జై సాయి రామ్ !
పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి ద్వారా నిర్హహించబడే సాయి కోటి మహా యజ్ఞాల్లో ,పరమ పావన సాయి నామములు నిక్షిప్తం చేస్తూ నిర్మించబడే సాయి కోటి మహా స్థూపము ల వద్ద, భక్తులు చవి చూస్తున్న సాయి లీలలు ఈ శీర్షిక న తెలుసుకుందాము.
సాయిబంధువు, బొప్పూడి పూర్ణచంద్రరావు,అసి స్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ (రిటైర్డ్)గుడివాడ, కృష్ణా జిల్లా, గారి అనుభవం తెలుసుకుందాము.
“మా అబ్బాయి కొండా బాల శ్రీనివాస్ ఉద్యోగము చేస్తున్నాడు. వ్యవసనాలకు బానిసై జీవితము పై విరక్తి కలిగి చేయకూడని పనులు చేసాడు. గురువు గారి గురించి తెలుసుకొని, 7.12.2000న రాజంపాలెంలో జరిగిన శ్రీ షిరిడి సాయి బాబా వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠలో పాల్గొని, గురువు గారిని కలవవచ్చును అనే ఉద్దేశ్యముతో రాజంపాలెం వెళ్ళాము. ఆ రోజు గురువుగారి దర్శనము కాలేదు. ఆ ప్రతిష్ఠలో మా అబ్బాయిలోని దురలవాట్లని మార్చవలసినదిగా బాబా వారిని ప్రార్థించితిని. ఫిబ్రవరి 14, 15 తేదీలలో ఏలూరు స్తూపం వద్ద జరిగిన 300 యజ్ఞములో గురువు గారిని దర్శించడము జరిగినది. వారి సత్సంగము కూడా విన్నాను. స్థూపం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మా అబ్బాయి జీవితమును మంచి మార్గములో పెట్టవలసినదిగా కోరితిని. యజ్ఞము నుంచి, తిరిగి అప్పట్లో మేముంటున్న జగ్గం పేట గ్రామము వెళ్ళేటప్పటికి మా అబ్బాయి చెడు స్నేహాలు వదలి గుడివాడలో వున్న మా తమ్ముడింటికి వెళ్ళాడు. ఆ తరువాత నవంబరు 2001లో సాయిబాబా వారి కృప వలన గుజరాత్ లో సిరామిక్ ఫ్యాక్టరీలో ఉద్యోగము వచ్చినది. మరల ఫిబ్రవరి 14, 15 తేదీలలో 2002 సంవత్సరములో ఏలూరు స్తూపము చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, యజ్ఞములో పాల్గొని మా అబ్బాయి, కోడలు కలిసి వుండేటట్లు చేయమని ప్రార్థించాను. బాబా వారు వారిద్దరిని కలిపి, కలిసి జీవించే ఏర్పాట్లు చేసెను. ఇది యదార్థముగా మా కుటుంబంలో జరిగిన విషయము నేను ధృవపరుస్తున్నాను.”
బొప్పూడి పూర్ణచంద్రరావు అసి స్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ (రిటైర్డ్)
గుడివాడ, కృష్ణా జిల్లా,
***