సాయి తో నా అనుభవాలు ..
సాయిరాం!
నేను 11 ఏప్రిల్ లో జరిగిన ఎలక్షన్ డ్యూటీ కి వెళ్ళడము జరిగింది . ఎలక్షన్ కి ఒక రోజు ముందు గానే సంబంధిత ప్రదేశానికి ఎన్నికల అధికారులు EVMs తీసుకుని , కావాల్సిన సామగ్రి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది . ఈ సారి నాకు ఒక మారుమూల చిన్న గ్రామం లో ఎలెక్షన్ డ్యూటీ రావడం జరిగింది .ఎన్నికలు జరిగే ఆయా ఊర్లను రూట్ లు గా విభజించి ఒక్కో రూట్ కి సంబంధించిన టీమ్స్ అందరినీ బస్సెస్ లో ఆయా ప్రాంతాలకి పంపడం జరుగుతుంది . అలా మా టీం లో ని అందరమూ ఆ రూట్ లో ని మిగితా టీమ్స్ తో కలిసి డ్యూటీ కీ ఏప్రిల్ 10 వ తేదీ న బయలుదేరినాము . బస్సు లో అంతా అక్కడ వసతి ఎలా ఉంటుందో అని టెన్షన్ పడ్డాను . బాబా ని వేడుకున్నాను .ఎందుకంటె , ఎన్నికలు సాధారణం గా ఆయా ప్రాంతాల్లో ని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతాయి . నాకు అలౌట్ చేయబడిన ప్రాంతం మారుమూల కుగ్రామం కాబట్టి కొంచం టెన్షన్ పడ్డాను . అనుకున్నట్లు గానే అక్కడ అలాగే వుంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు .స్త్రీల స్నానాలకు ఇబ్బంది గా వుంది . ఎలా అనుకుంటుండగా సాయి తన సహాయం అందించాడు . నాతో పాటు మా టీం లో వున్న మరో ఆవిడ కి సంబంధించిన బంధువులు అదే వూరు అని తెలిసింది . మేము మరుసటి రోజు కి సంబంధించిన పనుల కి అన్నీ రెడీ చేసుకునేసరికి రాత్రి అయింది . ఆవిడ వాళ్ళ బంధువులింటికి వెళ్ళడానికి మా PO ని అనుమతి తీసుకుని తన తో పాటు నన్ను కూడా తీసుకెళ్లింది .అలా బాబా నా సమస్య కి అనుకోకుండా పరిష్కారం చూపాడు ..ఒకవేళ ఆ స్కూల్ లో నే , క్రింద పడుకుంటే నాకు విపరీతమయిన నడుము నొప్పి వచ్చేది , అలాగే స్నానాలకు ఇబ్బంది గా ఉండేది..అలా ఎట్టి ఇబ్బంది లేకుండా పడుకోవడం వల్ల మరుసటి రోజు నేను ఎన్నికల విధులు సమర్ధవంతం గా చేయగలిగాను .
సాయి దయ సాటి రానిది . మనం మనస్పూర్తి గా చెప్పుకున్న ఏ సమస్య నయినా సాయి అర్థం చేసుకుని వారికీ తగిన పరిష్కారం తప్పక చూపెడుతుంటాడు . సాయి మనకు పరిచయం కాక పోయి ఉంటే , మన జీవితం వూహించుకోడానికే భయం గా ఉంటుంది . సాయి ప్రేమ చాలు మనకు ఈ జీవితం ఆనందం గా గడపడానికి
జై సాయి రామ్ !