“అప్రయత్నంగా జరిగే అన్ని విషయాలను సాయే చేస్తున్నాడనే భావనతో జీవించేవారు దీర్గాయుష్కులౌతారు. ప్రతి దానికి భయపడుతూ జీవించేవారు అల్పాయుష్కులౌతారని ప్రస్తుత కాల సైన్స్ చెబుతూ వున్నది. సృష్టిలోని సర్వము దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుందనే భారతీయ వేదాంతం పూర్తిగా సైన్స్ ప్రకారమే వున్నదని నిరూపణ అయినది గదా! ఇలా భారతీయ వేద వాజ్ఞ్మయంలో ఎక్కువ భాగం ఆనాటి సైంటిస్ట్లైన యోగులు ఋషుల ఆవిష్కరణలే తప్ప అన్యము కానేకాదు”.
“మనిషి పడే ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం దాగి వుంటుంది. కష్టాలు, సమస్యలు అవకాశాలను ఆవిష్కరిస్తాయి. తెలిసిన వెతుక్కుని ఆలోచించి పని చేసే వారికి షిరిడిసాయి అవకాశాలను అనంతంగా అందిస్తూ వుంటాడు. ఉత్తమ ఆదర్శ ఆచరణలు మానవుని ఉన్నతికి మూలమైతాయి. “
“దృఢ సంకల్పంతో పాటు సమయ స్ఫూర్తిని పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి యువతరం. అప్పుడు వారు అనుకున్న సర్వ లక్ష్యాలను సాధించు కోగలుగుతారు. వీటన్నిటితో పాటు ఓర్పుతో పని చేయటం, ఏ మాత్రము శ్రద్ధ తగ్గని విధంగా చూచుకోవటం చాలా అవసరము. సత్సంకల్ప శక్తి సర్వకార్యాలను సాధింపజేస్తుంది. భవిష్యత్తు ఆశయాలను ముందుగానే నిర్ణయించుకుని పట్టుదలతో కృషి చేయాలి”
“ప్రేమ పూరితమైన సాధన మాత్రమే ఆధ్యాత్మికంలో పని చేస్తుంది. ధ్యానం చేసే ధ్యానులు ఆత్మానందామృతాన్ని నిరంతరం ఆస్వాదిస్తూనే వుంటారు. సాధనకు ఏకాగ్రత, సమయ సద్వినియోగం చాలా ముఖ్యం. జీవిత మాధుర్యమంతా ధ్యాన తపో సాధనల నుంచే లభిస్తుంది. వ్యక్తిత్వ వికాసము, సద్గుణాల గుబాళింపులు లేని ధ్యానతపస్సులు ఫలించవు. నైతిక విలువలు లేని ఆధ్యాత్మికం అభివృద్ధి చెందదు.”
“అమాయక ప్రేమకు తొందరగా అందుతాడు షిరిడిసాయి. నిర్మల ప్రేమకు సాయి తొందరగా వశమౌతాడు. భక్త సులభుడు ఈ కొండమడుగు అభయసాయి. ఐశ్వర్య, అర్థబల, అంగబలాలన్నియు సాయి దైవబలంలేక వ్యర్థమౌతాయి. దైవబలం పరోపకార సత్ర్పవర్తనల వలననే వస్తాయి.అవక్రవిక్రముడు, అజితుడు అయిన షిరిడిసాయి ఆర్తితో, తపనతో, ఏకాగ్రతతో, మనసావాచాకర్మణా నమ్మిన ప్రతి జీవికి వశుడౌతాడు, లొంగిపోతాడు కూడ అని అంతరాత్మ సూచించినది. కోరికలు, కర్మలు కూడ సాయికే అర్పించాలి. చిత్రాతిచిత్రమైన, ఆకర్షణకరమైన, సర్వాంగ సుందరమైన ఈ సృష్టిని వదిలి సాయిని సేవించే వారికి సత్యదర్శనం చేయిస్తాడు షిరిడిసాయి. సాయి యొక్క ఈ అనంత సృష్టి మనిషి జ్ఞానానికి అందేదికాదు.”
i am always following sai baba
LikeLiked by 1 person
Nice
LikeLike