుకివ్వగూడదు?’ అనుకున్నాను. బాబా దర్శనానికి సమయమవడం వలన నేను సూటు, బూటు, టోపీలతోనే మశీదులోకి వెళ్ళాను. అప్పుడొకరు బాబాను, ‘వామనరావ్ కు భిక్షాపాత్ర యిచ్చి గ్రామంలోకి పంపమంటారా?’ అని మూడుసార్లడిగారు. అప్పుడు బాబా అకస్మాత్తుగా నన్ను చూపి, ‘ఈరోజు పాత్ర యిచ్చి యితనిని పంపండి’ అన్నారు. నేను సూటు బూటుతోనే ఆరోజు భిక్షకు వెళ్ళాను. అటు తర్వాత నాల్గు నెలల వరకూ నేను సామాన్యమైన దుస్తులు ధరించి నిత్యమూ మధ్యాహ్నం భిక్షకు వెళ్ళాను. ఆ పనికి బాబా నన్నే ఎందుకెన్నుకున్నారో ఎవరికీ అర్థంగాలేదు గాని, హృదయాంతర్యామియైన బాబా నా కోరిక గుర్తించి, అట్టి అవకాశమిచ్చారు. ఈ సదవకాశం ఆయన కొద్దిమందికి మాత్రమే యిచ్చేవారు.

స.1917లో పూణేలోని యింజనీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయ పదవికి నేను అర్జీ పెట్టుకోవాలా అని బాబానడిగితే, ఆయన పెట్టుకోమన్నారు. ఆ ఉద్యోగానికి సంబంధించిన వారిని కలుసుకోవడానికి నేను పూణే వెళ్ళాను. పెద్ద సిఫార్సులతో ఆ పదవికి ఎన్నో దరఖాస్తులు వచ్చాయి. నా పరిస్థితి కష్టంగా వున్నది. నేను శిరిడి విడిచి పెట్టాక బాబా అచటి వారిని, ‘నార్కే ఎక్కడికి వెళ్ళాడు?’ అని పదే పదే విచారించారుట. ‘అతను ఉద్యోగ ప్రయత్నంమీద పూణే వెళ్ళాడు’ అని చెబితే, ‘భగవంతుడు అనుగ్రహిస్తాడు’ అన్నారట. అప్పుడు నాకు బిడ్డలు కలిగారా అని ఆయన మావాళ్ళను విచారించారుట. నాకెందరో బిడ్డలు పుట్టి చనిపోయారని చెబితే ఆయన తిరిగి, ‘భగవంతుడనుగ్రహిస్తాడుఅన్నారట. అలాగే నాకు 1918లో ఆ ఉద్యోగమొచ్చి, 1919లో స్థిరమైంది. అప్పటినుండీ నాకు పుట్టిన బిడ్డలు నలుగురు క్షేమంగా వున్నారు. ఇవన్నీ నాకు బాబా అనుగ్రహంవల్లనే లభించాయి.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close