శ్రీ షిర్డీలో వుండే రోజులలో జబల్పూరు నుండి వచ్చిన రైల్వే అసి స్టెంటు స్టేషనుమాస్టార్ ను, కరీంనగర్ నుండి వచ్చిన “జానకీరాములు” అనే హోమియో వైద్యుని ద్వారా కలుసుకోవడం జరిగింది. ఆ భక్త మహాశయుడు చెప్పిన దివ్యలీలా విలాసాన్ని “శరణన్న కరుణించు ఆపద్భాంధవుడు” అన్న వాక్యానికి అర్థంలా, అర్థంగా నిలచిన సద్గురు సాయి కరుణా కటాక్షాన్ని ఇక్కడ గమ నిద్దాం.
ఆ భక్త మహాశయుడు జబల్ పూరునుండి వచ్చాడు పేరు చంద్రకాంత్, రైల్వేలో అసిస్టెంటు స్టేషను మాస్టరు. ప్రతి మూడు నెలలకొకసారి షిర్డి వచ్చి శ్రీ సద్గురు సాయిని, తన ప్రాణరక్షకుని దర్శించుకునే భక్త శిఖామణి .తను ఉద్యోగం చేసే ప్రాంతంలోని, రైల్వేశాఖలో రెండు వర్గాలున్నాయి. ఒకరికొకరికి పడదు. వారి కక్ష లెంతవరకొచ్చా యంటే… ఒకరినొకరు నరుక్కుని, చంపుకునే స్థితికి వచ్చారు. అటువంటి పరిస్థితులలో, ఆ రెండు వర్గాలలోని ఒక వర్గంవారు, ఈ చంద్రకాంత్ ను శతృవర్గంగా తలచి, అతన్ని చంపాలని తలంచారు.
అందుకు సర్వసన్నద్దులై కత్తులు, గొడ్డళ్ళు మొదలగు మారణాయుధాలతో ఒకరోజు చంద్రకాంత్ మీదకు విరుచుకుపడ్డారు. తన పనితాను చేసుకుని ఇంటికి బయలుదేరి వెడుతున్న చంద్రకాంత్ ‘విషయం తెలియక, మామూలుగా ఇంటికి బయలుదేరాడు. దారిలో శతృవర్గం దాడి చేసింది. వెనుకనుండి ఎవరో కత్తితో వెన్నుపోటు పొడిచారు.నిత్యం శ్రీ సద్గురుసాయి నామ సంస్మరణతో తపించి, తరించే ఆ భక్తుడు ఎప్పుడైతే తన వెన్నులో కత్తిపోటు పడిందో, అప్పుడే పంచప్రాణాలను ఒక్కటి చేసి తన ప్రాణనాధుడిని, అసహాయసహాయుని, అనాధనాధుని, ఆశ్రితవత్సలుని, అభయ ప్రదాతను, పిలచిన పలికే ప్రత్యక్ష దైవాన్ని ఎలుగెత్తి “సాయీ!” అని ఆర్తితో బిగ్గరగా పిలిచాడు. ఆ సమయంలో శ్రీ సద్గురు సాయి తప్ప అతన్నెవరు రక్షించలేరు. అటువంటి పరిస్థితది.
అంతే! వెంటనే, ఆ ఆపన్న శరణ్యుడు ఏంచేసాడో ఏమో… ఈ సద్గురు నాధునికే తెలియాలి. రెండో కత్తి పోటు అతని వెన్నును తాకేలోగా, కత్తితో పొడిచే తన మిత్రుని చెయ్యి పట్టుకుని ఆ వర్గంలోని వ్యక్తి “ఇతను ఆ ముఠాలో వాడు కాదురా. వాళ్ళకు, ఇతనికి ఏం సంబంధం లేదు. మనం పొరపాటు పడ్డాము” అనడంతో, జరిగినదానికి మరేమైన గొడవ జరుగుతుందేమోనన్న భయమో, ఆ నడిరోడ్డులో నల్గురు తమను వెంబడించి, హింసిస్తారనే అనుమానమో తెలియదు.,ఎక్కడివారక్కడ పారిపోయారు. ఈ భక్తశిఖామణి చంద్ర కాంత్ క్రిందబడి పోయాడు. ఇదే అసలైన శ్రీ సద్గురు సాయిలీల. ఈలోగా ” సైకిలుమీద ఎవరో వచ్చారు. అతన్ని సమీపించారు. రిక్షాలో ఆస్పత్రికి తీసుకు వెళ్ళి, జరిగింది చెప్పి, ఆస్పత్రిలో చేర్పిం చారు. ఆ మరుక్షణం ఇంటికి వెళ్ళి చంద్రకాంత్ పై జరిగిన హత్యాప్రయత్నాన్ని చెప్పి, అతను ఫలానా ఆస్పత్రిలో వున్నాడని, వాళ్ళవాళ్ళను ఆస్పత్రికి తీసుకువచ్చారు.
శ్రీ సద్గురుసాయి దయవలన ఆ భక్త మహాశయుడు, ప్రాణా లతో సురక్షితంగా బయటపడ్డాడు. కొద్ది నెలల చికిత్స తర్వాత ఇతరత్రా ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తనపని తాను చేసు, కుంటున్నాడు. అయితే అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి అర్థంకాని లీల…. అతన్ని ఆస్పత్రిలో చేర్చిన వారెవరు? ఇంటికి వెళ్ళి తన వాళ్ళ కావిషయం చెప్పి ఆతనికి ప్రాణభిక్ష పెట్టినవారెవ్వరు. ఎంత తరచి, తరచి ఆలోచించినా ఆవ్యక్తి వరో తెలియటంలేదు.
సేకరణ :సాయి భక్త శిఖామణి శ్రీ ఓరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు
The golden rule of interior design is less is more. You do not require to leave your furniture a single place continually.
Will help you to create more adequate lighting inside the room. http://www.diverselist.com/
LikeLiked by 1 person