శ్రీ సాయిరాం!
గత కొన్ని రోజులలో సాయినాధుడు నాకు కల్గించిన సాయి అనుభవము.. అందరికీ తెలిసిన చిన్న విషయమే అయినా అది నా మనసుకి శాశ్వత శిక్షణ ని కలిగించినది . సాయి తీరే వేరు . కొన్ని కొన్ని సంఘటనలు పరిస్థితులను మన కి ఎదురయ్యేలా చేసి మానవ బంధాలు ఎంత అశాశ్వితమయినవో , ఏది నిత్యమో, ఏది మనము ఆశించ తగునో మనమే గ్రహించేలా చేస్తాడు . మన జీవితం లోని కష్ట నష్ట అవమానాల కి కారణాలు మనమే గ్రహించేలా అనుభవ పూర్వకం గ బోధిస్తారు . గ్రహించగలిగే నేర్పు వుండాలి కానీ మనకి ఎదురయ్యే ప్రతి సంఘటన సాయి మనకి నేర్పే కొత్త పాఠమే .
నేను సాధారణం గా, ఎప్పుడూ స్నేహితులు దొరకాలని ఆరాటపడుతూ వుంటాను . సమాజం లో ని కొందరు నా పరిచయస్తులని నాకు ఆప్తులు గా భావించి వారి స్నేహం కోసం తపన పడుతూ కాస్త ఎక్కువగానే వారి గూర్చి ఆలోచిస్తూ వుంటాను .మానవ సంబంధాలు అశాశ్వతం అని తెలిసినా సాయి కన్నా ఎక్కువ విలువను నాకు తెలియకుండానే వారికీ ఇస్తూఉండేదాన్ని . అంటే,ఎదుటివారిని నా సన్నిహితులుగా భావించడం వలన నా ప్రతి కష్టం లోను ఎదుటివారి ఓదార్పు, సానుభూతి ని ఆశిస్తూవుండేదాన్ని.కానీ వారు సహజం గానే నా గూర్చి పట్టించుకోకపోయేసరికి విపరీత వేదన ని అనుభవించేదాన్ని. అలా ఎన్నో సంవత్సరాలుగా విపరీత మయిన ఒంటరితనపు వేదన లో కృంగిపోయాను .
మొన్న శుక్రవారం నాకు యశోద హాస్పిటల్ లో ఒక సర్జరీ వుంది. ఆ సందర్భం గా కల్గిన ఆవేదనా ఏమో కాని గురువారం బాబా ముందు కూర్చుని, నా మనసులోని అభద్రతా భావం, ఆవేదన అంత బాబా కి మనస్పూర్తి గాచెప్పుకున్నాను ,” బాబా నువ్వే గనుక , గురువుగారే గనక ,నాతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే ,యితరుల స్నేహం నాకు అనవసరం కదా బాబా …బాబా నాతో మాట్లాడవా” అని చాలాసేపు ఏడ్చాను .అదేరోజు హాస్పిటల్ లో జాయిన్ అయ్యాక, ఒక సాయిసేవక్ కి అనుకోకుండా కాల్ చేయడం జరిగింది. ఆవిడ తన సాయి అనుభవం చెపుతూ వున్నారు . ఆవిడా మాట్లాడే మాటలు అన్ని నా ఆవేదన కి సమాధానాలు గా అనిపించాయి . ” అమ్మ, నువ్వేమి బాధపడకు , మన గురుదేవులకు(శ్రీ అమ్ముల సాంబశివరావు గారు) మనమంటే చాల ప్రేమ తల్లీ , అందరినీ సమానం గా చూస్తారు తన పిల్లలుగా .నువ్వు ఫలానా తారీకు న నా దగ్గరికి రా , గురువు గారిక్కడికొస్తారు .నీ గూర్చి చెప్తాను, గురువు గారి తో మాట్లాడిస్తాను ” అని అన్నారు . ఇది అస్సలు నేను ఊహించలేదు . ఆ ఉదయమే బాబా ని నాతో మాట్లాడండి అని ప్రార్థించినదానికి సమాధానామే ఈ ఊహించని అవకాశం . మేము గురుగారి తో సంభాషణ అంటే స్వయంగా సాయి తో సంభాషణే అని విశ్వసిస్తాము ఎందుకంటె ఆ మహానుభావుడి దేహం లో కొలువయి వున్నాడు సాయిదేవుడు..అందుకే గురువు కి దేవుడికీ తేడా ఉండదు. మనస్ఫూర్తిగా అడగ్గానే ఇలా సాయి స్పందించిన తీరు కి చాలా ఆనందపడ్డాను..మన మనసు పిలిచే ప్రతి పిలుపు కి ఎంతో ఆర్ద్రతగా బదులు పలికేది సాయినాధుడొక్కడే!! సాయి పట్ల మన ప్రతి భావావేశము వృధా పోదు .అలాగే ఆ సాయిసేవకురాలు నాకు తన ఆశయం అయిన సాయి మందిర నిర్మాణం లో అడుగడుగునా సాయి ఎలా అన్ని సమకూర్చారో ఎలా సహాయం చేసారో నాకు తెలియ జేసి నా భయాలను పోగొట్టారు .బాబా ఆ భక్తురాలి ద్వారా అలా నన్ను ఊరడించారనిపించింది.
ఇక మరుసటి రోజు అనగా శుక్రవారం నాకు ఆపరేషన్ . ఆపరేషన్ కి ముందు కావాల్సిన అరేంజ్మెంట్స్ కోసం నన్ను 5 గంటల ప్రాంతం లో నర్సు లు ఒకసారి వచ్చి నిద్ర లేపడం జరిగింది . నేను నిద్ర లేచి మల్లి అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాను . అంతలో, గురువు గారు ప్రత్యక్షం అయ్యారు. కనులు మూసుకునే నేను గురుగారిని చూస్తూ వున్నాను, మడిచిన చేతి ని వెనక్కి పెట్టుకుని నన్ను గంభీర వదనం తో పరిశీలిష్ఠున్నట్లుగా చూస్తున్నారు . లేవమని చెప్తున్నారో లేదా ఆపరేషన్ ముందు నాకు ధాయిర్యం చెప్పడానికి దర్శనం ఇచ్చారో,వారికే తెలుసు . కానీ నను కనిపెట్టుకుని నన్ను వారు అనుగ్రహించిన తీరు నాలో సాయి (గురు ) ప్రేమ పట్ల ఇంకా నమ్మకాన్ని కలిగించింది .ఆ తర్వాత ఆపరేషన్ సక్రమం గా జరిగింది . .ఆ మరుసటి రోజు వరికి హాస్పిటల్ లో నే వున్నాము . మరుసటి రోజు ముక్కులో నుండి రక్తం వచ్చేసరికి చాలా భయం వేసింది . నర్స్ ని గట్టిగ పిలవాలన్నా , సర్జెరీ వలన మాట్లాడ్డం ఇబ్బంది గా వుంది .నాతో పాటు వున్న నా కుటుంబ సభ్యులని అడిగితే తాను అంత గా పట్టించుకోలేదు. ముక్కు ఆపరేషన్ కాబట్టి అది కామన్ అని తాను అభిప్రాయపడింది .కానీ నాకు మాత్రం చాలా ఆందోళన కల్గి మనసులో, “బాబా నేనిపుడు డాక్టర్ ని పిలిచే పరిస్థితి లో లేను. నువ్వే డాక్టర్ ని నా దగ్గరకి రప్పించు” అనుకున్నాను . ఆశ్చర్యం ! వెంటనే డాక్టర్ అక్కడ నా బెడ్ ముందు వున్న కౌంటర్ దగ్గరికి నర్స్ తో ఏదో మాట్లాడ్డానికి వచ్చాడు .అలా డాక్టర్ ని పిలిచి నా ప్రాబ్లెమ్ పరిష్కరించుకున్నాను . హొప్స్పిటల్ లో వున్నపుడు ,నా సర్జరీ గూర్చి తెలిసిన వారు నాకు కనీసం మెసేజ్ చేసి ఎలా వున్నారు అని పరామర్శిస్తారని ఆశించి భంగపడ్డాను .ఎవరు కూడా ఫోన్ చేసి అడగలేదు మెసేజ్ పెట్టలేదు.శనివారం నాడు నన్ను డిశ్చార్జ్ చేశారు .
తిరిగి వచ్చేప్పుడు హాస్పిటల్ బయటికి కారు ప్రవేశించగానే ద్వారకామాయి లో కూర్చుని వున్న అందమయిన ఫోటో రూపం లో సాయి కనిపించారు.దారిలో వీల్ అలైన్మెంట్ కోసం మెకానిక్ షెడ్ లో ఆగాము . అక్కడా సాయి ఫోటో రూపం లో దర్శనం ఇచ్చారు . ఆపరేషన్ రోజు నుండి యింటికి వెళ్లెవరకూ సాయి అడుగడుగునా నా వెంటే వున్నారని అర్థం అయ్యింది .
ఆపరేషన్ వలన నోస్ బ్లాక్ అయ్యి నోటి తో నే వారం రోజుల పాటు గాలి పీల్చుకోవాలని డాక్టర్స్ సూచించారు . మొన్న ఆదివారం శ్వాస కోశం లో కఫం అడ్డు పడి నోటి తో కూడా గాలి అందని పరిస్థితి వళ్ళ వూపిరాడక చాలా తల్లడిల్లాను . నా కుటుంబ సభ్యులకి సైగలా తో నే ఊపిరాడట్లేదని , లోకల్ హాస్పిటల్ కి వెళ్ళడానికి ఆటో త్వరగా తెమ్మని సైగ చేసి చెప్పాను . కానీ వాళ్ళు చాలా నెమ్మది గా ఆలస్యం చేస్తోన్న తీరు చాలా విస్మయానికి గురి చేసింది . ఒక వైపు నా ఊపిరి ఆడటం లేదు . అయినా వాళ్ళు ఆటో తేవడానికి డ్రెస్ మార్చుకుని బయటికెళ్లడానికి కూడా పడుతున్న విసుగు ని చూసి నా కన్నీళ్లు ఆగలేవు . సాయి నాధుడు యిలాగే ఆలస్యం చేస్తాడా అని అనిపించింది . కానీ మానవ సంబంధాలు ఎంత స్వార్థ పూరిత మయినవో నా కళ్ళకి కట్టినట్లు చెప్పడానికే సాయి నాధుడు ఇవన్నీ జరిపిస్తున్నాడనిపించింది.. ఎలాగో ఆటో తెచ్చారు . కాలనీ లో నే వున్న మాకు తెలిసిన డాక్టర్ నెబిలైజషన్ పెడతారేమోనని వాళ్ళింటికి వెళ్ళాము .అది సాయంత్రం అయిదున్నర . ఆరింటికి ఆ డాక్టరు క్లినిక్ కి వెళ్తాడు . అప్పటిదాకా రెస్ట్ తీసుకుంటాడు .ఎమర్జెన్సీ కేసు కాబట్టి తప్పక ట్రీట్మెంట్ చేస్తాడు అని నమ్మకం తో వెళ్లాను . పైగా మాములు సమయాల్లో, చాలా సహాయం చేసే వ్యక్తి లా చొరవగా మాట్లాడుతుంటారు. కాబట్టి హెల్ప్ చేస్తారు అనుకున్నాను . తీరా వారి నుండి వచ్చిన సమాధానం .” నేను రెస్ట్ తీసుకుంటున్నాను . ఆరున్నర కి రండి ” అని .. మరో హాస్పిటల్ లో వెళ్లగా, సండే కాబట్టి డాక్టరు పైన వున్న తన ఫామిలీ తో గడుపుతారట . ఏ కేసు చూడరట . చివరకి మెడికల్ స్టోర్ నుండి నెబిలైజషన్ కిట్ కొనుక్కుని ట్రీట్మెంట్ నాకు నేనే చేసుకోవాల్సి వచ్చింది .అప్పటివరకు నేను పడిన యాతన భరించరానిది. పక్కవాడు చస్తోన్నా తన స్వంత లాభం ఉంటేనే స్పందించే ఈ మనుషుల మనస్తత్వాలు నాకు సరిగ్గా అర్థం అయ్యేలా భోదించారు సాయి .నా ప్రతి ఆలోచన సాయి కి కేటాయించకుండా , అనవసరమయిన వారి కోసం అలోచించి నా విలువయిన సమయాన్ని వృధా చేసుకుంటున్నాను అని తెలిసింది . ఆ సమయం లో నే .. “Who else will protect you except me.. they all are just sake of name… nobody will come to your help when you really need them..Only trust me..I will never break your trust: Sai Baba
” I will give my hand first to those who are in deep pain and problems… Solving their problems is my first priority: Sai Baba” అని ఫేస్బుక్ పేజీ “sai yug network” వారి ఆ రోజటి సాయి మెసేజస్ ద్వారా సాయి సందేశాలు ఇచ్చారు.