ఓం శ్రీ సాయినాధాయనమః !
సాయిరాం ! సాయి పై అమితమయిన విశ్వాసం ప్రేమ కలిగిన ఒక సాయి భక్తురాలి సాయి అనుభవం మీ ముందుకు తీసుకొస్తున్నందుకు చాల ఉద్వేగానికి గురి అవుతున్నాను .ఎందుకంటె ఈ లీల లో ఆ భక్తురాలు అనుభవించిన సాయి ప్రేమోద్వేగం అలాంటిది .
మా పట్టణం లో నే నివాసముంటున్న శ్రీమతి మీనా గారు పంపిన లీల ఇది . గవర్నమెంట్ టీచర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తను కాన్సర్ బారిన పడినా కూడా సాయి పై చెదరని విశ్వాసం తో భక్తి తో కాన్సర్ ని కూడా జయించారు . మనం ఏ చిన్న జ్వరం వచ్చినా బాబా నాకెందుకీ బాధ కలుగ చేస్తున్నాడు అని అనుకుంటాము . అలాంటిది తనకి ఎంత అనారోగ్య సమస్య వచ్చినా , పరామర్శించడానికి నేను వెళ్తే ,బాబా వున్నాడు , తనే నన్ను చూసుకుంటాడు అని ఆవిడ ధయిర్యం గా చెప్పేది . ఆ నమ్మకమే ఆమెను కాపాడింది ..బాబా ఆమెను ప్రాణాపాయం నుండి కాపాడారు . ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు . ఆరోగ్యం కాస్త మెరుగు పడినది.
మీనా గారికి బాబా చూపిన మరొక అనుభవం తెలుసుకుందాము.
“ఓం శ్రీ సాయినాధాయనమః!
“సాయి మార్గం నాకు చూపిన పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి కి నా యొక్క పాద నమస్కారములు . అలాగే గురుదేవుని అందించిన సాయి భక్తురాలి మేలు మరువలేను.
నేను ఎక్కువగా కృష్ణుణ్ణి పూజించేదాన్ని . కానీ అనుకోకుండా నా మనస్సు సాయిబాబా గారి వైపు మళ్లింది. ఈ 5 సంవత్సరాల కాలం లో నే ఎన్నో లీలలు సాయి నాకు చేయించారు .నా బాబు కి వుద్యోగం దొరకాలని బాబా ని మ్రొక్కుతూ , నెలకు నా సంపాదన లో 2000 జమ చేసేదాన్ని . బాబు కి వుద్యోగం దొరికిన తరువాత షిర్డీ కి వెళ్లి హుండీ లో వేద్దామని నా ఆలోచన న. బాబు కి సాయి దయ తో ఉద్యోగం దొరికింది .నా బాబు ఉద్యోగం నుండి వచ్చే మొదటి నెల సగం జీతం ,నేను జమ చేసిన 36 వేలు షిరిడి కి వెళ్లి సమాధి మందిరం లో హుండీ లో వెయ్యాలని నా కోరిక. దానికి చాలా ప్రయత్నం చేసాను షిరిడి వెళ్లాలని. కానీ బాబా గారి అనుమతి దొరకలేదు షిరిడి ప్రవేశించడానికి . నా ఇద్దరు కొడుకుల వివాహాలు కూడా అయిపోయాయి , నేను కాన్సర్ వ్యాధి నుండి ప్రాణాలతో బయట పడ్డాను , చికిత్స తీసుకుంటున్నాను . అంతా బాబా దయ . తరువాత నా బాబు లిద్దరికీ చెరొక పాప జన్మించారు . ఒక పాప పేరు సాయి నామం కలిపి పెట్టాను .పాప కి 11 నెలలు వచ్చినాయి ఈ మధ్యే . ఇక ఇప్పుడయినా నా మొక్కు తీర్చుకుందామని మా పాప పుట్టు వెంట్రుకలు తీయడానికి ఎంతో ప్రయాస, ప్రయత్నం తో శిరిడి వెళ్లాము. ఆనందము గానా మొక్కు తీర్చుకున్నాను .నేను జమ చేసిన డబ్బు ,నా బాబు మొదటి నెల సగం జీతం బాబా సమాధి మందిరం లో హుండీ లో వేసాము .యింత కాలం తరువాత ఇపుడు నా కల నేర వేరింది అని చాలా సంతోషాన్ని పొందాను .
రెండో సారి దర్శనం చేసుకుందామని పాస్ తీసుకుందామని లైన్ లో నించున్నాము .చాలా రద్దీ గా వుంది . దర్శనం కి రెండు గంటలు సమయం పడుతుంది అన్నారు .మొదటనే నేను పేషేంట్ ని.రెండు గంటలనగానే నేను చాల భయపడ్డాను .నిస్సత్తువ తో అక్కడే కూర్చుండిపోయాను . బాబా ఈ రోజు నీ దర్శనం చేసుకోగలనా? నిన్ను చూస్తానా లేదా బాబా అని కన్నీళ్ల తో బాబా ని ప్రార్ధించాను . విచిత్రం !!! నా ఎదుట అంత లోనే మా చుట్టాలమ్మాయి కనిపించింది . సాయి సేవకురాలు డ్రెస్ లో .. సాయి సేవకి షిరిడి కి వచ్చిందట నన్ను చూసి నా దగ్గరికి వచ్చింది నన్ను పలకరిస్తూ .ఆ అమ్మాయి మమ్మల్ని(నేను నాతో పాటు వున్నఒక పెద్దావిడ ) ని చూసి మా పరిస్థితి గమనించి నా చేయి పట్టుకుని ఆలయాని కి నడిపించింది .తనకి అక్కడ తెలిసిన వారిని రిక్వెస్ట్ చేసి మేము అర్థ గంటలో నే దర్శనం చేసుకునేలా చేసింది.ఆమె నా చేయి పట్టుకుని తీసుకుని వెళుతుంటే నా సాయి నన్ను జాగ్రత్త గా తీసుకు వెళుతున్నాడు అనిపించింది . అలా అర్ధగంట లో బాబా సమాధి మందిరం లో ప్రవేశించాము .ఆనంద భాష్పాలతో సాయి ని దర్శించుకున్నాను . ఇప్పుడు నీ కోరిక నెరవేరినదా ? అని సాయి చిరునవ్వు తో నన్ను అడుగుతున్నట్లు అనిపించింది .
షిరిడి వెళ్లి వచ్చిన తరువాత చాలా ఆనందము గా, మానసికం గా దృఢం గా ఉంటున్నాను .శారీరకం గా ఎన్ని బాధలున్నా, నా ఆశ నా శ్వాస నా ప్రాణం నా సర్వం బాబా వారే ..బాబా నీ లీలలు అమోఘం అపూర్వం ..మీరు నాపై చూపే ప్రేమ ఎంత చెప్పినా తక్కువే బాబా ! సదా మా వెంట వుండు బాబా !”
తనకి సంపూర్ణ ఆరోగ్యము ఆనందాల్ని ప్రసాదించాలని సాయినాధుడి ని , పూజ్య గురుదేవులని హృదయ పూర్వకం గా ప్రార్ధిస్తున్నాను . తన కి బాబా పై గల ప్రేమ , విశ్వాసాలు సాటి లేనివిఅలాంటి భక్తి ప్రపత్తులు మనందరమూ కలిగి సాయి ని మన ప్రాణం గా ప్రేమించెదము గాక .
జై సాయి రామ్ !