సాయిరాం …
బాబా భక్తుల అవసరాలు గమనించి సరి అయిన సందర్భం లో మనకి తన సహాయాన్ని ఎప్పుడూ అందిస్తూ మన కోరికల ని నెరవేరుస్తుంటారు . కన్న తల్లి లా తన బిడ్డ కి ఎపుడు ఏది అవసరమో , ఏది శ్రేయస్కరమో అది మనకి అందిస్తూ ఉంటాడు .సాయి ప్రేమ కి సాటి రాదు. మనం మాత్రం సాయి ప్రేమ ని అర్థం చేసుకోలేక ,సాయి మన కోరిక నెరవేర్చగలిగే దయామయుడు అనే విశ్వాసం వుంచుకోలేక కొన్ని సార్లు అసహనం పొందుతాము .. ఆ సరయిన సమయం వచ్చినపుడు మన కోరిక ని బాబా నెరవేర్చడం చూసి సాయి భక్త వత్సలత జలధి లో మునిగి పోతాము .
తమిళ నాడు కి చెందిన బి. శివ కుమారి గారి అనుభవం చూద్దాము .B .E , M .TECH ,HWC పోస్ట్ లో వున్న ఈవిడ గత రెండు సంవత్సరాలలో బాబా దర్శనం కోసం 72 సార్లు షిరిడి వెళ్ళింది .ప్రతివారం బాబా దర్శనం చేసుకోడానికి వీలుగా శివప్రియ అంత పెద్ద ఉద్యోగం వదిలేసి చెన్నయ్ నుండి పూనా లో టాటా మోటార్స్ లో ఉద్యోగం లో చేరింది .తాను ప్రతి బుధవారం రాత్రి పూనా నుండి బయల్దేరి గురువారం ప్రొద్దున షిర్డీ చేరి “షిర్డీ మాఝే పండరీపుర” ఆరతి కి హాజారు అవుతుంది .బజారు నుండి పూల మాలలు కొని సంస్థాన్ మాలి కి ఇచ్ఛేది ,ఎందుకంటె బాబా కి సంస్థాన్ గార్డెన్ నుండి వచ్చిన పూల తో నే మాలలు తయారు చేస్తారు .తన ఉద్యోగం లో వచ్చే జీతం లో సగభాగం బాబా కొరకు ఖర్చుపెడుతుంది అలా ఇప్పాటివరకు సుమారు మూడు లక్షలు ఖర్చు పెట్టి ఉంటుంది. .మధ్యాహ్నం ఆరతి సాయి సమాధి దర్శన్ చూసుకొని శివ ప్రియా పూనా కి తిరిగి వెళ్ళేది.
ఇంతటి ప్రేమ సాయి పై వున్న శివప్రియ కి ఉన్నసమస్య మ్యారేజ్ .తనకి కాబోయే భర్త అందం గా లేక పోయినా పర్వాలేదు తన కులం వాడయి ఉండాలి ,పూనా లో నే స్థిరపడేవాడయి ఉండాలి, పేరెంట్స్ అంగీకారం తో తన పెళ్లి జరగాలి అనే కోరిక మాత్రం వుంది. తన వివాహం గూర్చి బాబా ని ప్రార్ధించేది .ఎంతో మంది మంచి అబ్బాయిలు ,అందమయిన వారు , పెద్ద ఉద్యోగం లో వున్నవారినయినా వద్దనేసేది ..కారణం వారు పూనా నివాసులు కారు .యిది తన తల్లి దండ్రులకి కూడా పెద్ద సమస్య గా మారింది .తల్లిదండ్రులు చాలా వేదన పడేవాళ్ళు కూతురి పరిస్థితి చూసి . ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి .సడన్ గా ఆమె కోరిక బాబా దయ వలన తీరింది . కానీ అది ఆమె కె తెలియలేదు .చెన్నై లో వుండే MBA చదివిన ఒక అబ్బాయి సంబంధం వచ్చింది ..కానీ శివ ప్రియ తల్లి ఎంత చెప్పినా వినలేదు . చివరికి బలవంతం గా ఒప్పుకున్నది .అలా ఆమె పెళ్లి తిరుపతి లో జరిగింది . తన పెళ్లి కి మొదటి ఆహ్వానం బాబా కి ద్వారకామాయి లో ఇచ్చింది కూడా.
పెళ్లి అయిన వెంటనే ఆ అబ్బాయి కి అనుకోకుండా ఆశ్చర్యం గా పూనా కి ట్రాన్స్ఫర్ అయింది . శివ ప్రియ ఆనందానికి హద్దు లేదు .అలా వాళ్ళు పూనా లో స్థిర పడ్డారు . యీవిధం గా బాబా తన భక్తురాలి కోరిక నెరవేర్చారు .. తాను అనుకున్నట్లుగానే తనకి తగిన వరుడి తో ఆమె వివాహం జరిగినది .సాయి కరుణ ఎలాంటిదో మన ఊహ కి అందని విషయమే !సాయి ఎన్నడూ తన భక్తులని నిరాశపర్చడు. సాయి ప్రేమ కరుణాలకి కొలమానం లేదు. మన అజ్ఞానాన్ని తొలగించి నిరుపమానమయిన , దివ్యమయిన సాయి ప్రేమ అర్ధమయ్యే భక్తి ని ప్రసాదించమని సాయి ని వేడుకుందాము !
జై సాయి రామ్ !
సేకరణ : మాధవి (భువనేశ్వర్)