జై సాయినాథాయ నమః !
“మంచిమంచి ఆలోచనలే మనిషికి ఒక మిత్రుడులాంటి .తప్పుడు ఆలోచనలన్నియు మనిషికి ఒక శత్రువులాంటి అనవసరపు ఆలోచనలన్నియు మనిషిని మాయలోపడవేయును . షిరిడిసాయిపై ఆలోచనలన్నియు ఆధ్యాత్మికాభివృద్ధినిచ్చును.తక్కువగ మాట్లాడాలి .ఎక్కువగా వింటూ వుండాలి * ఎక్కువగా మాట్లాడినచో , అనవసరపు మాటలొచ్చును. ఈ అనవసరపు మాటలెప్పుడు అనర్థాలనే కలిగించును . తక్కువగ మాట్లాడినపుడే ఎక్కువగా వినగలుగును మనిషి. శీల సంపదను పెంచుకోవాలని ఎవరూ ప్రయత్నించటం లేదు. ధన సంపదలు పెంచుకోవటం లోనే అందరూ ప్రయత్నిస్తున్నారు.”
“చిత్త శుద్దితో చేసిన ఏ పని అయినా చక్కని ఫలితాలను యిస్తుంది. ఇష్టమైన పనిని చేయలేనప్పుడు, చేస్తున్న పనినే యిష్టంగా మార్చుకోవాలి. భౌతిక, మానసిక, ఆధ్యాత్మికాలు మూడింటిలోను శ్రద్ద ఒక్కటే సత్ఫలితాలను యిస్తుంది. శక్తివంచన లేకుండా ప్రతి మనిషి చక్కగా పని చెయ్యాలి.”
“ఈపిరిడిసాయి సంకల్పిస్తే చేడులో నుంచి కూడ మంచి పుట్టు కాసుంది. ఎప్పుడైనా జరిగే చిన్నచిన్న విషయాల గురించి ఆందోళన చెందకూడదు. సాయికి తెలియకుండా నిజభక్తుని జీవితంలో ఏ ఒక్క పని జరుగదు. ఏది, ఎందుకు, ఎప్పుడు, ఎలా జరగాలో నిర్ణీత షిరిడిసాయే. “
“సాధకులకు లక్ష్యంపై శ్రద్ద వుంటే చాలదు. లక్ష్య సాధనలో కూడ శ్రద్ధ, ఆసక్తులు వుంటేనే సాధన ఫలిస్తుంది. విజయగాథల వెనుక వుండే రహస్యం యిదే. వికాసము, చైతన్యము, అభివృద్ది యివే మానవ జీవన పురోగతికి చిహ్నాలు.ఇదే నిజ జీవిత పరమార్థం కూడ”.
“అనుకోని సంఘటనలు ఏమి జరిగినా గాని శాంతిగాను, నిబ్బరంగాను ఉండటం మనిషికి గల ఒక నిజమైన బలము లేక ఆస్తి. ఎవరయినా , విమర్శించినప్పుడు విమర్శించిన విషయంపై దృష్టి : విమర్శించిన మనిషిపై ద్వేషం పెరుగుతుంది. ఆ విషయం పరిశీలించి అందులో తప్పు వుంటే సరిచేసుకునే వారు , ఉన్నతి ని పొందుతారు. అలా కాకుండా నన్ను విమర్శించారు, అని ద్వేషాన్ని పెంచుకునే వారు వ్యక్తిత్వపరంగా ఉన్నతి చెందలేరు, ద్వేషాన్ని చంపుకోలేరు”.
“మంచి పనులు చేసే మంచి భక్తులకు మనసు బలహీనమై భయపడుతూ వుంటే ,ఒక క్రమ పద్ధతిలో కొన్ని కొన్ని సంఘటనలను సాయి తానే సృష్టించి, పరిష్కరించి క్రమముగా వ్యవహార దక్షతను. మనోధైర్యాన్ని పెంచుతూ వుంటాడు. ఈ క్రమంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేయిస్తూ అతి పెద్ద సమస్య వరకు తీసుకువెళ్ళి , ఒక క్రమంలో దానిని కూడ పరిష్కరించి, సమర్థతను, ధైర్యాన్ని కూడ భక్తుల లో పెంచుతూ వుంటాడు సాయి. సమర్థత లేకుండా సమాజంలో షిరిడిసాయితత్వ ప్రచారం చేయటం చాలా కష్టమే”.
“దృఢ మనస్కులే కష్టనష్టాలలో కూడ ప్రశాంతంగ వుండగలరు. అలాంటి వారే ఎలాంటి ప్రలోభాలకు లొంగక అవినీతి పద్దతులను ధైర్యంగా తమ వద్దకు రాకుండ తోసి వేయగలరు. దృఢమైన మనసే నిర్భయ జీవితాన్ని ప్రసాదిస్తుంది. క్రమశిక్షణ గల మనసే మనిషికి స్నేహితుడు. బలహీనమైన మనసును షిరిడిసాయి అనుభవాల ద్వారా బలపరుస్తూ వుంటాడు”.