జై సాయి రామ్ !
పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి ద్వారా నిర్హహించబడే సాయి కోటి మహా యజ్ఞాల్లో ,పరమ పావన సాయి నామములు నిక్షిప్తం చేస్తూ నిర్మించబడే సాయి కోటి మహా స్థూపము ల వద్ద, భక్తులు చవి చూస్తున్న సాయి లీలలు ఈ శీర్షిక న తెలుసుకుందాము.
సాయి బంధువు ఎన్. సామ్రాజ్యం ,గుంటూరు గారి అనుభవం తెలుసుకుందాము.
మొదటిగా మేము రేపల్లె వెళ్లినపుడు (యజ్ఞమునకు) మా బాబు ఉద్యోగం గురించి గురువుగారిని అడిగాను. “మీరు వారం పారాయణం చేసి తరువాత ఏలూరు లక్ష్మీపురం గార్డెన్స్ లో ఉన్న సాయి కోటిస్తూపము వద్దకు వెళ్లి, ఆస్తూపము చుట్టు 11 ప్రదక్షణములు చేసి రండి “ అని చెప్పినారు. మా బాబు వారం పారాయణ చేసినాడు, కానీ స్తూపం వద్దకు వెళ్లలేదు.
ఉద్యోగమునకు ఇంటర్వ్యూ కార్డు వచ్చినది. మరల గురువు గారిని గుంటూరు రైల్వే స్టేషన్లో కలిసినాము. గురువుగారితో మా బాబుకి ఇంటర్వ్యూ కార్డు వచ్చినది అని చెప్పినాము. మరల గురువుగారు మొదట చెప్పిన విధముగా చేయమని చెప్పినారు. అప్పుడు గురువు గారు చెప్పినట్లుగా మా బాబు చేసినాడు. తరువాత రిటన్ టెస్టుకు వెళ్లినాడు. తరువాత ఇంటర్వ్యూ కార్డు వచ్చినది. తరువాత మేము ఏలూరు వెళ్లినపుడు గురువుగారికి ఇంటర్వ్యూ కార్డు చూపించినాము. గురువుగారు చూచి మీరు ఈ కార్డుని బాబా పాదముల వద్ద పెట్టి స్తూపం చుట్టూ ప్రదక్షణలు చేయమని చెప్పినారు. చేసివచ్చిన తరువాత 12 రోజులకు సెలక్టు ఆర్డరు వచ్చినది. ఈ ఇంటర్వ్యూ కార్డు గురువుగారు తాకి మాకు ఇచ్చినారు కాబట్టి. బాబా ఆశీస్సులు, గురువుగారి వాక్కు ప్రకారము నా బిడ్డకు ఉద్యోగం లభించినది.
అలాంటి గురువును బాబావారు మాకు ప్రసాదించినందుకు మేము ఎంతో ధన్యులము. గురువుగారి పాదపద్మములకు శతకోటి వందనములు.
.
.