♥బాబా విభూతి లీల
జై సాయినాధా !!
విశ్వాసం తో వున్నవారికి “సర్వ రోగ నివారిణి- సర్వ శక్తి ప్రదాయిని ” అయినటువంటి సాయి విభూతి మహిమ ని తెలుసుకుందాము.
“1992 సంవత్సరం సెప్టెంబర్ వరకు నాకు బాబా అంటే తెలియదు.నాకు చాలా సుస్తీ చేసినది . కాకినాడ హాస్పిటల్ లో మరియు హైదరాబాద్ మేడినోవా హాస్పిటల్ లో నాకు పరీక్ష లు చేసి నేను ఎక్కువ కాలం బ్రతకనని డాక్టర్స్ నిర్ధారించి చెప్పినారు .ఇంకొక ప్రయత్నముగ నన్ను బొంబాయి ఆస్పత్రికి తీసుకెళితే బాగుంటుంది . అదీ ఆయిన గ్యారంటీ చెప్పలేము అని అన్నారు
డాక్టర్స్ “అయినా,ఏదైన ప్రయత్నము చేసి చూడండి మీ అదృష్టం” అనీ అన్నారు, ఈ లోపల మా మేనకోడలు బేబీ షిరిడి నుండి వచ్చి నాకు ఆరోగ్యము బాలేనందున బాబా ఫోటో తెచ్చి నా తల ప్రక్కన పెట్టి, విభూదీ బొట్టు పెట్టి, నోటిలో విభూది వేసినది. నాకు ఆరోగ్యముగా ఉన్నట్లు అనిపించింది. ఈలోగ మా ఇంట్లో వారు బొంబాయి ట్రైను టికెట్లు రిజర్వేషను గురించి చూస్తున్నారు. ఈలోగ రెండు రోజూ లు గడచినవి. తెల్లవారితే మూడవ రోజు 5.00 గ.లకు బాబా గారు కల లో కన్పించి నా కుడి భుజము చరిసి,” నీకు ఆపరేషను పడదు. పిల్లా, పాపలు తో సంతోషముగా ఉంటారు. నువ్వు నవ్వుతూ ఇంటికి వెళతాపు, నీకు ఏ లోటురాదు” అని అన్నారు. ఈలోగ ఆస్పత్రి నుండి నా రూముకి కబురు అందినది నన్ను రమ్మనమని. నేను వెళ్ళిన తరువాత డాక్టర్లు 5, 6 మంది టెస్టులు చేసి ఇదీ అంతా మామూలుగా ఉన్నది. మొన్న ఉన్నంత సీరియస్గా లేదు. బొంబాయి వెళ్ళనవసరము లేదు అని అన్నారు డాక్టరు.
ఆ తరువాత నేను షిరిడి బయలు దేసి వెళ్ళినాను. వెళ్ళిన తరువాత నా మనస్సులో బాబా నీ గుడి మా ఊరు కూనవరంలో కడతాను అని అనుకున్నాను. నేను షిరిడిలో మూడు రోజులు ఉన్నాను. ఈ మూడు రోజులలో షిరిడిలో జరిగిన అనుభవాలు. ట్రైనులో నాతో కలసిన ఒక స్నేహితుడు ఇద్దరం కలసి బాబా పూజకు కొబ్బరి కాయ, పూల దండ ఉంచిన ఎదురుగా పళ్ళెములు రెండు సెట్లు కొన్నాము. ఇద్దరం గుడికి వెళ్ళుతుండగ, ఈ పళ్ళెము మీది, ఈ పళ్ళెము నాది అని మార్చినారు. పూజ ముగిసినది మరల బయటకు వచ్చి కొబ్బరి కాయలు కొట్టటం జరిగినది. నా స్నేహితుని కొబ్బరి కాయ కుళ్ళిపోయినది. నా కొబ్బరి కాయ బాగ ఉన్న ది. బాబాకు శాలువాలు కొన్నాము. అందరుకు అక్కడ పూజార్లు బాబా పాదాలకు ముట్టించినారు. నా శాలువా కూడ ఇచ్చాను; నా శాలువాతో బాబా ముఖము, పాదాలు సమాధి తుడిచి నాకు ఇచ్చినారు. ఇది సంతోషమైన అనుభవము .”
నీడి సుందర్ హరిహరరావు,
కూనవరం