ఓం శ్రీ సాయినాధాయనమః !
శ్రీ వాడ్రేవు గవర్రాజుగారి కుమారుడు శ్రీనివాసరావుగారు శ్రీ సాయినాథ మహిమను ఆనందిస్తూ, శ్రీ సాయితత్వానికి, భక్త వాత్సల్యతకు శరణాగతుడైనాడు. వారు తన స్వామి నామాన్ని శ్రీ, సాయిలీలా మకరందాన్ని మనల్ని గోలమని మనకందిస్తున్నారు.
“అది 1986వ సంవత్సరము. ఆనాటి నుండి నాకు మూత్రపిండాలలో రాళ్ళున్నందువల్ల మూత్రవిసర్జనం ఆగిపోయింది. దానివల్ల వచ్చే భరించలేనిపోటు, ప్రశాంతత లేకపోవడం, అస్థిమత్వం ఒక ప్రక్క, వైద్యచికిత్సల నిమిత్తం డబ్బు ఖర్చు మరొక పక్క ఎందరో డాక్టర్ల ను సంప్రదించాను. ఎవరు చెప్పినా ఒకటే మాట *ఆపరేషను చేయాలి!” అని
*ఆపరేషన్ . . . ” ఆ పేరెత్తితే నాకు విపరీతమైనభయం వేసేది. ఏం చెయ్యాలి? ఏమీతోచడంలేదు. ఏదో మందులు మింగుతున్నాను రోజులు గడుస్తున్నాయి. కాలక్షేపం జరుగుతోంది. ఈవిధంగా నాలు సం.లు గడిచాయి. .
1990 సం.లో ఒక గురువారం నాడు మధ్యాహ్నం విపరీత మైన నొప్పి, కడుపుబ్బరింతతో నానా ఇబ్బందిగా వుంది. ఏం చెయ్యాలో పాలుపోని సంకట స్థితి! ఆరోజు సాయంత్రం . . . అలాగే . . . . సంధ్యహారతి, పూజముగించి, అక్కడే పడుకుని నిద్రపోయాను. ఆరాత్రి స్వప్నంలో ఒక ఘంటానాదం వినిపించింది. నాకు తెలిసిందదే! తదుపరి ప్రతిరోజు విభూది నీళ్ళలో కలిపి సేవించమని చెప్పినట్లు అనిపించింది. దానిని అమలు పరిచాను.
ఆవిధంగా పది హేనురోజులు విభూది వేసిన తీర్థాన్ని తీసుకున్నాను. పదహారవరోజున మూత్రంలో నుండి కందిగింజంతటి రాయిక్రిందపడింది. కేవలం శ్రీ సాయినాథ మహారాజు కరుణగా తలంచాను. నా ఆత్మవిశ్వాసము జయించింది. బాబా కరుణిం చారు. ఎందరో డాక్టర్లు ఆపరేషను చెయ్యాలి తప్పదన్నా.
అసలు సిసలైన వైద్యనారాయణుడు శ్రీ సాయినాథ మహా రాజు కేవలం తన విభూది సేవనంతో, ఏవిధమైన ఆపే రేషను చెయ్యకుండా, తనదైన వైద్యవిధానంతో నాకు చికిత్స చేసి నన్ను కరుణించారు. శ్రీ సాయి సకాల వరద హస్తమని, ప్రత్యక్ష దైవమని ఆమహారాజు దివ్యశక్తికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఇంకేంకావాలి మనకు;
నాకు ప్రాణరక్షకుడే కాదు. మా పాలిట కల్పవృక్షము. ఆత్మబంధువు శ్రీ సద్గురు సాయినాథ మహారాజు. మా కుటుంబమంతా శ్రీ సాయిచరణదాసులే! శ్రీ సాయినాధులతోటిదే మాలోకము. మా వూహల వూపిరి శ్రీసాయినాధ సద్గురువే!
సేకరణ :సాయి భక్త శిఖామణి శ్రీ ఓరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు